MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Parking Rules: రోడ్డుపై బండి పార్క్ చేస్తే ఇక అమ్మేస్తారు జాగ్రత్త.. తెలంగాణలో కొత్త పార్కింగ్ రూల్స్!

Parking Rules: రోడ్డుపై బండి పార్క్ చేస్తే ఇక అమ్మేస్తారు జాగ్రత్త.. తెలంగాణలో కొత్త పార్కింగ్ రూల్స్!

Telangana New Parking Rules : తెలంగాణలో అడ్డగోలు పార్కింగ్‌కు చెక్ పెట్టేలా కొత్త పార్కింగ్ పాలసీ వస్తోంది. రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు, టోయింగ్ ఛార్జీలే కాకుండా బండిని వేలం వేసే అవకాశం కూడా ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 14 2026, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ
Image Credit : Gemini

తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ

తెలంగాణలో వాహనదారులకు ఇకపై చమటలు పట్టేలా కొత్త నిబంధనలు రాబోతున్నాయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బండిని పార్క్ చేసేసి, తర్వాత చూద్దాంలే అనుకునే కాలం చెల్లిపోయింది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ రవాణా శాఖ అత్యంత కఠినమైన కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అడ్డగోలు పార్కింగ్ చేస్తే.. టోయింగ్ గ్యారెంటీ
Image Credit : Gemini AI

అడ్డగోలు పార్కింగ్ చేస్తే.. టోయింగ్ గ్యారెంటీ

ఇప్పటివరకు రోడ్డుపై నో పార్కింగ్‌లో బండి పెడితే కేవలం ఫైన్ కట్టి తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం, ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్నా, ఫుట్‌పాత్‌ల మీద బండి నిలిపినా అధికారులు వెంటనే దాన్ని టోయింగ్ చేసి పట్టుకుపోతారు. ఆ టోయింగ్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా వాహన యజమానే భరించాలి. నగరాల్లో అయితే ఒక బైక్ టోయింగ్ చేస్తేనే దాదాపు రూ. 500 వరకు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం.

Related Articles

Related image1
Kerala CM: కేరళ కొత్త సీఎం వీడీ సతీశన్ నెట్ వర్త్ ఎంత? బంగారం ఎంత ఉందో తెలుసా?
Related image2
Arunachalam: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక డైరెక్ట్ ట్రైన్‌లో గిరిప్రదక్షిణకు !
35
పాత బకాయిలు క్లియర్ చేస్తేనే బండి వాపస్
Image Credit : Gemini

పాత బకాయిలు క్లియర్ చేస్తేనే బండి వాపస్

మీ బండిని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత దాన్ని విడిపించుకోవడం అంత ఈజీ కాదు. ప్రభుత్వ పార్కింగ్ ప్లేస్ లో మీ వాహనం ఉన్న ప్రతి రోజుకు మీరు డైలీ పార్కింగ్ ఫీజు కట్టాలి. అంతేకాదు, మీ వాహనం మీద ఎన్ని పాత ఫైన్లు పెండింగ్‌లో ఉన్నా, రోడ్ టాక్స్ కట్టకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ సెటిల్ చేస్తేనే బండిని ఇంటికి తీసుకెళ్లనిస్తారు. అంటే ఒక్క పార్కింగ్ తప్పు వల్ల మీ పాత బాకీలన్నీ ఒక్కసారిగా తీర్చాల్సి వస్తుంది.

45
45 రోజులు దాటితే.. వేలమే
Image Credit : Getty

45 రోజులు దాటితే.. వేలమే

ఈ కొత్త పాలసీలో అత్యంత భయంకరమైన నిబంధన ఏమిటంటే.. అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని 30 నుంచి 45 రోజులలోపు యజమాని క్లెయిమ్ చేసుకోకపోతే, ప్రభుత్వం ఆ వాహనాన్ని బహిరంగ వేలం వేస్తుంది. అంటే మీ నిర్లక్ష్యం వల్ల మీ బండి మీ కళ్ల ముందే ఇతరుల సొంతమైపోతుంది. వాహనం బ్రేక్ డౌన్ అయినా సరే రోడ్డుపై అలాగే వదిలేయడం కుదరదు.

55
జేబుకు చిల్లు పెట్టే డైలీ ఛార్జీలు
Image Credit : Asianet News

జేబుకు చిల్లు పెట్టే డైలీ ఛార్జీలు

ప్రభుత్వం పీపీపీ విధానంలో అత్యాధునిక పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ యార్డులలో బండిని భద్రపరిచినందుకు రోజువారీ రేట్లు ఇలా ఉండే అవకాశం ఉంది..

• బైక్: రోజుకు రూ. 20 - 30

• ఆటో: రోజుకు రూ. 35 - 50

• కారు: రోజుకు రూ. 60 - 80

• బస్సు/భారీ వాహనాలు: రోజుకు రూ. 200 - 300

త్వరలోనే ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పార్కింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ పాలసీ ఇప్పుడు ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Related Stories
Recommended image1
Kerala CM: కేరళ కొత్త సీఎం వీడీ సతీశన్ నెట్ వర్త్ ఎంత? బంగారం ఎంత ఉందో తెలుసా?
Recommended image2
Arunachalam: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక డైరెక్ట్ ట్రైన్‌లో గిరిప్రదక్షిణకు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved