Akshaya Tritiya: బంగారంలో కల్తీని 30 సెకన్లలో గుర్తించేదెలా?
అక్షయ తృతీయ రోజున దాదాపు అందరూ బంగారం కొనాలనే అనుకుంటారు. మరి, మోసానికి గురవ్వకుండా నకిలీ బంగారాన్ని ఈజీగా ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

అక్షయ తృతీయ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే. ధర ఎంత ఉన్నా ఆరోజు కనీసం గ్రాము బంగారం అయినా కొనాలి అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అలా బంగారం కొనాలి అనుకునేవాళ్లను మోసం చేసేవారు కూడా అంతే ఉంటారు. నకిలీ బంగారమో, కల్తీ బంగారాన్ని ప్యూర్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. అలా మోసపోకుండా ఉండాలంటే బంగారం స్వచ్ఛమైనదో కాదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1. BIS హాల్‌మార్క్ తప్పక చూడండి
అసలైన బంగారు నగలపై 6 అంకెల BIS (Bureau of Indian Standards) కోడ్ ఉంటుంది. దీనిలో BIS లోగో, క్యారెట్ (22K, 18K), జువెలర్ గుర్తింపు, సంవత్సరం ,సెంటర్ కోడ్ ఉంటాయి. దీన్ని BIS కేర్ యాప్ ద్వారా స్కాన్ చేసి అసలైనదా కాదా తెలుసుకోవచ్చు.
2. అయస్కాంత పరీక్ష
బంగారం ఎప్పుడూ అయస్కాంత ఆకర్షణకు గురి అవ్వదు.. మీరు కొనే నగ అయస్కాంతానికి అంటుకుంటే, అందులోఐరన్ కలిసిందని అర్థం. అంటే, మీరు కొనే బంగారం స్వచ్ఛమైనది కాదు అని తెలుసుకోండి. లేకపోతే మోసపోతారు. అలాంటి బంగారం అస్సలు కొనకూడదు.
3. బంగారం గుర్తులు, మెరుపు చూడండి
అసలైన బంగారంలో తేలికపాటి మెరుపు ఉంటుంది, దానిపై గీతలు ఉండవు. నకిలీ బంగారంలో ఎక్కువగా ఇత్తడి లేదా రాగి కలుపుతారు, దీనివల్ల దాని రంగు కొద్దిగా గోధుమ లేదా మసకగా కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించవచ్చు.
4. ధ్వని పరీక్ష
సాధ్యమైతే, ధ్వని పరీక్ష ద్వారా కూడా అసలైన, నకిలీ బంగారాన్ని గుర్తించవచ్చు. రెండు అసలైన బంగారు నాణేలు లేదా గాజులు ఒకదానికొకటి తాకినప్పుడు, అవి ఎక్కువసేపు మోగుతాయి. నకిలీ లోహం ధ్వని కొద్దిగా బరువుగా, శబ్ధం సరిగా రాదు. అయితే, ఈ పరీక్ష ద్వారా బంగారు అసలైందో కాదో తెలుసుకోవడం అందరి వల్లా కాదు.
5. ఆమ్లం లేదా నైట్రిక్ పరీక్ష
ఈ పద్ధతిని నిపుణుల ద్వారా మాత్రమే చేయించుకోవచ్చు. మీరు జువెలర్ దగ్గరకు వెళ్లి నైట్రిక్ ఆమ్ల పరీక్ష చేయమని అడగవచ్చు. బంగారం నకిలీ అయితే అది ప్రతిస్పందిస్తుంది, అసలైన బంగారం ప్రతిస్పందించదు. నగలు కొనేటప్పుడు బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు.