- Home
- Telangana
- Today Vegetable Price : మీరు వారాంతం సంతకు వెళుతున్నారా..? అయితే కూరగాయల ధరలు తెలుసుకొండి
Today Vegetable Price : మీరు వారాంతం సంతకు వెళుతున్నారా..? అయితే కూరగాయల ధరలు తెలుసుకొండి
Vegetable Prices in Weekend Market : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

నేటి కూరగాయల ధరలు
Today Vegetable Price : శని, ఆదివారం... ఈ రెండ్రోజులే ఉద్యోగులకు సెలవు ఉండేది... స్కూల్ పిల్లలకు కూడా సెలవు ఉంటుంది కాబట్టి గృహిణులకు కూడా సమయం దొరుకుంది. వీరంతా ఏ పనులున్నా ఈ రెండ్రోజుల్లో పూర్తిచేసుకుంటారు... ఇంట్లోకి వారానికి సరిపడా సరుకులు కొంటుంటారు. అందుకే వీకెండ్స్ లోనే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లో కూరగాయల సంతలు జరుగుతుంటాయి. ఉద్యోగులు, గృహిణులు వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు.
మీరు కూడా ఈ వీకెండ్ లో కూరగాయల మార్కెట్ కు వెళుతున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం. మార్కెట్ కు వెళ్లేముందు ఈవారం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొండి. దీనివల్ల దేన్ని ఎంతకు కొనాలో తెలుస్తుంది... తద్వారా తక్కువ ధరకే కూరగాయాలు కొంటారు... మీ డబ్బులు ఆదా అవుతాయి. మరి ప్రధాన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
టమాటా ధర ఎంతుంది?
టమాటా... కూరగాయల రారాజుగా చెప్పవచ్చు. భారతీయులు ప్రతి వంటకంలోనూ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరీముఖ్యంగా తెలుగువారి వంటింట్లో టమాటాకు మస్తు డిమాండ్. అందుకే మార్కెట్ కు వెళితేచాలు ముందుగా కొనేది టమాటానే.
ప్రస్తుతం టమాటా ధరలు తక్కువగానే ఉన్నాయి. కిలో రూ.30 నుండి 40 వరకు ఉంది. అయితే గతంలో రూ.15 నుండి 25 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ప్రస్తుతం పెరిగిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు, కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
ఉల్లిపాయల ధరెంత?
ఉల్లిపాయలను కూడా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే వీటిని కూడా ప్రతివారం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఉల్లిపాయ ధర చాలా తక్కువగా ఉంది... కిలో 15 నుండి 20 రూపాయలవరకు ఉంది. రూ.100 కు 5 నుండి 6 కిలోలు లభిస్తోంది.
వినియోగదారులకు రూ.15 నుండి 20 అమ్ముతున్నారు... కానీ ఉల్లిరైతుల వద్ద కిలో రూపాయి రెండు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఉల్లిధర పూర్తిగా పతనం కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కానీ వ్యాపారులు మాత్రం ఉల్లిపాయలను తక్కువకు కొని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
మిగతా కూరగాల ధరలు
చిక్కుడు కిలో రూ.80-100
పచ్చిమిర్చి కిలో రూ.55-61
బీట్ రూట్ కిలో రూ.50-60
ఆలుగడ్డ కిలో రూ.29-32
క్యాప్సికం కిలో రూ.45-55
కాకరకాయ కిలో రూ.55-60
సొరకాయ కిలో రూ.39-43
బీన్స్ కిలో రూ.46-51
క్యాబేజీ కిలో రూ.30-33
క్యారెట్ కిలో రూ.45-50
వంకాయలు కిలో రూ.45-50
బెండకాయలు కిలో రూ.50-55
బీరకాయ కిలో రూ. 50-60
ఆకుకూరల ధరలు
పాలకూర కిలో రూ.15-20
పూదీనా రూ.5-10 కట్ట
కరివేపాకు రూ.5-10 కట్ట
కొత్తిమీర రూ.20 కట్ట,
మెంతి కూర కిలో రూ.20
చామకూర కిలో రూ.16-18 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.