MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Viral: సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఈయ‌నే.. ఎవ‌రీ వైర‌ల్ డాక్ట‌ర్‌, ఎందుకింత ఫేమ‌స్ అయ్యారు

Viral: సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఈయ‌నే.. ఎవ‌రీ వైర‌ల్ డాక్ట‌ర్‌, ఎందుకింత ఫేమ‌స్ అయ్యారు

Viral: సోష‌ల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇటీవ‌ల ఓ డాక్ట‌ర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. విక్రాంత్ సింగ్ పేరుతో ఉన్న ఈ డాక్ట‌ర్ చెబుతున్న వివ‌రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంతకీ ఎవరీ డాక్టర్.? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 25 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎవ‌రీ డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్?
Image Credit : Dr Vikrant Singh Thakur Official/Youtube

ఎవ‌రీ డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్?

కరీంనగర్‌కు చెందిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ తెలంగాణలో ప్రముఖ న్యూరాలజిస్ట్‌గా గుర్తింపు పొందిన వైద్యుడు. మెదడు, నరాల సంబంధిత వ్యాధుల చికిత్సలో ఆయనకు విశేష అనుభవం ఉంది. కరీంనగర్‌లోని “టైమ్ న్యూరోకేర్ హాస్పిటల్” ద్వారా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. న్యూరాలజీకి ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉండటం ప్రత్యేకత.

25
ఆధునిక వైద్యం
Image Credit : Dr Vikrant Singh Thakur Official/Youtube

ఆధునిక వైద్యం

సాధారణంగా మెట్రో నగరాల్లో మాత్రమే కనిపించే 3-టెస్లా ఎంఆర్ఐ, 32-స్లైస్ సీటీ స్కాన్ వంటి యంత్రాలను కరీంనగర్‌లో అందుబాటులోకి తీసుకురావడం ఆయన కృషి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లకుండా తమ దగ్గర్లోనే మెరుగైన పరీక్షలు, చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో “ఆర్కిడ్ హాస్పిటల్స్”, “నందన్ డయాగ్నస్టిక్స్” ద్వారా కూడా వైద్య సేవలను విస్తరించారు.

Related Articles

Related image1
Beer Price: 35 ఏళ్ల క్రితం ఒక్క‌ బీర్ ధ‌ర ఎంతో తెలిస్తే... మందు బాబుల కిక్కు దిగాల్సిందే
Related image2
హైద‌రాబాద్‌లో ఇక్క‌డ ల‌స్సీ ఉంట‌ది మామా.. అమృతం అంతే. 100 ఏళ్లుగా న‌డుస్తోన్న దుకాణం
35
విద్యాభ్యాసం, వైద్య శిక్షణ
Image Credit : Dr Vikrant Singh Thakur Official/Youtube

విద్యాభ్యాసం, వైద్య శిక్షణ

కరీంనగర్‌లోనే పుట్టి పెరిగిన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ తన విద్యాభ్యాసాన్ని కూడా అద్భుతంగా పూర్తి చేశారు. ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎంఢీ చేసి, తర్వాత న్యూరాలజీలో డీఎం పూర్తి చేశారు. ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. పి.ఎల్. జాన్ ఇజ్రాయెల్ వద్ద శిక్షణ పొందడం ఆయన వైద్య నైపుణ్యానికి మరింత బలం చేకూర్చింది.

45
స్ట్రోక్ చికిత్సలో కొత్త దారులు
Image Credit : Dr Vikrant Singh Thakur Official/Youtube

స్ట్రోక్ చికిత్సలో కొత్త దారులు

పక్షవాతం వచ్చిన రోగులకు అత్యవసర చికిత్సగా “థ్రాంబోలిసిస్” విధానాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చిన వైద్యుల్లో ఆయన ముందున్నారు. స్ట్రోక్ వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపు ఈ చికిత్స అందిస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ విధానం ద్వారా అనేక మందికి జీవితం తిరిగి ఇచ్చిన వైద్యుడిగా ఆయన పేరు సంపాదించారు.

55
సోషల్ మీడియాలో ఎందుకు వైరల్?
Image Credit : Dr Vikrant Singh Thakur Official/Youtube

సోషల్ మీడియాలో ఎందుకు వైరల్?

డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ వైద్యుడిగానే కాదు, ప్రజల్లో అవగాహన పెంచే వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలను సులభమైన భాషలో వివరిస్తుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ కారకాలు, ఆహార అలవాట్లు, రోజువారీ జీవనశైలిపై చేసే వీడియోలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల ఆయన చేసిన ఒక సేవా ప్రకటనతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. పేద విద్యార్థుల కోసం 100 మందికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10 లక్షలు అందించనున్నారు. ఈ నిర్ణయం ఆయన సామాజిక బాధ్యతను ప్రతిబింబించింది.

సేవా దృక్పథం – సమాజానికి తిరిగి ఇచ్చే ప్రయత్నం

తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని, ఇతరుల సహాయంతోనే ఎదిగానని డా. విక్రాంత్ సింగ్ తెలిపారు. అదే స్పూర్తితో ఇప్పుడు పేద విద్యార్థులకు అండగా నిలవాలని నిర్ణయించారు. స్కాలర్‌షిప్ ఎంపికలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా నిజంగా అవసరమైన వారికి సహాయం చేరేలా చూస్తున్నారు. “మన పిల్లల భవిష్యత్తు కోసం సమాజం బాగుండాలి” అనే సందేశాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. సంపన్నులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తెలంగాణ రాష్ట్ర సేన కవిత కొత్త పార్టీ ఆవిష్కరణ | Kalvakuntla Kavitha Launches Telangana Rashtra Sena
Recommended image2
‘తెలంగాణ ర‌థ చ‌క్రం విరిగింది’.. తండ్రితో యుద్ధం మొద‌లు.. కవిత కొత్త పార్టీ పేరెంటో తెలుసా.?
Recommended image3
Now Playing
Kavitha Set to Launch New Party | KCRకి బిగ్ షాక్! పార్టీ పేరు ప్రకటించిన కవిత | Asianet News Telugu
Related Stories
Recommended image1
Beer Price: 35 ఏళ్ల క్రితం ఒక్క‌ బీర్ ధ‌ర ఎంతో తెలిస్తే... మందు బాబుల కిక్కు దిగాల్సిందే
Recommended image2
హైద‌రాబాద్‌లో ఇక్క‌డ ల‌స్సీ ఉంట‌ది మామా.. అమృతం అంతే. 100 ఏళ్లుగా న‌డుస్తోన్న దుకాణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved