- Home
- Technology
- Tips
- Recharge Tricks : జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ టిప్స్... ఫాలో అయ్యారో డబ్బులు సేవ్
Recharge Tricks : జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ టిప్స్... ఫాలో అయ్యారో డబ్బులు సేవ్
ప్రతీ నెలా మొబైల్ రీఛార్జ్ బిల్లు చూసి టెన్షన్ పడుతున్నారా? మీ ప్లాన్ కరెక్ట్ కాదని అనిపిస్తోందా? కొంచెం తెలివిగా ఆలోచిస్తే మీ మొబైల్ ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

ఫోన్ రీచార్జ్ ట్రిక్స్..
Cheap Mobile Recharge Hacks : ప్రతీ నెలా రీఛార్జ్ చేయాలంటే జేబుకు చిల్లు పడుతోందా..? రూ.199, రూ.299, రూ.399... ఇలా చూస్తుండగానే మొబైల్ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎయిర్‌టెల్, జియో, Vi కంపెనీలు ప్లాన్ల ధరలు పెంచేయడంతో రీఛార్జ్ భారం తలకు మించిన భారంగా మారింది. కానీ మీరు కొంచెం స్మార్ట్‌గా ఆలోచిస్తే, అదే రీఛార్జ్‌ను చాలా తక్కువ ధరకే పొందొచ్చు. దీనికోసం మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు. ఈ రోజు మనం అలాంటి కొన్ని సూపర్, ప్రాక్టికల్ టిప్స్ గురించి తెలుసుకుందాం. వీటిని పాటిస్తే ఈ ధరల మంటలోనూ మీ జేబుకు కాస్త చల్లగా ఉంటుంది.
ముందుగా సరైన ప్లాన్ ఎంచుకోవడం నేర్చుకోండి
చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. తమ అవసరం ఏంటో చూసుకోకుండానే రీఛార్జ్ చేసేస్తారు. మీరు కేవలం కాల్స్ కోసమే ఫోన్ ఎక్కువగా వాడితే, హై-డేటా ప్లాన్ తీసుకోవడం అనవసరం. అదే మీరు ఇంటర్నెట్ ఎక్కువగా వాడితే, తక్కువ డేటా ఇచ్చే కాలింగ్ ప్లాన్‌తో పని జరగదు. జియో (Jio), ఎయిర్‌టెల్ (Bharti Airtel), వొడాఫోన్-ఐడియా (Vodafone Idea) లాంటి ప్రతీ కంపెనీ వేర్వేరు అవసరాలకు తగ్గట్టు ప్లాన్లు అందిస్తాయి. మీ వాడకాన్ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవడం మీకు తెలియాలి.
యాప్స్‌తో రీఛార్జ్ చేస్తే అదనపు లాభాలు
ఈ రోజుల్లో కంపెనీ అఫీషియల్ యాప్స్ లేదా ఇతర థర్డ్-పార్టీ యాప్స్‌తో రీఛార్జ్ చేస్తే చాలాసార్లు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు వస్తున్నాయి. ఈ చిన్న చిన్న లాభాలే ప్రతీ నెలా కలిపి చూస్తే పెద్ద ఆదా అవుతుంది. మీరు తరచుగా రీఛార్జ్ చేస్తుంటే, యాప్ ఆఫర్లను తప్పకుండా చెక్ చేయండి. కొన్నిసార్లు 5% నుంచి 20% వరకు కూడా లాభం పొందవచ్చు.
లాంగ్-టర్మ్ ప్లాన్‌తో డబ్బు ఆదా
మీరు ప్రతీ నెలా రీఛార్జ్ చేస్తే కాస్త ఖర్చు ఎక్కువవుతుంది. కానీ 3 నెలలు, 6 నెలలు లేదా ఏకంగా ఏడాది ప్లాన్ తీసుకుంటే నెలవారీ ఖర్చు తగ్గుతుంది. చాలా కంపెనీలు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లలో అదనపు డేటా లేదా ఓటీటీ సబ్‍స్క్రిప్షన్లు కూడా ఇస్తున్నాయి. దీంతో మీకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అవసరానికి మించి డేటా వద్దు
చాలామంది చేసే మరో పెద్ద తప్పు ఏంటంటే, రోజుకు 2GB డేటా ప్లాన్ తీసుకుంటారు, కానీ అందులో సగం కూడా వాడరు. మీ డేటాలో సగం మిగిలిపోతుందంటే, మీరు డబ్బులు వృథా చేస్తున్నట్టే. అందుకే, ముందుగా ఓ రెండు మూడు రోజులు మీ డేటా వాడకాన్ని గమనించి, ఆ తర్వాతే సరైన ప్లాన్ ఎంచుకోండి.
ఆఫర్లు, డీల్స్‌పై ఓ కన్నేసి ఉంచండి
పండగలప్పుడు లేదా స్పెషల్ సేల్స్ టైంలో టెలికాం కంపెనీలు మంచి ఆఫర్లు ఇస్తుంటాయి. కొన్నిసార్లు తక్కువ డబ్బుకే ఎక్కువ వ్యాలిడిటీ లేదా అదనపు డేటా లభిస్తుంది. అందుకే, వెంటనే రీఛార్జ్ చేసేయకుండా, కాస్త ఓపిక పట్టినా మంచిదే.
వైఫైని సరిగ్గా వాడుకోండి
మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో వైఫై ఉంటే, మొబైల్ డేటాను ఆదా చేసి చిన్న ప్లాన్‌తో సరిపెట్టుకోవచ్చు. దీనివల్ల మీ మొత్తం రీఛార్జ్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

