November Holidays : నవంబర్ లో ఏడు రోజులు స్కూల్స్ బంద్... ఎందుకో తెలుసా?
అక్టోబర్ నెల ముగింపుకు చేరుకుంది… నవంబర్ లో అడుగుపెట్టబోతున్నాం. మరి వచ్చే నెలలో విద్యాసంస్థలు, ఆఫీసులకు ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

నవంబర్ స్కూల్ హాలిడేస్ లిస్ట్
School Holidays : ప్రస్తుతం తెలుగు విద్యార్థులు వరుస సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో సగానికి పైగా హాలిడేస్ వచ్చాయి... మొదట 12-13 రోజులు దసరా సెలవులు వచ్చాయి. అవి ఇలా ముగిశాయో లేదో అర్నబ్ తుపాను కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ లో ముందుగా ప్రకటించనవే కాకుండా సడన్ సెలవులు వచ్చాయి.
అయితే అక్టోబర్ నెల ముగింపుకు చేరుకుంది... రెండ్రోజుల్లో కొత్త నెల నవంబర్ లోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఈ నెలలో సెలవుల సంగంతేంటి? అక్టోబర్ స్థాయిలో కాకున్నా కాస్త విశ్రాంతి లభించేలా సెలవులుంటే బాగుంటుందని విద్యార్థులు కోరుకుంటున్నారు. మరి నవంబర్ లో విద్యాసంస్థలకు ఎన్నిరోజులు సెలవులు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
దీపావళి సెలవు మిస్...
అక్టోబర్ లో దసరా పండగ ఉంటే నవంబర్ లో దీపావళి పండగ ఉంది. అయితే దసరాకి 12-13 రోజులు సెలవు వస్తే దీపావళికి ఒక్కరోజు కూడా సెలవు లేదు. ఈసారి దీపావళి (నవంబర్ 08, ఆదివారం) వచ్చింది... అందుకే అధికారిక సెలవు సాధారణ సెలవుతో కలిసిపోయింది. అంటే విద్యార్థులకు నవంబర్ లో ఓ సెలవు మిస్ అయ్యిందన్నమాట.
ఆసక్తికర విషయం ఏంటంటే నరక చతుర్థి కూడా ఇదేరోజు ఉంది... ఈరోజు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే కూడా ప్రకటించింది. కానీ సాధారణ సెలవు ఉండటంతో ఉద్యోగులు కూడా వేతనంతో కూడిన సెలవు పొందే అవకాశాన్ని మిస్ అవుతున్నారన్నమాట.
నవంబర్ సెలవుల లిస్ట్ ఇదే...
దీపావళి సెలవు మిస్ అయినా నవంబర్ ఎండింగ్ లో ఓ పండగ సెలవు కలిసివస్తోంది. నవంబర్ 24 (మంగళవారం) కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉంది.
ఇక ఈ నవంబర్ ఆదివారం సెలవుతో ప్రారంభం అవుతుంది. నవంబర్ 1, 8, 15, 22, 29 ఆదివారాలు ఉన్నాయి... ఈ ఐదురోజులు వీకెండ్ సెలవు ఉంటుంది. ఇక నవంబర్ 14 రెండో శనివారం మరో సెలవు. మొత్తంగా ఆరురోజులు వీకెండ్ సెలవులున్నాయి.
ఇలా ఓ పండగ, ఐదు ఆదివారాలు, ఓ రెండో శనివారం కలిపి నవంబర్ లో ఏడు రోజులు సెలవులున్నాయి. ఈ రోజుల్లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు మూతపడనున్నాయి... విద్యార్థులు, ఉద్యోగులు ఈ సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.
ఏపీ విద్యార్థులకు మరిన్ని సెలవులు...
అయితే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నవంబర్ లో మరికొన్ని ప్రత్యేక సెలవులు కలిసిరానున్నాయి. నవంబర్ 1న ఏపీలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో పోలింగ్ జరగనుంది... కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు కాబట్టి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విద్యార్థులకు కూడా సెలవు ఉంటుంది. అయితే ఈరోజు ఆదివారమే కాబట్టి ప్రత్యేక సెలవు లేకున్నా సాధారణ సెలవు వర్తిస్తుంది.
ఇలా మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలున్నాయి. నవంబర్ 5 (గురువారం) ఈ పోలింగ్ ఉంటుంది... కాబట్టి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు మరో సెలవు రానుంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసే విద్యాసంస్థలకు రెండ్రోజులు (అక్టోబర్ 4,5) సెలవుండే అవకాశాలున్నాయి.
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగియగానే గ్రామ పంచాయితీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఈ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి.. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుంది. కాబట్టి ఎన్నికలు జరిగే గ్రామాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి.





