MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఒకటి కాదు రెండు అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..

Rain Alert : బంగాళాాఖాతంలో ఒకటి కాదు వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రెండు ఇదే నెలలో ఏర్పడతాయట… వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 14 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

IMD Rain Alert : ప్రస్తుతం కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేవలం వానాకాలంలోనే కురవాల్సిన వర్షాలు చలి, వేసవి కాలాన్ని వదిలిపెట్టడంలేదు. ఇంకా చెప్పాలంటే వర్షాకాలానికి ముందు వేసవి, తర్వాత శీతాకాలంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలి కాలం ఆరంభంలో మొంథా తుపాను ఏ స్థాయిలో బీభత్సం సృష్టించిందో చూశాం... ఆ తర్వాత కూడా అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో భారీ వర్షాలే కురిశాయి.

ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవిలోకి అడుగుపెడుతున్న సమయంలో మళ్లీ వర్షసూచనలు వెలువడ్డాయి. ఈ నెలలోనే ఒకటి కాదు రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని... వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకపై ఈ అల్పపీడనాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో అల్పపీడనం..
Image Credit : Getty

బంగాళాఖాతంలో అల్పపీడనం..

బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... ఫిబ్రవరి 15న అంటే రేపు ఇది అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు శ్రీలంకపై ఉంటుందని... కొలంబోలో రేపటి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని ప్రకటించింది. 

35
ఫిబ్రవరి 19న మరో అల్పపీడనం..
Image Credit : Getty

ఫిబ్రవరి 19న మరో అల్పపీడనం..

ఇదే ఫిబ్రవరిలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. మొదట ఉపరితల ఆవర్తనం, ఆ తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఫిబ్రవరి 19 నుండి వాతావరణ పరిస్థితులు మారతాయని... వర్షాలకు అనుకూల వెదర్ ఉంటుందని తెలిపింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా ఉంటుందని... అక్కడక్కడా చెదురుమదురు జల్లులు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

45
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు...
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు...

బంగాళాఖాతంలో ఏర్పడే వరుస అల్పపీడనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. తమిళనాడు బార్డర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువని హెచ్చరిస్తోంది వెదర్ డిపార్ట్మెంట్.

55
తెలంగాణలో వర్షాలు..
Image Credit : Getty

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణపై కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 25 నుండి 28 వరకు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. కాబట్టి ఈ ప్రాంతాల రైతులు నెలాఖరులో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అకాల వర్షాల సమయంలో పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాన పడుతుంటే చెట్ల కింద ఉండరాదని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
తిరుపతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వ్యవసాయం (Vyavasayam)
యుటిలిటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image2
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Recommended image3
Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం
Related Stories
Recommended image1
IMD Rain Alert : ఫిబ్రవరి, మార్చిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వీటిని మ్యాంగో షవర్స్ ఎందుకంటారో తెలుసా..?
Recommended image2
IMD Rain Alert : ఇక తెలంగాణలో వర్షాలు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved