జుట్టుకు అరటి పండును ఇలా పెట్టారంటే జుట్టు సమస్యలే ఉండవ్..
అరటిపండును తినడమే కాదు.. దీనికి జుట్టుకు కూడా పెట్టొచ్చు. దీనివల్ల మనం ఎన్నో జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం అరటిపండును జుట్టుకు ఎలా పెట్టాలంటే?

అరటి హెయిర్ ప్యాక్
అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అందుకే అరటిపండును రోజూ ఒకటి తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇది కేవలం ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు మన జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, విటమిన్లు, నేచురల్ ఆయిల్స్, కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన జుట్టు మంచి పోషణను అందిస్తాయి.
అరటిపండు హెయిర్ ప్యాక్ వెంట్రుకలను సాఫ్ట్ గా చేస్తుంది. అలాగే నెత్తిమీద తేమను నిలుపుకునేలా చేస్తుంది. అరటిలో సిలికా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని జుట్టుకు పెట్టుకుంటే జుట్టు మందంగా అవుతుంది. అలాగే నెత్తిమీద కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు అరటి హెయిర్ ప్యాక్ జుట్టుకు మంచి రంగును అందిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
అరటి హెయిర్ ప్యాక్
అరటిపండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నెత్తిమీద చుండ్రు ఎక్కువగా ఉంటే నెత్తి చిరాకు పెట్టడం, దురద పెట్టడం, జుట్టు పొడిబారడంతో పాటుగా హెయిర్ ఫాల్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. నెత్తిమీద తేమలేకపోవడం వల్ల కూడా చుండ్రు ఏర్పడుతుంది. అయితే జుట్టుకు అరటి ప్యాక్ ను వేసుకుంటే నెత్తి తేమగా ఉంటుంది. అలాగే చుండ్రును కలిగించే కారకాలను లేకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అరటి హెయిర్ ప్యాక్ మీ జుట్టు పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలంగా చేస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే అరటి హెయిర్ ప్యాక్ ను వాడటం వల్ల మీ కుదుళ్లు బలంగా అవుతాయి. అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
అరటిపండు హెయిర్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలి?
అరటిపండు, గుడ్డు హెయిర్ మాస్క్
గుడ్డు, అరటిపండుతో తయారుచేసిన హెయిర్ ప్యాక్ ను వాడితే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
ఇందుకోసం బాగా పండిన ఒకటి లేదా రెండు అరటిపండ్లను తీసుకోసండి. వీటి తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేయండి. గుడ్డును కూడా బ్లెండర్ లో వేయండి. ఈ రెండింటిని బాగా కలిపి మీ జుట్టంతా పట్టించండి. 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.
అరటిపండు, తేనె హెయిర్ మాస్క్
తేనె కూడా మన జుట్టుకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు రక్షణగా ఉంటాయి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు మంచి కండీషనర్ గా పని చేస్తుంది. అలాగే డ్రై హెయిర్, చికాకు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ హెయిర్ ప్యాక్ వల్ల చుండ్రు తగ్గిపోతుంది.
నెత్తి తేమగా ఉంటుంది. ఇందుకోసం ఒకటి లేదా రెండు బాగా పండిన అరటిపండ్లను తీసుకుని మెత్తగా చేసి అందులో 1/2–1 టేబుల్ స్పూన్ల తేనెనె వేసి బ్లెండర్ లో వేయండి. ఇది పేస్ట్ గా కావాలి. దీన్ని మీ జుట్టుకు పెట్టి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయండి.
అరటిపండు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
అరటి పండు, కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్ జుట్టుకు చాలా మంచిది. దీన్ని ఉపయోగించడం వల్ల వెంట్రుకలు సిల్కీగా అవుతాయి. అలాగే జుట్టు తేమగా ఉంటుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది.
ఈ హెయిర్ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో బాగా పండిన ఒకటి లేదా రెండు అరటిపండ్లను వేసి బ్లెండ్ చేయండి. దీన్ని పేస్ట్ లా తయారుచేయాలి. తర్వాత దీన్ని నెత్తిమీది నుంచి వెంట్రుకల చివర్ల వరకు బాగా పట్టించండి. 10 నిమిషాల తర్వాత జుట్టును గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.