MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ఎంట్రీతో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Weather Update: అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ఎంట్రీతో దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఒకవైపు నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తుండగా, మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం, బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులతో 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 15 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎండల నుంచి ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం
Image Credit : chatgpt

ఎండల నుంచి ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం

అక్టోబర్ నెలలోనూ వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఎట్టకేలకు చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కొంత నిరాశపరిచినప్పటికీ, ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఈశాన్య రుతుపవనాల రాకతో వాతావరణం పూర్తిగా మారిపోతోంది. మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై ఉక్కపోత పెరిగిన తరుణంలో, ఈ వర్షాలు ప్రజలకు ఎంతో ఊరటనివ్వనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో ద్రోణి ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
Image Credit : Gemini

ఏపీలో ద్రోణి ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

ఆంధ్రప్రదేశ్‌లో మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి, వాయువ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీనికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం కూల్ అయింది.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, విశాఖ, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

35
తెలంగాణలో ఐదు రోజుల పాటు వానల జోరు
Image Credit : Google AI

తెలంగాణలో ఐదు రోజుల పాటు వానల జోరు

తెలంగాణలోనూ ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారాయి. ఈ నేపథ్యంలో రాగల ఐదారు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు తగిన హెచ్చరికలు జారీ చేశారు.

45
విపరీతమైన ఎండలు, ఉక్కపోత మధ్యే వర్ష సూచన
Image Credit : chatgpt

విపరీతమైన ఎండలు, ఉక్కపోత మధ్యే వర్ష సూచన

ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే దాదాపు 6 డిగ్రీలు ఎక్కువగా 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం, హైదరాబాద్‌లలో కూడా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అయితే, రానున్న రోజుల్లో రుతుపవనాల ప్రభావం మరింత బలపడటంతో ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టి, రాష్ట్రవ్యాప్తంగా చల్లటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

55
ప్రజలు, రైతులు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు
Image Credit : Gemini

ప్రజలు, రైతులు పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తలు

భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాటు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. వర్షం కురిసే సమయంలో ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, లేదా శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఆశ్రయం పొందరాదు. అలాగే రోడ్ల పక్కన ఉండే భారీ హోర్డింగుల కింద నిలబడటం ప్రమాదకరం. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పిడుగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణికులు అలాగే వాహనదారులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
డీమార్ట్‌లు, మెట్రోలే కాదు.. హైద‌రాబాద్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కు స‌రుకులు దొరికే మార్కెట్లు ఇవే
Recommended image2
ఆటో డ్రైవ‌ర్ చేసిన ప‌నికి స‌జ్జ‌నార్ స్ట్రాంగ్‌ రియాక్ష‌న్‌.. అత‌న్ని వెంట‌నే ప‌ట్టుకోమ‌ని ఆదేశాలు
Recommended image3
అమరావతితో కాదు... చైనా, జపాన్‌ లతో తెలంగాణ పోటీ : సీఎం రేవంత్ రెడ్డి
Related Stories
Recommended image1
Flipkart Sale ASUS Laptops: అస్సలు మిస్ కావద్దు.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆసుస్ ల్యాప్‌టాప్‌లపై రూ. 21 వేల డిస్కౌంట్
Recommended image2
Jio IPO Price Band: జియో ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసింది.. ఒక షేరు ధర ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved