MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Travel
  • Waterfalls: హైదరాబాద్ దగ్గర్లో ఇంత అద్భుతమైన జలపాతాలున్నాయా? ఒక్కరోజులోనే వెళ్లిరావచ్చా?

Waterfalls: హైదరాబాద్ దగ్గర్లో ఇంత అద్భుతమైన జలపాతాలున్నాయా? ఒక్కరోజులోనే వెళ్లిరావచ్చా?

Waterfalls: హైదరాబాద్ దగ్గర్లోనే జలపాతాలు ఉన్నాయని మీకు తెలుసా? వాటిని కూడా మీరు కేవలం ఒక్కరోజులోనే చూసి ఇంటికి వచ్చేయొచ్చు. తక్కువ ఖర్చుతో ఫ్యామిలీతో గాని, ఫ్రెండ్స్ తో గాని ఎంజాయ్ చేయగలిగే అద్భుతమైన జలపాతాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 16 2025, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హైదరాబాద్ మహా నగరంలో జీవించే వారి లైఫ్ స్టైల్ చాలా బిజీగా ఉంటుంది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు పనులన్నీ ముందే షెడ్యూల్ అయిపోయి ఉంటాయి. అందుకే అందరూ వీకెండ్స్, హాలిడేస్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. వీకెండ్ వచ్చిందంటే రెస్టారెంట్స్ కి వెళ్లడం, మూవీస్ చూడటం, పబ్స్, పార్టీలు ఇలా సిటీలోనే తిరిగి ఎంజాయ్ చేస్తుంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లేకపోతే చార్మినార్, ఫిల్మ్ స్టూడియోలు, ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్, గోల్కొండ, శిల్పారామం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లి సరదాగా కాసేపు తిరిగొస్తారు. ఇవన్నీ సిటీకి సమీపంలోనే ఉంటాయి కాబట్టి హాయిగా ఒక్కరోజులో అన్నీ కవర్ చేసేయొచ్చు. కాని ఒక్క రోజులోనే హైదరాబాద్ కు సమీపంలో ఉన్న జలపాతాలను కూడా చూసి రావచ్చని మీకు తెలుసా? ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరాలనుకుంటే మీకు కచ్చితంగా ఈ ప్లేసెస్ ను ఒక్కసారైనా చూడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

35

ఎత్తిపోతల జలపాతం

చుట్టూ కొండలు, గుహలు, పచ్చదనంతో ఆహ్లాదకరమైన ఎత్తిపోతల జలపాతం హైదరాబాద్ కు సుమారు 176 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడకు వెళ్లాలంటే సుమారు 3 గంటల సమయం చాలు. మీరు ఉదయం బయలుదేరి వెళితే సాయంత్రం వరకు ఎంజాయ్ చేయొచ్చు. చీకటి పడిన తర్వాత తిరిగి స్టార్ట్ అయితే రాత్రికి ఇంటికి వచ్చేయొచ్చు. ఈ అందమైన జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. నకిరికల్లు మండలంలో ఈ ఎత్తిపోతల జలపాతం ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 70 అడుగుల ఎత్తు నుండి నీరు జాలువారుతూ ఉంటుంది. ప్రకృతి అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.

45

మల్లెలతీర్థం జలపాతం

ఈ జలపాతం శ్రీశైలానికి దగ్గర్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ కి సుమారు 230 కి.మీ. దూరంలో ఉంటుంది. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 5 గంటలు సమయం పడుతుంది. కాని ఒక్కసారి మీరు అక్కడికి వెళితే ప్రకృతి అందాలకు మంత్రముగ్దులైపోతారు. ఎందుకంటే శ్రీశైలం అడవుల మధ్య ఎత్తైన కొండల నుంచి నీరు జాలువారుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ వాటర్ ఫాల్స్ ను "జలాల మల్లిక" అని కూడా అంటారు. ఈ ప్లేస్ కు కూడా హైదరాబాద్ నుంచి ఒక్క రోజులోనే వెళ్లి రావచ్చు. 

55

కుంతల జలపాతం 

హైదరాబాద్ కు సుమారు 260 కి.మీ. దూరంలో ఉన్న కుంతల జలపాతం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఒక చక్కటి టూరిస్ట్ స్పాట్. హైదరాబాద్ నుంచి సుమారు 5 గంటలు ప్రయాణిస్తే ఈ అద్భుతమైన జలపాతాన్ని చూడొచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణలోనే ఎత్తైన జలపాతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ట్రెక్కింగ్‌ చేయడానికి కూడా అవకాశం ఉంది. 

పొచేరువు జలపాతం 

కుంతల జలపాతానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో రాళ్ల మధ్య నుంచి ప్రవహించే చిన్న జలపాతం ఇది. పిల్లలతో వచ్చే ఫ్యామిలీస్ కి ఈ ప్లేస్ బాగుంటుంది. 

ఇది కూడా చదవండి సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర చేస్తారా? రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది. ఆన్‌లైన్‌లో ఎలా చేయాలంటే?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved