MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Weather Update : మినీ సమ్మర్ లోడింగ్.. ఇక నడి వర్షాకాలంలోనూ 40 డిగ్రీల మండుటెండలే

Weather Update : మినీ సమ్మర్ లోడింగ్.. ఇక నడి వర్షాకాలంలోనూ 40 డిగ్రీల మండుటెండలే

నడి వర్షాకాలంలోనూ వేసవి తాపం తప్పడం లేదు. జూలై 11 నుండి 15 వరకు "మాన్సూన్ బ్రేక్'' పరిస్థితులు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు తగ్గి, ఎండలు మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉందట. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 10 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వర్షాలకు బ్రేక్.. మళ్ళీ మండుటెండలు
Image Credit : Gemini AI

వర్షాలకు బ్రేక్.. మళ్ళీ మండుటెండలు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎండాకాలంలో అకాల వర్షాలు కురవడం చూశాం... ఇప్పుడు నడి వర్షాకాలంలో ఎండలు మండిపోవడం చూడబోతున్నాం. ఇప్పటికే వర్షాకాలం మొదలై నెల రోజులు గడిచినా ఎల్ నినో ప్రభావంతో పెద్దగా వానలు కురిసింది లేదు... ఇది చాలదన్నట్లు ఇకపై ఎండలు తీవ్రదూరం దాలుస్తాయట. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణం మారిపోతుందని... కొద్దిరోజులు వర్షాలన్నవే కనిపించకుండా వేసవి స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

తెలంగాణలో జూలై 11, 2026 నుండి తీవ్రమైన ''బ్రేక్ మాన్సూన్'' పరిస్థితులు ఉండనున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. జూలై 15 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం దాదాపుగా లేదని తెలిపారు. రుతుపవనాల విరామం అన్నది వర్షాకాలంలో అసాధారణ పరిణామం… ఇదే ఇప్పుడు కొనసాగుతోంది. ఎండలతో యావత్ రాష్ట్రం మళ్ళీ అల్లాడిపోతుందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వేడెక్కుతున్న తెలంగాణ
Image Credit : Getty

వేడెక్కుతున్న తెలంగాణ

నడి వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం మొదలయ్యాయి… ఒకటి రెండు చోట్ల కాదు తెలంగాణవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతోంది. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణలోని మళ్లీ ఎండలు మండిపోతాయట... పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుండి 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణలో 34 నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో 33 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

Related Articles

Related image1
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?
Related image2
Weather Update: ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు
35
రాబోయే నాల్రోజులు జాగ్రత్త..
Image Credit : Getty

రాబోయే నాల్రోజులు జాగ్రత్త..

తెలంగాణలో వేడి గాలులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది... ముఖ్యంగా జులై 12 నుండి 15వ తేదీ వరకు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తేన్నారు. ఈ నాలుగు రోజులు తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలను చవిచూడనున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు వెదర్ మ్యాన్. ఇప్పటికే ఎండలు తగ్గి వర్షాలు పెరగడం వల్ల వాతావరణం మారి ప్రజారోగ్యం ప్రభావం చూపిస్తోంది... ఇప్పుడు వానలు తగ్గి ఎండలు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి.

45
ఎల్ నినో ప్రభావం... వర్షాలు అంతంత మాత్రమే
Image Credit : AI

ఎల్ నినో ప్రభావం... వర్షాలు అంతంత మాత్రమే

రుతుపవనాల విరామానికి ప్రధాన కారణం ఎల్ నినో ప్రభావం. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పునే ఎల్ నినో అంటారు... ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పొడి వాతావరణానికి, వర్షాల కొరతకు ఇదే ప్రధాన కారణం. ఈ సమయంలో అక్కడక్కడా ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల 'హీట్ ఇండ్యూస్డ్ రెయిన్స్' అంటే వేడి కారణంగా ఏర్పడే స్థానిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు సముద్రంలో నీటి చుక్కల వంటివి. అంటే అవి వర్షాభావ పరిస్థితులను పెద్దగా ప్రభావితం చేయలేవు. అందుకే భారీ వర్షాలు ఆశించవద్దు.

55
మినీ వేసవి మళ్ళీ సిద్ధంకండి
Image Credit : Gemini

మినీ వేసవి మళ్ళీ సిద్ధంకండి

తెలంగాణ ప్రజలు ఈ "బ్రేక్ మాన్సూన్" పరిస్థితులకు, ఎల్ నినో ప్రభావానికి సిద్ధంగా ఉండాలి. నడి వర్షాకాలంలో మళ్లీ వేసవి లాంటి వాతావరణం నెలకొంటుంది. జూలై 10 నుండి జులై 15 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాంతో పాటు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో మధ్యస్థాయి గాలులు కొనసాగే అవకాశం ఉంది. ఈ గాలులు వేడిని మరింత పెంచుతాయి.

ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండటం మంచిది. శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి తగినంత నీరు తాగాలి. వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ వాతావరణం ప్రజలకు సవాల్ విసురుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Recommended image2
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image3
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Related Stories
Recommended image1
Flash Floods Alert : తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా?
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved