Skin Care: అరటి తొక్క తో అందం పెరుగుతుందా? ఇలా రాస్తే చాలు
అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేయకండి. దానితో మీ ముఖాన్ని మెరిసిపోయేలా చేయవచ్చు.. మరి, ఈ అరటి తొక్కను ఎలా వాడాలో తెలుసుకుందాం...

ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం చాలా రకాల వస్తువులు కొని వాడుతుంటారు. కొందరు ముఖం మెరవడానికి ఖరీదైనవి కూడా కొంటారు. కానీ ఫలితం ఉండదు. డబ్బు వృథా చేయకుండా, ఏమీ వాడకుండా సహజంగా మెరుపు తెచ్చుకోవచ్చని తెలుసా? అరటి తొక్కతో మీ ముఖానికి మెరుపు వస్తుంది.

మచ్చలు మాయం: అరటి తొక్క చర్మానికి చాలా మంచిది. దీన్ని వాడి మీ ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు. అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖానికి రుద్ది, నెమ్మదిగా మసాజ్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చర్మంపై ఉండే డెడ్ సెల్స్ మొత్తం పోతాయి.
మొటిమలు దూరం: మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఉంటే అరటి తొక్క బాగా ఉపయోగపడుతుంది. అరటి తొక్కను మెత్తగా రుబ్బి, అందులో పెరుగు, రోజ్ వాటర్ కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఇది మొటిమలు, మచ్చలు పోగొట్టి, ముఖాన్ని మెరిపిస్తుంది.
ముడతలు తగ్గుతాయి: అరటి తొక్కలో తేమను ఇచ్చే గుణాలు ఉండటం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముడతలు రాకుండా చేస్తుంది. అరటి తొక్క చర్మంలో కొల్లాజెన్ పెంచడానికి, తేమను ఇవ్వడానికి సహాయపడుతుంది. దీని కోసం అరటి తొక్క ఫేస్ ప్యాక్‌తో పాటు విటమిన్ ఇ క్యాప్సూల్, ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాయాలి.
అరటి తొక్క ఫేస్ ప్యాక్: అరటి తొక్కను మిక్సీలో వేసి రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో కొంచెం తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

