MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sweet Heart
  • Viral News
  • Viral News: జంతువులకు మాటలొస్తే ఏం మాట్లాడతాయి? మనుషులను కచ్చితంగా ఇలాగే ప్రశ్నిస్తాయి కావొచ్చు!

Viral News: జంతువులకు మాటలొస్తే ఏం మాట్లాడతాయి? మనుషులను కచ్చితంగా ఇలాగే ప్రశ్నిస్తాయి కావొచ్చు!

జంతువులను ప్రస్తావిస్తూ మనం పలు సామెతలను వాడుతుంటాం. ఒకవేళ జంతువులు మాట్లాడగలిగితే. అవి మనుషులను ఇలాగే ప్రశ్నిస్తాయని ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.? ఎంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Updated : Mar 29 2025, 08:10 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Viral News

Viral News

* 'ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడి' అనే సామెత గురించి వినే ఉంటాం. మనకు సంబంధం లేని విషయంలో ఎక్కువగా హంగామా చేస్తుంటే ఈ సామెతను ఉపయోగిస్తుంటాం. ఒకవేళ కుక్కులు మాట్లాడితే.. 'మీ ఊరిలో పెళ్లికి మేం ఎందుకు హడావుడి చేస్తామండి' అని ప్రశ్నిస్తాయి కాబోలు. 

28
Asianet Image

* ఒక వస్తువు గొప్పతనం గుర్తించలేకపోయినా, దానిని ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా.. 'పందికి ఏం తెలుస్తుంది పాండ్స్‌ పౌడర్‌ వాసన' అనే సామెత వినే ఉంటాం. ఒకవేళ పందులు మాట్లాడితే.. 'అసలు మాకు పాండ్స్‌ పౌడర్‌తో పనేంటి' అని కచ్చితంగా ప్రశిస్తాయి. 
 

38
Crocodile

Crocodile

* ఒకవేళ మొసలికి మాటలొస్తే అది ముందుగా అడిగే ప్రశ్న.. 'మేము అసలు పండుగలు చేసుకోమని' కాబోలు. ముందుంది ముసళ్ల పండగ అనే సామెత గురించి వినే ఉంటాం. 
 

48
Asianet Image

* ఆకలి వేస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అంటుంటారు. ఒకవేళ ఎలుకలు మాట్లాడితే.. 'మీ పొట్టలో మేము ఎందుకు పరిగెడుతామని' అడుగుతాయి కావొచ్చు. 

58
red fox

red fox

* మన స్థోమతకు మించి రెచ్చిపోయే వారిని ఉద్దేశిస్తూ.. 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' అనే సామెత చెబుతుంటారు. ఒకవేళ నక్క నిజంగానే మాట్లాడితే.. 'అసలు పులిని చూసి నేనేందుకు వాతలు' పెట్టుకుంటాననని అడుగుతుంది కాబోలు. 

68
Asianet Image

* ఒకవేళ కాకి మాట్లాడితే.. మొదట అడిగే ప్రశ్న 'అసలు మీ కాళ్లను మేమేందుకు మింగుతాం' అని అడుగుతాయి కాబోలు. ఏదైనా వస్తువు కనిపించకపోతే కాళ్లు కాకులు మింగాయా.? అనే సామెత ఉందన్న విషయం తెలిసిందే. 
 

78
Asianet Image

* పాములు మాట్లాడితే అడిగే ప్రశ్న.. 'ఎన్ని సార్లు కొట్టినా మేము ఎందుకు చావం' అని అంటాయి కాబోలు. మొండి ఘటాలను.. ఎన్నిసార్లు కొట్టినా చావని పామువురా నువ్వు అని తిడుతుంటారన్న విషయం తెలిసిందే. 
 

88
Asianet Image

* ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. వారిని ఉద్దేశిస్తూ 'గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది' అనే సామెతను ఉపయోగిస్తుంటారు. ఒకవేళ గొర్రెలకు మాటలొస్తే.. బహుశా మొదట 'అసలు మేం ఎందుకు కసాయి వాడిని నమ్ముతాం' అని ప్రశ్నిస్తుంది కాబోలు. 
 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
వైరల్ న్యూస్
జీవనశైలి
 
Recommended Stories
Top Stories