MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఇక తెలంగాణలో వర్షాలు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇదే..

IMD Rain Alert : ఇక తెలంగాణలో వర్షాలు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఇదే..

IMD Rain Alert : చలికాలం ముగిసింది… ఎండాకాలం మొదలయ్యింది. ఈ సమయంలో వర్షాలు కూడా జోరందుకుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఈ సమ్మర్ ఎలా ఉండనుందంటే.. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 12 2026, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమ్మర్ లో వర్షాలు తప్పవు..
Image Credit : stockPhoto

సమ్మర్ లో వర్షాలు తప్పవు..

IMD Rain Alert : ఏంటీ... సమ్మర్ లో ఎండలు కదా ఉండేది... వర్షాలు కురస్తాయని అంటారేంటి..? అనుకుంటున్నారా. అయితే ఎండాకాలంలో కూడా వర్షాలు కురుస్తాయి.. కానీ ఈసారి కాస్త ముందుగానే ఈ వానలు మొదలవుతున్నాయి. సమ్మర్ మొదటి అర్థభాగం అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో ఎండలతో పాటు వర్షాలు కూడా ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఎండాకాలంలో వర్షాలుంటాయని వెల్లడించారు.

25
ఈ నెలలోనే వర్షాలు...
Image Credit : Getty

ఈ నెలలోనే వర్షాలు...

ఇప్పటికే ఫిబ్రవరిలో దాదాపు సగం రోజులు ముగిశాయి... చలి తగ్గి ఎండలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం ఇక రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరగడమే కాదు అక్కడక్కడా వర్షాలు కూడా మొదలవుతాయి. మూడు నెలలపాటు వర్షాలుంటాయని... తర్వాత అసలైన ఎండాకాలం మొదలవుతుందని హెచ్చరిస్తున్నారు. మే, జూన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండలు మండిపోతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

SUMMER 2026 PRELIMINARY FORECAST 

EL- NINO IS COMING 🔥

The first half of summer which includes Feb 2nd half, March, April will be RAINY and normal summer heat is expected 🌧️

The second half of summer will be DRIER with MASSIVE HEATWAVES expected during May, June 1st half 🔥…

— Telangana Weatherman (@balaji25_t) January 16, 2026

Related Articles

Related image1
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Related image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
35
2023 పరిస్థితే 2026 లో
Image Credit : Getty

2023 పరిస్థితే 2026 లో

గత 2023 లో వాతావరణ పరిస్థితులు ఈసారి కూడా రిపీట్ అవుతాయని... ఎండాకాలం ఎక్కువరోజులు ఉంటుందని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవుతాయని... అప్పటివరకు ఎండలు, ఉక్కపోత తప్పవని తెలిపారు. ఇలా 2026 సమ్మర్ ఎలా ఉండనుందో ముందుగానే అంచనా వేశారు వెదర్ మ్యాన్.

45
మరో రెండ్రోజులు చలి...
Image Credit : Gemini AI

మరో రెండ్రోజులు చలి...

ఇక ప్రస్తుత తెలంగాణ వాతావరణం విషయానికి వస్తే... రాబోయే 2 రోజులు అక్కడక్కడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందన్నమాట. ఫిబ్రవరి 12న అంటే ఇవాళ (గురువారం) ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. మిగతా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

55
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..
Image Credit : Generated by google gemini AI

తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే..

​ఫిబ్రవరి 11న అత్యల్పంగా మెదక్ లో 12.8, ఆదిలాబాద్ లో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రామగుండంలో 15.8, నిజామాబాద్ లో 16.8, హన్మకొండలొ 17, నల్గొండలొ 17.8, ఖమ్మంలో, మహబూబ్ నగర్ లలో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 32.5 డిగ్రీలు నమోదయ్యింది. హైదరాబాద్ లో అత్యల్పంగా పటాన్ చెరులో 12.4, రాజేంద్ర నగర్ లో 13, హయత్ నగర్ లో 15, బేగంపేటలో 17.2, హకీంపేటలో 17.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లొ అత్యధికంగా హకీంపేటలో 32.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: 72 ఏళ్ల మ‌హిళ‌కు అరుదైన ఆప‌రేష‌న్‌.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం
Recommended image2
ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో క‌లిసిపోవ‌డం ఖాయం.. ఈరోజు కొంటే, రేపు మీ పంట పండిన‌ట్లే
Recommended image3
Telangana Municipal Elections 2026 : ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Related Stories
Recommended image1
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved