పీరియడ్స్ క్రాంప్స్ కి ఇలా చెక్ పెట్టండి..!
పీరియడ్స్ ని మనం ఎలాగూ ఆపలేం. కానీ.. దానితో వచ్చే నొప్పి ని మాత్రం కంట్రోల్ చేయవచ్చట. అది కూడా ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా.. సహజ పద్దతిలో. మరి అదెలాగో తెలుసుకుందామా..
పీరియడ్స్ ప్రతినెలా వస్తూనే ఉంటాయి. వాటితోపాటు నొప్పి కూడా వస్తూనే ఉంటుంది. పీరియడ్స్ ని మనం ఎలాగూ ఆపలేం. కానీ.. దానితో వచ్చే నొప్పి ని మాత్రం కంట్రోల్ చేయవచ్చట. అది కూడా ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా.. సహజ పద్దతిలో. మరి అదెలాగో తెలుసుకుందామా..
యోగా..
యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని మనకు తెలుసు. అలాగే పీరియడ్ పెయిన్ ని కూడా.. యోగాతో తగ్గించవచ్చట. ప్రతిరోజూ యోగా చేయడం అలవాటు చేసుకుంటే.. ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా.. గోముఖాసన, భుజంగాస, జను సీర్షాసన వంటి ఆసనాలు వేయాలి. ఇవి.. ప్రతినెలా పీరియడ్స్ కారణంగా వచ్చే నొప్పిని కంట్రోల్ చేస్తాయి.
నానపెట్టిన కిస్ మిస్ లు..
యోగా చేయడంతో పాటు.. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడ వల్ల కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గించవచ్చు. ప్రతిరోజూ రాత్రిపూట మూడు లేదా నాలుగు కిస్మిస్ లను నానపెట్టాలి. అందులో.. కేసర్ కూడా వేయాలి. తర్వాత.. ఉదయాన్నే దానిని తీసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల.. పీరియడ్స్ నొప్పిని తగ్గించవచ్చు.
అరటి పండు..
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. అరటి పండు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. అదేవిధంగా.. పీరియడ్స్ పెయిన్ ని కూడా ఇది తగ్గిస్తుంది. అరటి పండులో విటమిన్ బి6, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి.. అధిక రక్తస్రావం, పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి.
హాట్ వాటర్ బాటిల్.,
వేడి నీటితో నింపిన బాటిల్ తో కూడా నొప్పిని తగ్గించవచ్చు. పొట్ట దగ్గర.. హాట్ వాటర్ బాటిల్ లేదంటే హాట్ ప్యాక్ లేదంటే..వేడి నీటిలో ముంచిన టవల్ లాంటివి ఉంచడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. లేదంటే వేడి నీటి స్నానం చేయడం కూడా ఉత్తమం.
డార్క్ చాక్లెట్
కొంచెం డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రాంప్ నుండి ఉపశమనం పొందవచ్చు. డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం ఉంటుంది, ఇది కండరాలను రిలాక్స్ చేయడానికి మరియు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు కొన్ని బాదం లేదా గుమ్మడి గింజలు వంటి ఇతర మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవచ్చు