MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • TRS Party : గోల్డ్ మెడలిస్ట్ కి హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్.. ఎవరీ ఆకాశ్ కొల్లూరు?

TRS Party : గోల్డ్ మెడలిస్ట్ కి హైదరాబాద్ ఎమ్మెల్సీ టికెట్.. ఎవరీ ఆకాశ్ కొల్లూరు?

ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థికి ప్రకటించిన తెలంగాణ రక్షణసేన తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి కూడా అభ్యర్థిని కన్ఫర్మ్ చేసింది. ఎవరికి అవకాశం దక్కిందంటే….

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 30 2026, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్ ఎమ్మెల్సీ బరిలో టిఆర్ఎస్
Image Credit : Getty

హైదరాబాద్ ఎమ్మెల్సీ బరిలో టిఆర్ఎస్

Telangana MLC Elections : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా ఇప్పటినుండే అన్నిపార్టీలు విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే పోటీచేసే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేస్తున్నాయి... అధికార కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది… ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ తో పాటు వరంగల్ - ఖమ్మం - నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (TRS) కూడా ఎమ్మెల్సీ బరిలో దిగింది. దీంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇతడే..
Image Credit : X/TRS Party

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇతడే..

తెలంగాణ రక్షణ సేన (TRS) తరపున హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుండి సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు బరిలోకి దిగనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఈ పార్టీ అధ్యక్షురాలు కవిత కన్ఫర్మ్ చేశారు... దీంతో టిఆర్ఎస్ పార్టీ ఇవాళ (అక్టోబర్ 30, శుక్రవారం) అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఎవరీ ఆకాశ్ కొల్లూరు?

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీచేసే టిఆర్ఎస్ అభ్యర్థి ఆకాశ్ హైదరాబాద్ వాసి. పుట్టిపెరిగింది నగరంలోనే. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఆకాశ్ పాఠశాల విద్య కొనసాగింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

విద్యాబ్యాసం అనంతరం జర్నలిజంపై ఆసక్తితో మీడియా రంగంలోకి వచ్చారు ఆకాశ్. నేషనల్ మీడియాలో రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా సేవలందిస్తున్నారు. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, సీఎన్ఎన్ న్యూస్ 18, డెయిలీ హంట్ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు.

జర్నలిస్టుగా పనిచేస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు ఆకాశ్. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపి కవిత బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీని స్థాపించగానే అందులో చేరిపోయారు. అతడి సేవలను గుర్తించిన పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

33
ఎమ్మెల్సీ ఎన్నికలపై కవిత ఫోకస్
Image Credit : Kalvakuntla Kavitha Twitter

ఎమ్మెల్సీ ఎన్నికలపై కవిత ఫోకస్

టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు కవిత. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి బీసీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్ కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలోనూ బిసినే అభ్యర్థిగా ప్రకటించారు. ఇలా వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు.

హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల అబ్జర్వర్, కో ఆర్డినేటర్ గా డాక్టర్ చిట్నేని రఘును నియమించారు కవిత. ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు స్ట్రాటజీ, వార్ రూమ్ ఇన్ ఛార్జి గా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లను నియమించారు.

ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ ఛార్జీలను కూడా నియమించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఇంచార్జీలు

హైదరాబాద్ - సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్

రంగారెడ్డి - అర్చనా సేనాపతి

మహబూబ్ నగర్ - రంజిత్ గొంగళ్ల

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇంచార్జీలు

నల్గొండ - సుజిత్

ఖమ్మం - గట్టు కరుణ

వరంగల్ - మాడుగుల రాజిరెడ్డి

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
కల్వకుంట్ల కవిత
 
4th T20 • NZ vs IND 2026
Live
NZNZ
(7.0 ov)75/2
INDIND
-
IND chose to bowl.
Schedule ›
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
November Holidays : నవంబర్ లో ఏడు రోజులు స్కూల్స్ బంద్... ఎందుకో తెలుసా?
Recommended image2
KTR: కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌పై స్పందించిన కేటీఆర్‌.. ఏమ‌న్నారంటే.?
Recommended image3
దుబాయ్‌లో భూములు కొనాల‌ని ఉందా.? మీకోస‌మే హైద‌రాబాద్‌లో ప్రాప‌ర్టీ గ్రాండ్ఎక్స్‌పో
Related Stories
Recommended image1
MLC Kavitha: ఒంట‌రి పోరాటం.. నిరాహార దీక్ష‌కు దిగిన క‌విత‌. ఇంత‌కీ ఆమె పోరు ఎవ‌రిపై అంటే
Recommended image2
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved