- Home
- Telangana
- మందు తాగడంలో తెలంగాణోళ్ళు థర్డ్, ఆంధ్రోళ్లు ఫోర్త్ ప్లేస్.. టాప్ లో నిలిచిన రాష్ట్రాలేవో తెలుసా?
మందు తాగడంలో తెలంగాణోళ్ళు థర్డ్, ఆంధ్రోళ్లు ఫోర్త్ ప్లేస్.. టాప్ లో నిలిచిన రాష్ట్రాలేవో తెలుసా?
Alcohol Consumption : తెలుగు ప్రజలకంటే ఎక్కువగా మద్యం తాగేవారు ఇదే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నారు. IMFL మద్యం అమ్మకాల్లో టాప్ లో నిలిచిన రాష్ట్రమేదో తెలుసా?

మద్యం అమ్మకాల్లో టాప్ రాష్ట్రాలివే
Alcohol : తెలంగాణలో శుభకార్యమైన, అశుభకార్యమైనా మందు, మాంసం ఉండాల్సిందే. ఇటీవల వైన్ షాప్ లైసెన్స్ అంటే మద్యం అమ్మకాల అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులతోనే దాదాపు రూ.3000 కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. దీన్నిబట్టే తెలంగాణలో మద్యం వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తెలంగాణే మద్యం వినియోగంలో మూడో స్థానంలో ఉందంటే మొదటిరెండు స్థానాల్లోని రాష్ట్రాల ప్రజలు ఏ స్థాయిలో తాగుతారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మద్యం అమ్మకాల్లో టాప్ 10 రాష్ట్రాలివే
IMFL (India Made Foreign Liquor) అంటే విస్కి, రమ్, వోడ్కా, జిన్, బ్రాండీ ఉత్పత్తుల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి. అత్యధికంగా కర్ణాటకలో ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. మిగతా రెండు స్థానాల్లో తెలంగాణ (3), ఆంధ్ర ప్రదేశ్ (4) నిలిచాయి.
గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40.17 కోట్ల IMFL కేసులు అమ్ముడయ్యాయని... ఇందులో కేవలం కర్ణాటకలోనే 6.88 కోట్ల కేసుల విక్రయాలు జరిగాయన్నారు. అంటే దేశంలో జరిగిన అమ్మకాల్లో ఇది 17 శాతం. ఇక తమిళనాడు 6.47 కోట్ల కేసులు, తెలంగాణలో 3.1 కోట్ల కేసులు, ఏపీలో 3.55 కోట్ల కేసుల IMFL మద్యం అమ్ముడయినట్లు CIABC వెల్లడించింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో IMFL మద్యం విక్రయాలు చాలా తక్కువ... ఇంతపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2.50 కోట్ల కేసుల మద్యం మాత్రమే అమ్ముడయ్యింది. యూపీ దేశంలో ఆరోస్థానంలో నిలవగా రాజస్థాన్, డిల్లీ, హరియాణా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో 58 శాతం మద్యం విక్రయాలు జరిగితే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలు కలిపి కేవలం 42 శాతం IMFL విక్రయాలు జరిగాయి.
అత్యధికంగా మహిళలు మద్యం తాగే రాష్ట్రాలివే..
ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు మద్యం సేవిస్తున్నట్లు CIABC వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా 24.2 శాతంమంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. తర్వాత సిక్కింలో 16, అస్సాంలో 7 శాతంమంది మహిళలు మద్యం సేవిస్తున్నారట.
తెలంగాణ 6.7 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తారని తేలింది. అయితే తెలంగాణలో మద్యం ఎక్కువగా తాగడానికి కల్చరల్ రీజన్స్ ఉన్నాయి... నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల మహిళలకే ఎక్కువగా మద్యం అలవాటు ఉంటుంది.
మద్యం అమ్మకాల్లో దక్షిణాది హవా
దక్షిణ ప్రాంతం భారతదేశ మద్యం పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది, మొత్తం జాతీయ అమ్మకాలలో సగానికి పైగా వాటాను కలిగి ఉంది. అధిక ఆదాయం, పట్టణ జీవనశైలి, కల్చరల్ రీజన్స్ వంటి అంశాలు దక్షిణాదిలో ఎక్కువ మద్యం వినియోగానికి కారణాలుగా తెలుస్తున్నాయి.
మద్యం అమ్మకాల పెరుగుదల రాష్ట్ర ఆదాయాలకు ప్రయోజనం చేకూరుస్తోంది. కానీ అధిక మద్యపానంతో ముడిపడి ఉన్న ఆరోగ్యం, సామాజిక ఆందోళనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్య అవగాహనతో ఆర్థిక లాభాలను సమతుల్యం చేయడం ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది.