- Home
- Technology
- Tips
- Tulasi Plant: తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండాలంటే ఇదొక్కటి చేస్తే చాలు!
Tulasi Plant: తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండాలంటే ఇదొక్కటి చేస్తే చాలు!
హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ మొక్క ఎండిపోతే మంచిదికాదని చాలామంది నమ్ముతారు. అందుకే తులసి మొక్క గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా కొన్నిసార్లు ఈ మొక్క ఎండిపోతుంటుంది. మరి ఎండిపోకుండా ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

తులసి మొక్క విశేషాలు..
హిందూ మతంలో తులసి మొక్కను దేవతగా భావిస్తారు. ప్రతిరోజూ పూజిస్తారు. దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క దాని ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇది అనేక వ్యాధులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
తులసి మొక్క ఎండిపోకుండా..
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా, దట్టంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు అనేక కారణాల వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి.. పెరుగుదల ఆగిపోతుంది. కొన్నిసార్లు కీటకాలు కూడా దాడి చేస్తుంటాయి. తులసి మొక్క పసుపు రంగులోకి మారి ఎండిపోయినప్పుడు చాలామంది ఆందోళన చెందుతారు. తులసి ఎండిపోవడం అశుభంగా భావిస్తారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో తులసి మొక్కను ఏడాది పొడవునా పచ్చగా ఉంచుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
తులసి మొక్క ఎండిపోకుండా పాటించాల్సిన చిట్కాలు
ఒక లీటరు నీటిలో ఒక చెంచా పెరుగు, అర టీస్పూన్ పసుపు వేయండి. రెండింటినీ బాగా కలపండి. పూర్తిగా కలిసిన తర్వాత.. ఒకటి నుంచి రెండు గంటలు పక్కన పెట్టండి. తర్వాత ద్రావణాన్ని తులసి మొక్క వేరు భాగంలో పోయండి. మట్టి పూర్తిగా తడిచేలా పోయాలి. ఈ ప్రత్యేక ద్రావణం మట్టి బలాన్ని పెంచుతుంది. దీన్ని నెలకోసారి తులసి వేరు దగ్గర పోస్తే మొక్క దట్టంగా పెరుగుతుంది.
ఏడాది పొడవునా పచ్చగా ఉండాలంటే..
తులసి ఆకులపై కీటకాలు, ఫంగస్ లాంటివి కనిపిస్తే.. ఈ ద్రావణాన్ని బాటిల్‌లో నింపి ఆకులపై చల్లాలి. ఇది ఫంగస్‌తో పోరాడుతుంది. మొక్కపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు. ఈ ద్రావణం మొక్కను ఏడాది పొడవునా పచ్చగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. సాధారణంగా తులసి మొక్కకు నీళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వాటర్ పోయాలి. అలా అనీ ఎక్కువ వాటర్ పోసినా ఇబ్బందే. తులసి మొక్క వేరు దగ్గర ఉన్న మట్టి కాస్త ఎండిపోయినప్పుడు నీరు పోయడం మంచిది.

