MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?

Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?

Weather Update : గత నాలుగైదు రోజులుగా వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి… ఎండలు మండిపోతున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లని కబురు చెప్పారు.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 14 2026, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు
Image Credit : Gemini AI

జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు

Rain Alert : నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి నెలరోజులకు పైనే అవుతోంది... అయినా ఇప్పటివరకు చాలాచోట్ల వర్షాల జాడేలేదు. సాధారణంగా జూలైలో నడి వర్షాకాలం ఉంటుంది... అంటే కుండపోత వానలతో వరద పరిస్థితులు ఉండాలి... కానీ ప్రస్తుతం ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. ఎల్ నినో ప్రభావంతో మేఘాలు ముఖం చాటేశాయి... చివరకు వర్షాల కోసం ప్రజలు కప్పల పెళ్లిల్లు, పూజలు చేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో రైతులు వానచినుకుల కోసం ఆకాశం వైపు చూస్తూ ఎదరుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈనెల (జూలై) ఆరంభంలో పరిస్థితి కాస్త నయం... అడపాదడపా వర్షాలు కురిశాయి. కానీ రోజులు గడుస్తున్నకొద్ది పరిస్థితి దారుణంగా తయారయ్యింది... గత నాలుగైదు రోజులుగా అయితే వేసవికాలం తరహాలో ఎండలు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు ఇది వర్షాకాలమా లేక వేసవికాలమా అనేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వర్షాలపై ఆశలు వదులుకొన్నారు తెలుగు ప్రజలు. ఇలాంటి సమయంలో తెలంగాణ వెదర్ మ్యాన్ తీపికబురు చెప్పారు... వర్షాలు మళ్ళీ షురూ కాబోతున్నాయని ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జూలై 15 నుండి వర్షాలు షురూ..
Image Credit : Gemini AI

జూలై 15 నుండి వర్షాలు షురూ..

తెలంగాణలో రేపటి (జూలై 15, బుధవారం) నుండి మళ్లీ వర్షాలు మొదలవుతాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఎండాకాలంలో మాదిరిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే... ఈ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోబోతున్నాయని తెలిపారు. రుతుపవనాలు యాక్టివ్ గా మారి అక్కడక్కడ వర్షాలు కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

ఇలా జూలై 15న మొదలయ్యే వర్షాలు జూలై 16న (గురువారం) మరింత జోరందుకుంటాయని వెదర్ మ్యాన్ తెలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి జూలై 19 వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో జూలై 16-19 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లని వాతావరణం ఉంటుందని... అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంటూ చల్లనికబురు చెప్పారు.

SCATTERED RAINS AHEAD IN TELANGANA DURING JULY 16-19 ⛈️

Something is better than nothing

Well, today, July 14 will remain mostly dry in entire Telangana and INTENSE HEAT to continue in entire Telangana including Hyderabad City 

CHANGE IN CONDITIONS FROM JULY 15

From tomorrow,…

— Telangana Weatherman (@balaji25_t) July 14, 2026

34
వాతావరణ శాఖ అంచనాలేంటి?
Image Credit : Gemini AI

వాతావరణ శాఖ అంచనాలేంటి?

వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పినట్లే వాతావరణ శాఖ కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయంటోంది... అయితే ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవుతాయని చెబుతోంది. ఇవాళ, రేపు (జూలై 14,15) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని... మిగిలిన జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం కూడా అంచనా వేస్తోంది.

1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :13-07-2026 pic.twitter.com/pUKTUh1HJ3

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 13, 2026

44
జూలై 14 వాతావరణ సమాచారం....
Image Credit : Telangana Weatherman Whatsapp Channel

జూలై 14 వాతావరణ సమాచారం....

తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది... ఇవాళ (జూలై 14న) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వెదర్ మ్యాన్ తెలిపారు. రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో అయితే మండు వేసవిలో మాదిరిగా ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక నిన్న (జూలై 13, సోమవారం) నల్గొండలో 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం 36.8, భద్రాచలం 36.4, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో 36.6, హన్మకొండలో 35.5, నిజామాబాద్ లో 35.4 డిగ్రీల హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో కూడా వేసవి తరహాలో ఎండలు మండిపోయాయి... అత్యధికంగా హకీంపేటలో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యాయి… వర్షాకాలంలో వేసవి తరహా వేడి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
KTR : కోర్టు మెట్లెక్కిన కేటీఆర్ .. ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : అక్టోబర్ నెలలో మొత్తం 31 రోజులు.. అందులో 16 రోజులు సెలవులే
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు
Related Stories
Recommended image1
Weather Update : మినీ సమ్మర్ లోడింగ్.. ఇక నడి వర్షాకాలంలోనూ 40 డిగ్రీల మండుటెండలే
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved