MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీ బియ్యంతో పాటు మరో 6 నిత్యావసర సరుకులు

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీ బియ్యంతో పాటు మరో 6 నిత్యావసర సరుకులు

Ration Card: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్ వంటి 6 నిత్యావసర సరుకులను సబ్సిడీపై అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 21 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎల్‌నినో ఎఫెక్ట్ నుంచి రక్షణగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Image Credit : Chatgpt

ఎల్‌నినో ఎఫెక్ట్ నుంచి రక్షణగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యుల జేబులకు పెద్దఎత్తున చిల్లులు పడుతున్నాయి. మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న ధరల భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు భారీ ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఓ అద్భుతమైన నిర్ణయానికి సిద్ధమవుతోంది.

కేవలం బియ్యం మాత్రమే కాకుండా, రేషన్‌ దుకాణాల ద్వారా ఇతర ముఖ్యమైన కిరాణా సరుకులను కూడా అత్యంత తక్కువ ధరలకే అందించాలని ఆలోచిస్తోంది. అవసరం అయితే, బియ్యంతో ఉచితంగా అందించేందుకు ఉన్న అంశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు వేగంగా కసరత్తు ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సబ్సిడీపై ఆరు నిత్యావసరాలు
Image Credit : pinterest

సబ్సిడీపై ఆరు నిత్యావసరాలు

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి లాంటి వస్తువులను సబ్సిడీ రేట్లకు పంపిణీ చేసే అంశాన్ని పౌరసరఫరాల శాఖ పరిశీలిస్తోంది.

సచివాలయంలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న ధరల భారాన్ని పేదవాడిపై పడకుండా చూడాలనే బలమైన సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

36
సమగ్ర అంచనాలు.. ఆర్థిక భారంపై లెక్కలు
Image Credit : Gemini AI

సమగ్ర అంచనాలు.. ఆర్థిక భారంపై లెక్కలు

సబ్సిడీపై సరుకులు అందించాలంటే ముందుగా వాటికి సంబంధించిన సమగ్ర అంచనాలు సిద్ధం చేయాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయా సరుకుల సేకరణ ఎక్కడినుంచి చేపట్టాలి, లబ్ధిదారులకు కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఎంత పరిమాణంలో అందించాలి, పంపిణీ విధానం ఎలా ఉండాలనే విషయాలపై స్పష్టమైన రిపోర్టులు తయారు చేయాలని కోరారు.

అదేవిధంగా ఈ సరుకుల పంపిణీతో ప్రభుత్వంపై ఏటా ఎంతమేర ఆర్థిక భారం పడుతుందనే లెక్కలు పక్కాగా తీయాలని స్పష్టం చేశారు. అధికారుల ప్రతిపాదనలు పూర్తిగా సిద్ధమైన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో అమలు చేసిన 'అమ్మహస్తం' తరహాలోనే ఈ పథకాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

46
ఆహార భద్రతకు పెద్దపీట.. 14 నెలల నిల్వలకు ప్లాన్స్
Image Credit : epds.telangana.gov.in

ఆహార భద్రతకు పెద్దపీట.. 14 నెలల నిల్వలకు ప్లాన్స్

ఒకవైపు నిత్యావసరాల పంపిణీపై చర్చిస్తూనే మరోవైపు రాష్ట్రంలో పేదల ఆహార భద్రతపై మంత్రి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో రేషన్‌ ద్వారా లబ్ధి పొందుతున్న 3.42 కోట్ల మంది ప్రజలకు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార కొరత రాకూడదని తేల్చిచెప్పారు.

అకస్మాత్తుగా వర్షాభావం ఏర్పడి పంటల దిగుబడులు తగ్గినా లేదా ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగినా ప్రజాపంపిణీ వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కష్టకాలంలోనూ ప్రజలను ఆదుకునేలా ఏకంగా 14 నెలలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వల సమీకరణకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

56
ఎల్‌నినో ప్రభావం.. ముందస్తు ప్లాన్స్
Image Credit : Asianet News

ఎల్‌నినో ప్రభావం.. ముందస్తు ప్లాన్స్

పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై గట్టిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1951 తర్వాత తొలిసారి ఆ స్థాయిలో ఎల్ నినో ఉగ్రరూపం దాల్చినట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లోటు వర్షపాతం కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతిని, సాగు దిగుబడి తగ్గి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.

ఈ విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉప-సంఘం కూడా ఏర్పాటయింది. నీటి పొదుపు చర్యలతో పాటు ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగా పావులు కదుపుతోంది.

66
భారీ బియ్యం నిల్వలు సిద్ధం
Image Credit : chatgpt

భారీ బియ్యం నిల్వలు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం ప్రతినెలా 2.38 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 16 నాటికి బఫర్‌ గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సురక్షితంగా నిల్వ ఉన్నాయి. దీనికి తోడుగా కస్టమ్ మిల్లింగ్ రైస్, ఇతర మార్గాల ద్వారా మరో 18.39 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది.

ఇవన్నీ గోదాములకు చేరితే సర్కారు వద్ద మొత్తం 28.03 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందుబాటులో ఉంటాయి. ఈ భారీ నిల్వలు సుమారు 11.7 నెలల నుంచి 14 నెలల రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపోతాయని అధికారులు లెక్కలు వేశారు. మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యం నిర్ణీత గడువులోగా ప్రభుత్వ గోదాములకు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రభుత్వ పథకాలు
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : బంగాళాఖాతంలో బలపడిన ద్రోణి.. దసరా పండగపూట ఈ జిల్లాల్లో వర్షాలు
Recommended image2
Vegetable Prices Hike: వంటింట్లో ఉల్లి ఘాటు.. టమాటా హాట్.. పెరుగుతున్న కూరగాయల ధరలు
Recommended image3
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్
Related Stories
Recommended image1
Weather Update: తుపాను అలర్ట్.. ఏపీ, తెలంగాణకు రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
Recommended image2
Post Office Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు 20 వేల ఆదాయం.. పోస్టాఫీసు సూపర్ సేవింగ్ స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved