MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Travel
  • Railways: ట్రైన్ లో మీ పెట్ డాగ్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇలా చేస్తే తీసుకెళ్లొచ్చు

Railways: ట్రైన్ లో మీ పెట్ డాగ్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇలా చేస్తే తీసుకెళ్లొచ్చు

Railways: మీరు మీ పెట్ యానిమల్స్ ని ట్రైన్ లో మీతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నారా? తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నారా? మీకు ఓ అవకాశం ఉంది. ఏ ట్రైన్ లో అయినా ఒక బోగీలో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ఆ బోగీ వివరాలు, రైల్వే రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 24 2025, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనలో చాలా మందికి పెంపుడు జంతువులు ఉంటాయి కదా. వాటిని ఎంతో ప్రేమగా పెంచుతుంటాం. కాని ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్లాలంటే వాటిని ఇంట్లో వదిలి వెళ్లలేం. చుట్టుపక్కల వారి ఇళ్లలో పెట్టి వెళ్లాలంటే అవి బెంగ పెట్టుకొని తిండి తినక, నీరసించి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. 

అందుకే రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఓ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తోంది. దీని ప్రకారం రైళ్లలో ఓ ప్రత్యేక బోగీలో పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు. అయితే ఈ ట్రాన్స్ పోర్ట్ కోసం కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

రైళ్లలో జంతువులను తీసుకెళ్లే నిబంధనలు

రైళ్లలో పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులను తీసుకెళ్లొచ్చు. అయితే కేవలం ఫస్ట్ క్లాస్ ఏసీ (1A) లేదా ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో మాత్రమే తీసుకెళ్లడానికి పర్మీషన్ ఇస్తారు. 
పెంపుడు జంతువుల కోసం టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి.
జంతువుల టికెట్లు రైల్వే స్టేషన్ లో పార్సిల్ ఆఫీస్ దగ్గర ఇస్తారు.
టికెట్ ధర జంతువు బరువు ఆధారంగా ఉంటుంది.

పెద్ద జంతువులైన పశువులు, గేదెలు, మేకలు మొదలైనవి తీసుకెళ్లాలంటే పార్సిల్ వ్యాన్ లేదా బ్రేక్ వ్యాన్ (SLR Coach)లో మాత్రమే తరలించాలి.
 

35

ఈ డాక్యుమెంట్స్ ఉండాలి..

మీరు తీసుకెళ్లే జంతువు ఆరోగ్యంగా ఉందని వెటర్నరీ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. 
రైల్వే పార్సిల్ రూల్స్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ పెట్ యానిమల్ కి టికెట్ కూడా తీసుకోవాలి. 
రైల్వే స్టేషన్ సిబ్బంది ముందస్తు అనుమతి కూడా తీసుకోవాలి.
 

ఇది కూడా చదవండి రైల్లో మద్యం తాగితే జైలులో ఎన్నాళ్లు ఉండాలో తెలుసా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

45

ఈ బోగీల్లో జంతువులను తీసుకెళ్లకూడదు

సెకండ్ క్లాస్ స్లీపర్, ఏసీ 3-టైర్, ఏసీ చైర్ కార్ వంటి కోచ్‌లలో జంతువులను తీసుకెళ్లడానికి రైల్వే శాఖ అనుమతించదు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారని అనుమతించరు. అయినా ఎవరైనా ఇలా చేస్తే రైల్వే నిబంధనల ప్రకారం ఫైన్ వేస్తారు. 

 

55

మీరు మీ పెంపుడు జంతువును తీసుకొని ప్రయాణించాలనుకుంటే ముందుగా మీ సమీప రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీస్ ని సంప్రదించండి. వాళ్లు పూర్తి సమాచారం, టికెట్ వివరాలు, ప్రయాణ నిబంధనలు తెలుపుతారు.
 

ఇది కూడా చదవండి DEMU.. MEMU రైళ్ళ మధ్య తేడాలు మీకు తెలుసా? హైస్పీడ్ ట్రైన్ ఏదంటే..

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved