నాకే ఎందుకీ కష్టాలు అనుకుంటున్నారా.? మేకు, సుత్తె కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే
మనలో చాలా మంది నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. నా టైం ఎందుకు బాలేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఈ చిన్న కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేకు బాధ
ఒక చిన్న పనిముట్ల బాక్స్‌లో మేకు (నఖం), సుత్తె (హ్యామర్) పక్కపక్కనే ఉండేవి. ప్రతిసారి సుత్తె.. మేకును బలంగా కొడుతుండేది. మేకు బాధతో అనుకునేది.. “ఎందుకు నన్నే ఎప్పుడూ ఇంతగా కొడుతున్నావు? నన్ను నొప్పించడమే నీ పని అనుకుంటున్నావా?” అని తన ఆవేదన వ్యక్తం చేస్తుండేది.
సుత్తె సమాధానం
సుత్తె మృదువుగా నవ్వి చెప్పింది.. “మేకు! నేను నిన్ను కొడుతున్నానని అనిపిస్తున్నా, కానీ నిజానికి నిన్ను బలంగా నిలబెట్టడానికి ఇలా చేస్తున్నాను. నువ్వు గట్టిగా నిలబడకపోతేనే నిన్ను నమ్ముకున్న వారు బిందాస్‌గా ఉంటారు. నిన్ను నొప్పిస్తున్నట్టు అనిపించేది నిజానికి నీ శక్తిని, నీ విలువను పెంచే ప్రక్రియ.” అని సుత్తె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నిన్ను కొట్టే సమయంలో నాక్కూడా నొప్పి పెడుతుంది అయినా నేను ఈ పనిని చేస్తాను అని సుత్తె చెబుతుంది.
మేకుకు బోధ
సుత్తె మాటలు విన్న మేకు ఆలోచించింది. “అవును, నేను ఓపికగా ఉండకపోతే ఎవరికీ ఉపయోగపడను. నాకు కొద్దిగా నొప్పైనా, చివరికి నేను ఉపయోగపడతాను. నన్ను నమ్ముకున్న వారు సురక్షితంగా ఉంటారు” అని తనకు తాను సర్ధిచెప్పుకుంది.
సహనమే శక్తి
తర్వాతి సారి సుత్తె కొట్టినప్పుడు మేకు బాధపడలేదు. బదులు, “నేను నిలబడుతున్నాను, నా వల్ల ఇంకొందరికి ఉపయోగం కలుగుతుంది” అని ఆనందించింది. సహనమే తన అసలైన శక్తి అని తెలుసుకుంది.
నీతి ఏంటంటే.?
మన జీవితంలో కూడా కొన్నిసార్లు కష్టాలు, ఒత్తిళ్లు వస్తాయి. అవి మనల్ని నొప్పించేవిగా అనిపించినా, నిజానికి మనల్ని మరింత బలంగా, స్థిరంగా మార్చుతాయి. సహనం, కష్టాన్ని భరించడం చివరికి గొప్ప ఫలితాలను ఇస్తుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు తాత్కాలికం, కానీ మన శక్తిని పెంచుతాయి. సహనంతో ఉంటే మనం అందరికీ ఉపయోగపడగలమనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది.