- Home
- Sweet Heart
- Viral News
- Viran News : గొడవ పడటమే ఇతడి బిజినెస్.. ఒక్క గొడవతో ఎంత సంపాదిస్తాడో తెలుసా?
Viran News : గొడవ పడటమే ఇతడి బిజినెస్.. ఒక్క గొడవతో ఎంత సంపాదిస్తాడో తెలుసా?
చైనాలో ఒక వ్యక్తి వింత బిజినెస్ మొదలుపెట్టాడు. ఎవరితోనైనా గొడవ పడటానికి భయపడే వారికి సర్వీస్ అందించడమే ఇతడి వ్యాపారం. 188 యువాన్ల ఫీజు వసూలుచేసి ఇతను అందిస్తున్న ఈ సర్వీస్ ఏంటో చూద్దాం.

గొడవ పడేందుకు అద్దెకు మనిషి..
చాలామందికి ఎదుటివారు తప్పు చేస్తే గట్టిగా తిట్టాలనిపిస్తుంది… కొన్ని సందర్భాల్లో వాగ్వాదానికి దిగాల్సి వస్తుంది. ఇలా తిట్టాలని ఉన్నా, నిలదీయాలని ఉన్నా కొందరు ఆ కోపాన్ని మనసులోనే అణచుకుంటారు… ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి భయపడుతుంటారు. ఈ భయాన్నే ఓ వ్యక్తి తన వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకున్నాడు… వారి తరపున గొడవ పడేందుకు చార్జ్ చేస్తున్నాడు.
చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో ఓ వ్యక్తి ఇతరుల తరపున వెళ్లి అవతలి వాళ్లతో వాదిస్తున్నాడు, గొడవపడుతున్నాడు. అయితే ఇదంతా అతడు ఊరికే చేయడంలేదు… ఈ సర్వీస్ కోసం 188 చైనీస్ యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ.2,600 నుంచి రూ.2,700) ఛార్జ్ చేస్తాడు. ఈ వింత సర్వీస్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రూ.2,600 ఇస్తే ఏం చేస్తాడు?
కస్టమర్లు తమ ప్రాబ్లమ్‌ను ఫేస్ చేయకుండా, ఈ వ్యక్తిని రంగంలోకి దించడమే ఈ సర్వీస్ స్పెషాలిటీ. 188 యువాన్లు తీసుకుని, కస్టమర్ల తరఫున ఎంతసేపైనా వాదిస్తాడు. దీనికి ఎలాంటి టైమ్ లిమిట్ లేదు. అయితే డబ్బులు ఇచ్చాం కదా అని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. కస్టమర్లకు అనుకూలంగా రిజల్ట్ వస్తుందని కూడా చెప్పలేం. మన తరఫున అవతలి వాళ్లను నిలదీయడానికి మాత్రమే ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది.
జీతాలు, ట్యూషన్ ఫీజులు, రిఫండ్స్!
జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే బాస్‌ను నిలదీయడం లాంటివి కూడా ఇతను డీల్ చేస్తాడు. ట్యూషన్‌లో టీచర్ మారడం వల్ల చదువు పాడైతే, ఫీజు వెనక్కి అడగటం లేదా క్లాస్ క్యాన్సిల్ చేయడం గురించి కూడా మాట్లాడతాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి తరపున ఆసుపత్రి వాళ్లను నిలదీసి డబ్బులు రిఫండ్ అడగటంలో కూడా సాయం చేస్తాడు. ఇలా సమస్య ఎలాంటిదైనా, ఎదుటివారు ఎవరైనా ఇతడు గొడవ పడేందుకు సిద్దపడతాడు.
గొడవ అంటే కొట్టుకోవడం కాదు!
ఇతను కేవలం మాటలతోనే వాదిస్తాడు. అంతేతప్ప, కొట్టుకోవడం లేదా దుర్భాషలాడటం లాంటివి చేయడు. ఫిజికల్ అటాక్‌కు దిగితే పోలీసులు యాక్షన్ తీసుకుంటారని ఇతను క్లారిటీ ఇచ్చాడు. ఎవరినైనా నిలదీయడానికి భయపడే వాళ్లు, ఇలా డబ్బులిచ్చి మరొకరి సాయం తీసుకోవచ్చన్న ఐడియా ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఒక చిన్న కంప్లైంట్ లేదా వాదనను ఇలా పెయిడ్ సర్వీస్‌గా మార్చడమే ఈ స్టోరీలో హైలైట్.





