MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ బెల్స్

Weather Update : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు డేంజర్ బెల్స్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు ద్రోణి, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో విస్తారంగా వానలు కురవనున్నాయి. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ కాగా, ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 16 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో వానల జోరు.. వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్
Image Credit : Viral

ఏపీ, తెలంగాణలో వానల జోరు.. వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లోకీ ఎంటర్ అవ్వడమే కాకుండా.. వీటికి ద్రోణి, ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యాయి. దీనివల్ల రాబోయే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలోని ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
Image Credit : Gemini

తెలంగాణలోని ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో జూన్ 18 నుండి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కుండపోతగా వానలు పడొచ్చని అలర్ట్ చేశారు.

ఏపీలో పిడుగుల అలర్ట్

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు ఊపందుకున్నాయి. కోస్తాంధ్ర, ఉమ్మడి గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడనున్నాయి. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ జల్లులు పడతాయి.

35
రుతుపవనాలు ఓకే.. కానీ అసలైన వానలు ఎప్పుడంటే?
Image Credit : Gemini AI

రుతుపవనాలు ఓకే.. కానీ అసలైన వానలు ఎప్పుడంటే?

ప్రస్తుతం మ్యాప్‌లో నైరుతి రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ముందుకు సాగుతున్నప్పటికీ.. విస్తారంగా కురవాల్సిన వర్షాల తీవ్రత మరో వారం రోజుల పాటు కాస్త స్లోగానే ఉండనుంది. టెక్నికల్‌గా రుతుపవనాల పురోగతి బాగున్నా, వర్షాలను ఎక్కువ చేసే సిస్టం ప్రస్తుతం కొంచెం వీక్‌గా ఉంది. అందుకే జూన్ 23 వరకు దేశవ్యాప్తంగా పెద్దగా వర్షపాతం ఉండకపోవచ్చు.

45
జూన్ చివరి వారంలో రుతుపవనాల జోరు
Image Credit : Asianet News

జూన్ చివరి వారంలో రుతుపవనాల జోరు

వెదర్ మోడల్స్ విశ్లేషణ ప్రకారం.. జూన్ 23 తర్వాతే వాతావరణంలో అసలైన మార్పు వస్తుంది. జూన్ 22 నుండి జూన్ 28 మధ్య ఏపీ-కర్ణాటక సరిహద్దులు, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వానలు పెరుగుతాయి. ఇక జూన్ 29 నుండి జూలై 5 మధ్య నైరుతి రుతుపవనాలు మళ్లీ పీక్ స్టేజ్‌కి చేరుకుంటాయి. బలమైన గాలుల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి.

55
ఖరీఫ్ సాగుకు గ్రీన్ సిగ్నల్
Image Credit : Getty

ఖరీఫ్ సాగుకు గ్రీన్ సిగ్నల్

అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు పడే వానలు ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులకు ఫుల్ బూస్టింగ్ ఇవ్వనున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆల్రెడీ అగ్రికల్చర్ పనులు స్పీడందుకున్నాయి. వానలు పడుతున్న సమయంలో రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే, వానలు పడే టైమ్ లో రైతులు చెట్లు, స్తంభాల కింద వుండవద్దని సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Related Stories
Recommended image1
Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Mobile Tower Theft: ఈ దొంగల రూటే వేరబ్బా.. రాత్రికి రాత్రే 132 అడుగుల టవర్ మాయం ! పోలీసులకే మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved