MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Jio IPO Price Band: జియో ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసింది.. ఒక షేరు ధర ఎంతో తెలుసా?

Jio IPO Price Band: జియో ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసింది.. ఒక షేరు ధర ఎంతో తెలుసా?

Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,065-1,119గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, షేర్ హోల్డర్లకు, ఉద్యోగులకు ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే జియో ఐపీఓ వివరాలు ఇవే.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 15 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఖరారు.. అక్టోబర్ 21 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం
Image Credit : chatgpt

జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఖరారు.. అక్టోబర్ 21 నుంచి సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)కి చెందిన డిజిటల్, టెలికాం సబ్సిడరీ సంస్థ 'జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్' తమ మోస్ట్ అవెయిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కోసం ప్రైస్ బ్యాండ్ ను అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 1,065 నుంచి రూ. 1,119 మధ్య నిర్ణయించింది. బుధవారం రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో ఈ విషయాలను వెల్లడించింది.

ఈ ఐపీఓ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ డిజిటల్, టెలికాం బిజినెస్‌ను దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్ చేసేందుకు సిద్ధమైంది. మార్కెట్లో జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐపీఓ డేట్స్ అండ్ యాంకర్ ఇన్వెస్టర్ల షెడ్యూల్
Image Credit : Internet

ఐపీఓ డేట్స్ అండ్ యాంకర్ ఇన్వెస్టర్ల షెడ్యూల్

రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఈ ఐపీఓ అక్టోబర్ 21న సాధారణ సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. పెట్టుబడిదారులు అక్టోబర్ 23, 2026 వరకు తమ బిడ్లను సమర్పించవచ్చు.

ఇక పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులైన యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 19న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుంది. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత షేర్ల కేటాయింపు, లిస్టింగ్ వివరాలు వెలువడనున్నాయి.

35
జియో ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ అండ్ ఫ్రెష్ ఇష్యూ వివరాలు
Image Credit : Internet

జియో ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ అండ్ ఫ్రెష్ ఇష్యూ వివరాలు

జియో ప్లాట్‌ఫార్మ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు చెందిన ఐపీఓ కమిటీ ఈ ప్రైస్ బ్యాండ్‌ను ఆమోదించింది.

• ఫ్లోర్ ప్రైస్ (కనీస ధర): రూ. 1,065 పర్ షేరు

• క్యాప్ ప్రైస్ (గరిష్ఠ ధర): రూ. 1,119 పర్ షేరు

• ఫేస్ వాల్యూ: రూ. 10 ముఖ విలువ కలిగిన 27 కోట్ల వరకు ఫ్రెష్ ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుంది.

• మినిమం లాట్ సైజ్: కనీస బిడ్ సైజ్ 12 ఈక్విటీ షేర్లుగా నిర్ణయించారు. అంటే ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లు లేదా ఆపై 12 రెట్లలో బిడ్లు వేయాల్సి ఉంటుంది.

45
RIL షేర్‌హోల్డర్లు, ఉద్యోగులకు ప్రత్యేక కోటా అండ్ డిస్కౌంట్
Image Credit : Asianet News

RIL షేర్‌హోల్డర్లు, ఉద్యోగులకు ప్రత్యేక కోటా అండ్ డిస్కౌంట్

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లు, ఉద్యోగుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీలను ఏర్పాటు చేశారు..

• RIL షేర్‌హోల్డర్ల కోటా: అర్హత కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్ల కోసం రూ. 2,500 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు. అక్టోబర్ 14, 2026 నాటికి ఆర్ఐఎల్ షేర్లు కలిగిన వ్యక్తిగత ఇన్వెస్టర్లు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఈ కోటా కింద బిడ్ చేయడానికి అర్హులు.

• ఉద్యోగుల కోటా: అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగుల కోసం రూ. 500 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేశారు.

• ఉద్యోగుల డిస్కౌంట్: ఎంప్లాయీ రిజర్వేషన్ పోర్షన్ కింద అప్లై చేసే అర్హత కలిగిన ఉద్యోగులకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 54 ప్రత్యేక డిస్కౌంట్ అందించనున్నారు.

55
రెగ్యులేటరీ అప్రూవల్స్ అండ్ పబ్లిక్ లిస్టింగ్
Image Credit : Asianet News

రెగ్యులేటరీ అప్రూవల్స్ అండ్ పబ్లిక్ లిస్టింగ్

జియో ప్లాట్‌ఫార్మ్స్ అక్టోబర్ 14న తన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి సమర్పించింది.

అంతకుముందు, కంపెనీ జూన్ 19న డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ను దాఖలు చేసింది. ఆ తర్వాత ఆగస్టు 28న మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) నుంచి అబ్జర్వేషన్ లెటర్ వచ్చినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే, ఈ ఐపీఓ మొత్తం ఇష్యూ పరిమాణం, షేర్ల లిస్టింగ్ తేదీకి సంబంధించిన తుది వివరాలను ఫైలింగ్‌లో ఇంకా పేర్కొనలేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారతీయ టెలికాం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nita Ambani: నీతా అంబానీ సొంత ఆస్తులు ఏంతో తెలుసా? ఊహకు కూడా అందదు, ప్రపంచంలోనే రిచ్‌ లేడీ
Recommended image2
Gold: ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలున్న టాప్ 10 దేశాలు ఇవే.. భారత్ ఏ స్థానంలో ఉంది?
Recommended image3
Indian Rupee: ఇండియా కాకుండా రూపాయి చెల్లే ఇతర దేశాలు ఏవో తెలుసా?
Related Stories
Recommended image1
Most Expensive Cafes: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 5 కెఫేలు ఇవే.. ఒక్క కాఫీ ధర వింటే మైండ్ బ్లాకే
Recommended image2
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 కారణాలు ఇవే.. వెస్టిండీస్‌తో ఉత్కంఠ పోరులో టీమిండియా చిత్తు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved