- Home
- Telangana
- Top MBA Colleges in the World : ప్రపంచంలోనే టాప్ ఎంబిఏ కాలేజీల్లో హైదరాబాద్ కు చోటు .. ఏదో తెలుసా?
Top MBA Colleges in the World : ప్రపంచంలోనే టాప్ ఎంబిఏ కాలేజీల్లో హైదరాబాద్ కు చోటు .. ఏదో తెలుసా?
Top MBA Colleges in the World : ప్రపంచంలోనే అత్యుత్తమ ఎంబిఏ కాలేజీల్లో మన హైదరాబాద్ టాప్ 5 లో చోటు దక్కించుకుంది. ఇలా లింక్టిన్ సర్వేలో టాప్ 100 లో నిలిచిన భారత ఎంబిఏ కాలేజీలేవో తెలుసా?

ప్రపంచంలో టాప్ ఏంబిఏ కాలేజీల్లో హైదరాబాద్
Top MBA Colleges in World : ప్రస్తుతం వర్క్ కల్చర్ వేగంగా మారిపోతోంది... ఇందుకు తగ్గట్లుగా నేటి యువతరం కూడా మారాల్సి ఉంటుంది. మంచి కెరీర్ కోసం అత్యుత్తమ సౌకర్యాలు కలిగిన విద్యాసంస్థల్లో డిమాండ్ ఉన్న కోర్సులు చేయడం చాలాముఖ్యం. అయితే ప్రస్తుతం MBA (Master of Business Administration) గ్రాడ్యుయేట్స్ కి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి ప్రముఖ సంస్థ లింక్డిన్ సర్వే బలం చేకూరుస్తోంది.
MBA చేసేందుకు బెస్ట్ కాలేజీలివే
ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డిన్ ప్రకారం... ఎంబిఏ అనేది ఉత్తమ కెరీర్ అందించే కోర్సు. 2010 నుండి ఇప్పటివరకు ఎంబిఏ ద్వారా చాలామంది అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో సీనియర్ లీడర్లుగా, మరికొందరు వ్యాపారవేత్తలుగా ఎదిగారని లింక్డిన్ చెబుతోంది. ఇలా ఎంబిఏ ద్వారా కెరీర్ గ్రోత్ 32శాతం నుండి 87 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
ఇలా MBA పై లింక్టిన్ ప్రత్యేక సర్వే చేపట్టింది... దీని ఆధారంగా ప్రపంచంలో టాప్ బిజినెస్ స్కూల్స్ కు ర్యాంకింగ్ ఇచ్చింది. విద్యావిధానం, మౌళిక సదుపాయాలే కాదు ఏ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు? కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు?… ఇలాంటి వివరాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కేటాయించారు. ఇందులో ఇండియాకు చెందిన కొన్ని బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి... అందులో హైదరాబాద్ వరల్డ్ లెవెల్లో టాప్ 5 లో చోటు దక్కించుకుంది.
ప్రపంచంలో టాప్ 5 ఎంబిఏ కాలేజీలు...లిస్ట్ లో హైదరాబాద్
తెలుగు విద్యార్థులు MBA చేయడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు... మన దేశంలోనే అనేక బిజినెస్ స్కూల్స్ వరల్డ్ క్లాస్ విద్యాభోదన అందిస్తున్నాయి. అంతెందుకు హైదరాబాద్ లో అద్భుతమైన విద్యాసంస్ధలు ఉన్నాయి... తాజాగా ఓ కాలేజ్ లింక్టిన్ సర్వేలో టాప్ 5 ఎంబిఏ కాలేజీల్లో చోటు దక్కించుకుంది.
మీరు ఎంబిఏ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రపంచంలో టాప్ 10 ఎంబిఏ కాలేజీలేవో తెలుసుకుందాం.
1. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Stanford Graduate School of Business)
2. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ (Harvard Business School)
3. INSEAD బిజినెస్ స్కూల్
4. ది వార్టన్ స్కూల్ (The Wharton School of the University)
5. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business,Hyderabad)
6. కెల్లొగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (Kellogg School of Management)
7. MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (MIT Sloan School of Management)
8. టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Tuck school of Business)
9. కొలంబియా బిజినెస్ స్కూల్ (Columbia Business School)
10. లండన్ బిజినెస్ స్కూల్ (London Business School)
ప్రపంచంలోనే టాప్ 100 లో నిలిచిన ఇండియా ఎంబిఏ కాలేజీలు
1. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business,Hyderabad) - 5వ ర్యాంకు
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కలకత్తా (IIM Calcutta) - 16వ ర్యాంకు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ (IIM Ahmedabad) - 17వ ర్యాంకు
4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, బెంగళూరు (IIM Bangalore) - 20వ ర్యాంకు
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, లక్నో (IIM Lucknow) - 26వ ర్యాంకు
6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండోర్ (IIM Indore) - 36వ ర్యాంకు
7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, న్యూడిల్లీ (IIFT New Delhi) - 50వ ర్యాంకు
NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ఎంబీఏ కాలేజీలు :
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ట్సిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (NIRF) కింద దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో భారతదేశంలో టాప్ 10 లో నిలిచిన మేనేజ్మెంట్ కాలేజీలివే..
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్
4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిల్లీ
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో
6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై
7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా
8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్
9. మేనేజ్మెంట్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ గురుగ్రామ్
10. గ్జావియెర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెట్ జంషెడ్ పూర్