భయపెడుతోన్న టమాట.. కిలో ధర ఎంతకు చేరిందో తెలుసా.?
వంటింట్లో కచ్చితంగా ఉండే వాటిలో టమాట ఒకటి. దాదాపు ప్రతీ వంటకంలో టమాటను ఉపయోగించాల్సిందే. అలాంటి టమాట ధరలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. టమాట ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

పెరుగుతోన్న ధరలు
తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లలో కిలో టమోటా 60 నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. కేవలం రెండు వారాల క్రితం వరకు 20–30 రూపాయల మధ్య లభించిన టమోటా, ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువ ధర పలుకుతోంది. ఈ పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
KNOW
వర్షాల దెబ్బకు పంట నష్టం
గత 10 రోజుల్లో కురిసిన భారీ వర్షాలు రైతులపై ప్రభావం చూపాయి. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో టమోటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్‌కు వచ్చే సరఫరా గణనీయంగా తగ్గింది. ఫలితంగా హోల్‌సేల్ మార్కెట్లలో టమాట సరఫరా తగ్గి ధరలు పెరిగాయి.
సరఫరగా తగ్గడంతోనే
సాధారణంగా మార్కెట్‌కు వచ్చే టమోటా పరిమాణం ఇప్పుడు సగం కంటే తక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమైంది. సరఫరా సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో టమోటా ధరలు మరింత పెరిగే అవకాశముందని రిటైలర్లు అంచనా వేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల పరిస్థితి
టమోటా సరఫరాలో ఆలస్యం సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ప్రస్తుతం కిలో టమోటా 50–60 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. మిగతా జిల్లాల్లో 35–45 రూపాయల ధర ఉంది. అయితే సరఫరా నిరంతరం తగ్గుతున్న కారణంగా ఆ రాష్ట్రంలో కూడా ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
వినియోగదారుల ఇబ్బందులు
పెరుగుతున్న కూరగాయల ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడు కిరాణ సరుకుల ధరలు కూడా పెరగడంతో ఇంటి బడ్జెట్‌పై ప్రభావం పడుతోందని వాపోతున్నారు.