MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Dangerous Tree: ప్రమాదకరమైన చెట్టు.. ఆకు నుంచి పండు వరకు అంతా విషమే, నీడలో నిలబడినా ప్రమాదమే

Dangerous Tree: ప్రమాదకరమైన చెట్టు.. ఆకు నుంచి పండు వరకు అంతా విషమే, నీడలో నిలబడినా ప్రమాదమే

Dangerous Tree: ఎన్నో చెట్లు ఈ ప్రకృతిలో ఉన్నాయి. కానీ ఒక చెట్టు గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చెట్టు గాలి సోకినా ప్రమాదమే. ఆ చెట్టు కింద నిల్చున్నా ప్రాణాపాయమే. అందుకే ఈ చెట్లపై నిషేధం ఉంది. ఆ చెట్టు పేరు ‘మంచినీల్’.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 16 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్టు
Image Credit : Gemini AI

ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్టు

ప్రకృతిలో ఎన్నో చెట్లు ఉన్నాయి. అవన్నీ మనుషులకు ఏదో రకంగా సాయం చేసేవే. కానీ మనుషుల ప్రాణాలు తీసే అతి భయంకరమైన చెట్టు ఒకటి ఉంది. అదే ‘మంచినీల్’ వృక్షం. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. చూడటానికి అచ్చం ఆపిల్ చెట్టులాగే కనిపించే ఈ చెట్టు ఉత్తర, దక్షిణ అమెరికా తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా సముద్రపు ఒడ్డున ఉండే మడ అడవుల్లో పెరుగుతుంది. సముద్రపు అలల తాకిడికి నేల కోతకు గురికాకుండా కాపాడటంలో ఇది సాయపడుతుంది. సాధారణంగా 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు ఎదిగే ఈ చెట్లను స్థానికులు ‘బీచ్ ఆపిల్’ అని కూడా పిలుస్తుంటారు. మన దేశంలో ఈ చెట్లు కనిపించకపోవడం మన అదృష్టమనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చెట్టంతా విషమే
Image Credit : Britannica

చెట్టంతా విషమే

ఈ చెట్టు ప్రతి భాగంలోనూ విషం దాగి ఉంటుంది. చెట్టు ఆకులు, కాండం నుంచి కారే తెల్లటి పాల వంటి రసం చర్మానికి తగిలితే చాలు, తీవ్రమైన మంట పుట్టి బొబ్బలు, పెద్ద పుండ్లు వస్తాయి. వర్షం పడే సమయంలో పొరపాటున కూడా ఈ చెట్టు నీడలో నిలబడకూడదు. ఆకులపై నుంచి జారే నీటి బిందువులు మన ఒంటిపై పడినా చర్మం కాలిపోయి రక్తస్రావం జరుగుతుంది. అలాగే ఈ చెట్టు కలపను కాల్చినప్పుడు వచ్చే పొగ కళ్లకు తగిలితే కంటిచూపు పోయే ప్రమాదం ఉంటుంది. దీనికి కాసే పండ్లు చూడటానికి చిన్న ఆపిల్స్‌లా ఉండి తినడానికి తియ్యగానే ఉంటాయి. కానీ వీటిని ఒక్క ముక్క తిన్నా గొంతు వాచిపోయి, అంతర్గతంగా రక్తస్రావం జరిగి ప్రాణాలు పోతాయి. అందుకే వీటిని 'మరణాన్ని ఇచ్చే పండ్లు' అని పిలుస్తారు.

33
డేంజర్ బోర్డులు
Image Credit : Reddit

డేంజర్ బోర్డులు

ఈ చెట్లతో ఇంత ముప్పు ఉండటం వల్ల అమెరికా ప్రభుత్వం ఇవి పెరిగే తీర ప్రాంతాల్లో ప్రజలు దగ్గరకు వెళ్లకుండా ఎరుపు రంగు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తుంది. పూర్వకాలంలో అక్కడి గిరిజనులు జంతువులను వేటాడేందుకు బాణాల మొనలకు ఈ చెట్టు పాలను రాసేవారు. ఆ బాణం తగలగానే విషం శరీరంలోకి చేరి జంతువులు పడిపోయేవి. కరేబియన్ ప్రాంతంలో కొన్ని సంస్థలు కఠిన నిబంధనలు పాటిస్తూ ఈ కలపతో ఫర్నిచర్ తయారు చేస్తాయి. కొమ్మలను ఎండలో బాగా ఎండబెట్టి, విషపు రసం పూర్తిగా ఆవిరైన తర్వాతే ఉపయోగిస్తారు. అందంగా కనిపిస్తూనే ప్రాణాంతకంగా మారే ఈ వృక్షానికి వీలైనంత దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉన్నదాంతో తృప్తి చెందకపోతే.. ఉన్నది కూడా పోతుంది. జీవిత సత్యాన్ని చాటే గొప్ప కథ
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి నిజంగా ఎలాంటివాడో చెప్పే 5 సందర్భాలు ఇవే!
Recommended image3
IndianRailways: మంచుకొండల్లో రైల్వే వంతెన.. కిటికీలోంచి కశ్మీర్ అందాలు చూడొచ్చు.. ఈ ట్రైన్ జర్నీ మిస్ కావొద్దు
Related Stories
Recommended image1
Governors salary: నెలకు ఒక రాష్ట్ర గవర్నర్ జీతం ఎంతో తెలుసా? వారికి ఈ సదుపాయాలన్నీ జీవితాంతం ఫ్రీ
Recommended image2
Most Expensive Water: ఈ నీళ్ల బాటిల్ ధర అక్షరాలా రూ.50 లక్షలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు, ఎందుకంత ధర?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved