- Home
- Telangana
- Tirumala : హైదరబాదీలకు సూపర్ ఛాన్స్.. ఒక్క వీకెండ్ లో తిరుమల, బాసర చుట్టివచ్చేలా స్పెషల్ ట్రైన్, టైమింగ్స్ ఇవే
Tirumala : హైదరబాదీలకు సూపర్ ఛాన్స్.. ఒక్క వీకెండ్ లో తిరుమల, బాసర చుట్టివచ్చేలా స్పెషల్ ట్రైన్, టైమింగ్స్ ఇవే
దక్షిణ మధ్య రైల్వే ఈ జులైలో బాసర సరస్వతీ దేవాలయం (తెలంగాణ), తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం (ఆంధ్రప్రదేశ్) మధ్య హైదరాబాద్ మీదుగా ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించింది. దీంతో కేవలం వీకెండ్ లో ఈ రెండు దేవాలయాలను సందర్శించి వచ్చే అవకాశం లభిస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

ఒకేసారి రెండు పుణ్యక్షేత్రాలు చుట్టిరండి..
Tirupati : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు దేశ నలుమూలల నుండి నిత్యం వేలాదిమంది భక్తులు వెళుతుంటారు. అలాగే తెలంగాణలో గోదావరి నదీతీరాన బాసరలో వెలిసిన చదువులతల్లి సరస్వతి మాతను కూడా నిత్యం వేలాదిమంది దర్శించుకుంటారు. అయితే ఈ రెండు దేవాలయాలు హైదరాబాద్ కు అటొకటి, ఇటొకటి ఉన్నాయి... కాబట్టి నగరవాసులు ఒకసారి రెండింటిలో ఏదోఒక ఆలయాన్ని మాత్రమే సందర్శించే అవకాశం ఇంతకాలం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రైలెక్కితే రెండు దేవాలయాలకు వెళ్లిరావచ్చు. ఆ ట్రైన్ ఎక్కడినుండి ఎక్కడికి వెళుతుంది? టైమింగ్ ఏమిటి? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
బాసర టు తిరుమల... వయా హైదరాబాద్ స్పెషల్ ట్రైన్
తెలంగాణలోని సరస్వతి మాత ఆలయంగల బాసరను, ఏపీలో వెంకటేశ్వర స్వామి ఆలయంగల తిరుమలను కలుపుతూ ఇండియన్ రైల్వే ప్రత్యేక రైలును నడుపుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్ లో ప్రారంభమయ్యే ఈ రైలు బాసర, హైదరాబాద్ మీదుగా తిరుమలకు వెళుతుంది. ఇలా బాసరలో సరస్వతి మాత దర్శనం చేసుకుని అక్కడినుండి నేరుగా తిరుమలకు చేరుకుని అద్భుత అవకాశం భక్తులకు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.
అయితే ఈ స్పెషల్ ట్రైన్ కేవలం ఈ ఒక్కనెల (జులై) మాత్రమే ప్రయాణం సాగిస్తుంది. జులై 4న ప్రారంభమైన ఈ స్పెషల్ ట్రైన్ సర్వీస్ జులై 25 వరకు కొనసాగుతుంది. వారంలో రెండ్రోజులు నాందేడ్-తిరుపతి, తిరుపతి-నాందేడ్ రెండు ట్రిప్పులు నడుస్తాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం 4.30కి బయలుదేరే ట్రైన్ శనివారం మధ్యాహ్నం 12.30కి తిరుమలకు చేరుకుంటుంది.
స్పెషల్ ట్రైన్ టైమింగ్స్
రైలు నంబర్ 07189 మహారాష్ట్రలోని నాందేడ్ లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతుంది. తెలంగాణలోకి బాసరలోనే ఎంట్రీ ఇస్తుంది... సాయత్రం 6 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. రెండు నిమిషాలపాటు మాత్రమే బాసర స్టేషన్లో ఆగుతుంది... అక్కడినుండి నిజామాబాద్ కు 25 నిమిషాల్లో అంటే సాయంత్రం 6.25 గంటలకు చేరుకుంటుంది. కామారెడ్డి, మేడ్చల్ మీదుగా హైదరాబాద్ శివారులోని చర్లపల్లి స్టేషన్ కు రాత్రి రాత్రి 8.30 గంటలకు చేరుకుంటుంది.
చర్లపల్లిలో 15 నిమిషాలు ఆగి హైదరాబాద్ ప్రయాణికులను ఎక్కించుకుని నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ఏపీలోకి ఎంటర్ అవుతుంది. ఆ రాష్ట్రంలోని నడికుడి, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచర్ల, వినుగొండ, దొనకొండ, మార్కాపూర్, కుంభం, నంద్యాల, జమ్మలమడుగు, యెర్రగుంట్ల, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఇలా శుక్రవారం సాయంత్రం నాందేడ్ లో బయలుదేరే రైలు శనివారం 12 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుపతి టు బాసర... వయా హైదరాబాద్ ట్రైన్ టైమింగ్స్
ఇక తిరుపతి నుండి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు రైలు (07190) తిరుగుపయనం అవుతుంది. ఈ రైలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులోని చర్లపల్లి రైల్వేస్టేషన్ కు రాత్రి 1.40 కి చేరుకుంటుంది. అలా ముందుకుసాగుతూ బాసరకు తెల్లవారుజామున 6.30కి చేరుకుంటుంది. చివరి స్టేషన్ నాందేడ్ కు ఈ రైలు ఉదయమే చేరుకుంటుంది.
బాసర నుండి తిరుమలకు ఇలా ప్లాన్ చేసుకొండి...
ఇలా బాసర, తిరుపతి పుణ్యక్షేత్రాల మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ హైదరాబాదీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వీకెండ్ లో అంటే శుక్రవారం ఉదయం నేరుగా బాసరకు వెళ్ళి గోదావరి నదిలో స్నానంచేసి చదువులతల్లి సరస్వతి మాతను దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం 4 గంటలలోపు బాసర రైల్వే స్టేషన్ కు చేరుకుంటే స్పెషల్ ట్రైన్ పట్టుకోవచ్చు. బాసర నుండి హైదరాబాద్ మీదుగా తిరుపతికి శనివారం మధ్యాహ్నానికి చేరుకుంటారు.
అయితే తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని కుదిరితే శనివారమే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. వీకెండ్ కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటే ఆదివారం ఉదయంవరకు దర్శనం చేసుకుని తిరుగుపయనం అయితే సాయంత్రంలోపు హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇలా శుక్రవారం, శని, ఆదివారం మూడురోజుల్లో ఇటు తెలంగాణ పుణ్యక్షేత్రం బాసర, అటు ఏపీలోని పుణ్యక్షేత్రం తిరమలను సందర్శించి ఇంటికి చేరుకోవచ్చు.