MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు

Weather Update: ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు

Weather Update: ఏపీ తెలంగాణల్లో వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే మరోవైపు 75 ఏళ్ల నాటి భయంకరమైన ఎల్ నినో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 10 2026, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఓ పక్క దంచికొడుతున్న వానలు.. మరోపక్క 75 ఏళ్ల నాటి ‘ఎల్ నినో’ ముప్పు
Image Credit : Gemini

ఓ పక్క దంచికొడుతున్న వానలు.. మరోపక్క 75 ఏళ్ల నాటి ‘ఎల్ నినో’ ముప్పు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వానలు పడుతుంటే, మరోవైపు గ్లోబల్ లెవెల్‌లో ఒక భారీ ముప్పు మనల్ని భయపెడుతోంది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? వాతావరణ శాఖ ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏపీలో వాతావరణం ఎలా ఉందంటే?
Image Credit : Gemini

ఏపీలో వాతావరణం ఎలా ఉందంటే?

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. శుక్రవారం, శనివారం రాష్ట్రంలో ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉంటుంది. జూలై 10న పగలు, రాత్రి సమయాల్లో అక్కడక్కడా చిన్నపాటి జల్లులు పడే ఛాన్స్ 10 శాతం వరకు ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.

అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. మిగిలిన చోట్ల లైట్‌గా వానలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి.

Related Articles

Related image1
Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !
Related image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
36
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు
Image Credit : gemini

తెలంగాణకు ఎల్లో అలర్ట్.. గంటకు 50 కిమీ వేగంతో గాలులు

తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం మారబోతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే ఏడు రోజులు వర్షాలు దంచికొట్టే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణం తీవ్ర ప్రభావం చూపించనుంది.

వర్షం పడేటప్పుడు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. హైదరాబాద్‌లో కూడా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గుతున్నట్లు అనిపించినా.. జూలై 10న బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రయాణాల్లో ఉన్నప్పుడు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

46
75 ఏళ్ల హిస్టరీలోనే బిగ్గెస్ట్ డేంజర్.. ఏంటా ఎల్ నినో?
Image Credit : Getty

75 ఏళ్ల హిస్టరీలోనే బిగ్గెస్ట్ డేంజర్.. ఏంటా ఎల్ నినో?

ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక భారీ పెను ముప్పు భూగోళాన్ని చుట్టుముట్టబోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో చాలా వేగంగా బలపడుతున్న ఎల్ నినో వాతావరణ మార్పు, గత 75 ఏళ్లలోనే అత్యంత వినాశకరమైనదిగా మారే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తాజా రిపోర్టు ప్రకారం.. ఈ ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరింత ఉగ్రరూపం దాల్చి, ఏకంగా 2027 వరకు సుదీర్ఘంగా కొనసాగే ఛాన్స్ ఉంది. 1950 తర్వాత మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రకృతి సవాల్ ఇదేనని నిపుణులు ఆందోళన పడుతున్నారు.

56
మన దేశంపై, వ్యవసాయంపై పడే దెబ్బ ఇదే
Image Credit : AI

మన దేశంపై, వ్యవసాయంపై పడే దెబ్బ ఇదే

ఈ ఎల్ నినో ఎఫెక్ట్ ఆల్రెడీ ఇండియాపై పడటం స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరగడం వల్ల భూగర్భ జలాలు, మెయిన్ జలాశయాల్లో నీటి నిల్వలు డేంజర్ జోన్‌కు పడిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం మోస్తరు వానలు తప్ప పెద్దగా వర్షాలు పడకపోవడానికి ఈ ఎల్ నినో ప్రభావమే కారణం. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లు, వ్యవసాయ రంగం కూడా దెబ్బతినబోతున్నాయి. ముఖ్యంగా ఖరీఫ్ పంటలు సాగు చేసే మన రైతులు ఈ పరిస్థితి చూసి తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

66
రైతులకు అలర్ట్.. ఏం చేయాలంటే?
Image Credit : Asianet News

రైతులకు అలర్ట్.. ఏం చేయాలంటే?

పరిస్థితి తీవ్రతను గమనించిన తెలంగాణ మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్ బాబు సచివాలయంలో అధికారులతో అర్జెంట్ మీటింగ్ పెట్టారు. ఎల్ నినో పరిస్థితులు, నీటి లభ్యత, వ్యవసాయ ప్లానింగ్‌పై రివ్యూ చేశారు. వాతావరణ హెచ్చరికలను బట్టి రైతులు సాగు నిర్ణయాలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఏపీలో కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటంతో, చాలామంది రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
అమరావతి
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి
Recommended image2
Now Playing
మెట్రో, మూసీ ప్రక్షాళన పైసీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Speech
Recommended image3
Kavitha: ఆ రూ. 1400 కోట్లు అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు పంచండి.. క‌విత కీల‌క వ్యాఖ్య‌లు
Related Stories
Recommended image1
Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !
Recommended image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved