Face Glow: రాత్రి పడుకునే ముందు ఇది రెండు చుక్కలు రాసినా, ముఖం బంగారంలా మెరిసిపోద్ది
దాదాపు 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ముఖంలో చాలా మార్పులు వస్తాయి. ముఖంపై ముడతలు రావడం, బ్లాక్ సర్కిల్స్ ఇలా చాలా సమస్యలే వస్తాయి. ముఖంలో అప్పటి వరకు ఉన్న గ్లో కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.దాని కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు తెచ్చి రాస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ.. రాత్రి పడుకునే ముందు మేం చెప్పిన ఈ ఒక్క క్రీము రెండు చుక్కలు రాసినా ఉదయానికి ముఖం బంగారంలా మెరిసిపోతుంది. మరి ఆ క్రీమ్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దాదాపు 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ముఖంలో చాలా మార్పులు వస్తాయి. ముఖంపై ముడతలు రావడం, బ్లాక్ సర్కిల్స్ ఇలా చాలా సమస్యలే వస్తాయి. ముఖంలో అప్పటి వరకు ఉన్న గ్లో కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటివారే ఎక్కువగా వేల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన క్రీములు రాస్తూ ఉంటారు. బయట కొనే ఉత్పత్తుల్లో కెమికల్స్ ఉంటాయి. అవి ఫ్యూచర్ లో ముఖాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అందుకే, సహజంగా అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దాని కోసం బాదం పప్పులు ఇంట్లో ఉంటే చాలు.
నైట్ క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
రాత్రిపూట నానబెట్టిన 10-15 బాదం( తొక్క తీసేసినవి)
రెండు టీస్పూన్ల పాలు
మిక్సర్ బ్లెండర్‌లో, నానబెట్టిన బాదం, రెండు టీస్పూన్ల పచ్చి పాలు వేసి బాగా రుబ్బుకోండి.తర్వాత మెత్తగా రుబ్బుకోండి.
దీనికి ఒక టీస్పూన్ కలబంద జెల్ జోడించండి.మీరు దీన్ని రిఫ్రిజిరేటర్‌లో అలాగే నిల్వ చేయవచ్చు.పడుకునే ముందు మీరు తయారుచేసిన ఈ నైట్ క్రీమ్‌ను అప్లై చేసి నిద్రపోండి.మరుసటి రోజు ఉదయం మీరు మేల్కొన్నప్పుడు, మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. వరసగా 15 రోజులు మర్చిపోకుండా దీనిని ఫాలో అయితే.. మీ ముఖంలో గ్లో మీకే స్పష్టంగా కనపడుతుంది.
బాదంలోని విటమిన్ E కంటెంట్ ముఖంపై కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ముఖానికి మంచి మెరుపు, స్థితిస్థాపకతను ఇస్తుంది. ఇది మీ ముఖాన్ని సహజంగా ప్రకాశవంతంగా చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. బాదం ముఖంపై చర్మాన్ని తక్షణమే ప్రకాశవంతం చేసి మెరిసేలా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
బాదం నూనె క్రీమ్..
బాదం పప్పు, బాదం నూనె, విటమిన్ ఇ, కలబంద జెల్, రోజ్ వాటర్.. వీటితో తయారు చేసిన క్రీమ్ రాసినా కూడా మీ అందాన్ని పెంచుకోవచ్చు.
తయారీ విధానం
ముందు రోజు రాత్రి ఎనిమిది బాదం పప్పులను నీటిలో నానబెట్టండి.తరువాత, నానబెట్టిన బాదం పప్పులను జాగ్రత్తగా తొక్కండి.
తొక్క తీసిన బాదం పప్పులను బ్లెండర్‌లో వేసి, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి, వాటిని బాగా రుబ్బుకోండి. తరువాత బాదం పేస్ట్‌ను బాగా పిండి రసం తీయండి. తరువాత ఈ బాదం సారానికి రెండు టీస్పూన్ల బాదం నూనె జోడించండి. అలాగే, రెండు విటమిన్ క్యాప్సూల్స్ నుండి ద్రావణాన్ని వేసి కలపండి. దానికి కొంచెం కలబంద జెల్ వేసి బాగా కలిపి పేస్ట్ లా చేయండి.
తరువాత దానిని మరొక చిన్న కంటైనర్ లో మీరు స్టోర చేసుకోవచ్చు. ఆ తర్వాత దానిని రోజూ మీ ముఖానికి రాసి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. రాత్రి రాసుకొని, ఉదయాన్నే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. మీ ముఖం అందంగా మెరుస్తూ కనపడుతుంది.