MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Hair Growth: ఎండాకాలంలో ఈ నూనె రాస్తే... జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది..!

Hair Growth: ఎండాకాలంలో ఈ నూనె రాస్తే... జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది..!

 Hair Growth: జుట్టు విపరీతంగా రాలిపోతుందని ఫీల్ అవుతున్నారా? ఈ ఎండాకాలంలో కొన్ని నూనెలు రాయడం వల్ల జుట్టు రాలడం ఆగడమే కాదు.. రెట్టింపు వేగంగా పెరుగుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 08 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hair Oil
Image Credit : Getty

Hair Oil

వేసవి కాలంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. చెమట, దుమ్ము కారణంగా జుట్టు, తల చర్మం పొడిబారుతుంది. అంతేకాదు.. వీటి కారణంగా జుట్టు ఎక్కువగా చిక్కు పడుతుంది. చమట ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఈ సీజన్ లో తలకు నూనె రాయాలంటే కూడా భయం వేస్తుంది. మరింత జిడ్డుగా మారుతుందేమో..? తలలో చమట, ఈ నూనె కలిసి జుట్టు మరింత రాలుతుందేమో అని భయపడుతుంటారు. అందుకే నూనె అసలు రాయరు. కానీ.. కొన్ని రకాల నూనెల రాస్తే.. హెయిర్ ఫాల్ అనేదే ఉండదు.

జుట్టుకు ఆరోగ్యంగా పెరగాలంటే సరైన నూనె ఎంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు, ఆ నూనెను సరైన పద్ధతిలో జుట్టుకు ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే... మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి.. ఎండాకాలంలో జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడే నూనెలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

23
అవకాడో నూనె...
Image Credit : Getty

అవకాడో నూనె...

వేసవిలో మీ జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారితే.. అవకాడో నూనె వాడటం బెస్ట్. ఈ నూనెలో విటమిన్ ఎ, బి, డి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె రాయడం వల్ల.. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. జుట్టు బాగా మెరుస్తూ కనపడుతుంది.

బాదం నూనె

బాదం నూనె తేలికగా ఉంటుంది. జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. దీనిలో విటమిన్ ఇ, మెగ్నీషియం , ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి జుట్టును బలపరిచి, విరిగిపోకుండా నివారిస్తాయి. దీనిని వారానికి ఒకసారి ఉపయోగించడం ప్రయోజనకరం.

జోజోబా నూనె, ఆర్గాన్ నూనె

జోజోబా నూనె ముఖ్యంగా జిడ్డుగల తల చర్మానికి చాలా మంచిది. ఈ నూనెలు రాయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. ఈ నూనె వాడటం వల్ల కూడా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. మీ జుట్టు చివర్లకు ఆర్గాన్ నూనెను రాయడం వల్ల జుట్టు చిక్కులు పడటం తగ్గుతుంది. జుట్టు మెరిసేలా చేస్తుంది.

Related Articles

Related image1
Electric Kettle: బ్యాచిలర్స్ కి వరం.. ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు, గ్యాస్ తో పని లేదు..ఎన్ని వంటలు చేయచ్చో తెలుసా?
Related image2
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
33
ఈ నూనెలను ఎలా వాడాలి అంటే....
Image Credit : stockPhoto

ఈ నూనెలను ఎలా వాడాలి అంటే....

నూనెను ఎప్పుడూ జుట్టుకు ఎక్కువగా రాయకూడదు. నూనె కొద్దిగా తీసుకొని.. తలకు మసాజ్ చేయాలి. అప్పుడే రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. జుట్టుకు ఎక్కువ నూనె రాయాలి. గోరు వెచ్చని నూనె రాస్తే.. ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఎండలో బయటకు వెళ్లే సమయంలో జుట్టుకు కాస్త నూనె రాస్తే.. హెయిర్ డ్యామేజ్ అవ్వగుండా ఉంటుంది. ఇక.. రాత్రిపూట ఆయిల్ రాసి.. మరుసటి రోజు తలస్నానం చేస్తే.. జుట్టు మరింత అందంగా కనపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Blackbeads: సమ్మర్ కి ఈ నల్లపూసలు బెస్ట్ ఆప్షన్
Recommended image2
Silver Anklets: బటర్‍ఫ్లై డిజైన్ పట్టీలు.. మీ పాదాలకు కొత్త అందం
Recommended image3
Nose Pin: ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కుపుడక బడ్జెట్ ధరలోనే
Related Stories
Recommended image1
Electric Kettle: బ్యాచిలర్స్ కి వరం.. ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు, గ్యాస్ తో పని లేదు..ఎన్ని వంటలు చేయచ్చో తెలుసా?
Recommended image2
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved