MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మేటింగ్‌‌ టైమ్.. ఆడపులి కోసం 200 కి.మీ. ప్రయాణించిన టైగర్

మేటింగ్‌‌ టైమ్.. ఆడపులి కోసం 200 కి.మీ. ప్రయాణించిన టైగర్

Tiger Travels 200 km For Mate : మహారాష్ట్రలోని టిపేశ్వర్ రిజర్వ్ నుండి ఒక మగ పులి దాదాపు 200 కి.మీ. ప్రయాణించి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్, జన్నారం అడవికి చేరింది. మేటింగ్ టైం కావడంతో ఇక్కడికి వలస వచ్చినట్టు అధికారులు తెలిపారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 29 2025, 11:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహారాష్ట్ర నుంచి 200 కిమీ పులి ప్రయాణం… జన్నారం చేరిన టైగర్
Image Credit : Getty

మహారాష్ట్ర నుంచి 200 కిమీ పులి ప్రయాణం… జన్నారం చేరిన టైగర్

మేటింగ్ సీజన్ కావడంతో మహారాష్ట్ర నుండి తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve) పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌కు ఒక మగ పులి చేరుకుంది. ఈ మగ పులి సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకోవడం విశేషం.

మహారాష్ట్రలోని టిపేశ్వర్ టైగర్ రిజర్వ్ (Tipeshwar Tiger Reserve) నుండి బయలుదేరిన ఈ పులి, పెన్‌గంగ నదిని దాటింది. ముందుగా ఆదిలాబాద్ జిల్లాలోని బేలా ప్రాంతానికి చేరుకుంది. ఆ తరువాత కేరమెరి మీదుగా ప్రయాణించి చివరకు జన్నారం అటవీ డివిజన్‌కు చేరుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.

24
టిపేశ్వర్ నుండి పెరుగుతున్న పులల వలసలు
Image Credit : Getty

టిపేశ్వర్ నుండి పెరుగుతున్న పులల వలసలు

ఈ సీజన్‌లో టిపేశ్వర్, తాడోబా రిజర్వ్‌ల నుండి పులుల వలసలు పెరుగుతున్నాయని అటవీ అధికారులు తెలిపారు. సాధారణంగా పులులు కొత్త ప్రాంతంలో జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ వలసపోతుంటాయని పేర్కొన్నారు. కవ్వాల్, కాగజ్‌నగర్ కారిడార్లలో వేట జంతువులు, నీటి వనరులు సమృద్ధిగా ఉన్నందున ఈ ప్రాంతాలు పులులకు అనుకూలమైన ఆవాసాలుగా ఉంటాయని అధికారులు చెప్పారు. 

మరోవైపు, దండేపల్లి, లక్సెట్టిపేట ప్రాంతాలలో ఒక ఆడ పులి కూడా కనిపించింది. దీంతో ఈ ప్రాంతం బలమైన సంతానోత్పత్తి ఆవాసంగా అభివృద్ధి చెందుతుందనే ఆశలు పెరిగాయి. ఈ పులుల రాకతో కవ్వాల్ రిజర్వ్‌లో జీవవైవిధ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Related Articles

Related image1
దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Related image2
ఎకరం 151 కోట్లు : హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోనే రికార్డు రేట్
34
జన్నారంలో పశువులపై దాడి
Image Credit : Getty

జన్నారంలో పశువులపై దాడి

ఈ నెల 26 రాత్రి, ఈ పులి ఇందుంపల్లి రేంజ్‌లోని మామిడి తోటలో పశువుల పై దాడి చేసింది. తోటలో పనిచేసే కూలీలు పశువుల కళేబరాన్ని గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు తెలియజేశారు. దీనిపై స్పందించిన అటవీ అధికారులు.. సంతలో పశువుల విలువ ఆధారంగా రైతుకు పరిహారం అందిస్తామన్నారు. ఈ పరిహారం రెండు నుండి మూడు రోజులలోపు అందుతుందని జన్నారం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) స్పష్టం చేశారు.

44
పులల నివాసానికి అడ్డంకుల పై చర్యలు
Image Credit : Getty

పులల నివాసానికి అడ్డంకుల పై చర్యలు

పులులు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రధాన అడ్డంకిగా మానవ సంచారం ఉందని అధికారులు చెబుతున్నారు. కోర్ ఏరియా నుండి తరలించని గ్రామాలు, పశువుల మేత, అక్రమ ఆక్రమణలు వంటి వాటి కారణంగా పులుల స్థిరత్వం దెబ్బతింటోందని వారు హెచ్చరించారు. ఈ పులి బేలా, కేరమెరి, జైనూర్ మీదుగా ప్రయాణించి జన్నారంలోకి ప్రవేశించిందని డిఎఫ్‌ఓ ధృవీకరించారు.

పులి ఈ ప్రాంతంలో స్థిరపడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పులి కదలికలను ట్రాక్ చేయడానికి కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, గ్రామస్తులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు డిఎఫ్‌ఓ వివరించారు. ఈ చర్యల ద్వారా మానవ-వన్యప్రాణి సంఘర్షణను తగ్గించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
India First Rocket Manufacturing Factory In Hyderabad | Skyroot Infinity Campus| Asianet News Telugu
Recommended image2
Now Playing
Kalvakuntla Kavitha Pressmeet: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే | Asianet News Telugu
Recommended image3
ఎకరం 151 కోట్లు : హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోనే రికార్డు రేట్
Related Stories
Recommended image1
దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో అతి భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image2
ఎకరం 151 కోట్లు : హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోనే రికార్డు రేట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved