MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Arunachalam: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక డైరెక్ట్ ట్రైన్‌లో గిరిప్రదక్షిణకు !

Arunachalam: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక డైరెక్ట్ ట్రైన్‌లో గిరిప్రదక్షిణకు !

Arunachalam : తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించింది. అలాగే, హైదరాబాద్, వైజాగ్ నుంచి అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 14 2026, 09:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైజాగ్, హైదరాబాద్ భక్తులకు గుడ్ న్యూస్.. అరుణాచలం వరకు స్పెషల్ ట్రైన్స్ ఇవే
Image Credit : Gemini

వైజాగ్, హైదరాబాద్ భక్తులకు గుడ్ న్యూస్.. అరుణాచలం వరకు స్పెషల్ ట్రైన్స్ ఇవే

అరుణాచల శివుడి దర్శనం కోసం ఏపీ, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు ప్రతి నెలా తమిళనాడుకు వెళ్తుంటారు. అయితే సరైన రైలు సౌకర్యం లేక చాలా మంది ఇబ్బంది పడేవారు. భక్తుల కష్టాలను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. గుంటూరు నుంచి తిరుపతికి నడిచే ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పుడు ఏకంగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించారు. అంటే ఇకపై మన ఊరి నుంచే నేరుగా అరుణాచలం వెళ్ళిపోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుంటూరు టు తిరుచ్చి.. అరుణాచలం మీదుగానే
Image Credit : our own

గుంటూరు టు తిరుచ్చి.. అరుణాచలం మీదుగానే

ప్రస్తుతం గుంటూరు-తిరుపతి మధ్య నడుస్తున్న 17261/17262 ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రైలు తిరుపతి దాటిన తర్వాత చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు మీదుగా తిరువన్నామలై (అరుణాచలం) చేరుకుంటుంది. అక్కడి నుంచి శ్రీరంగం మీదుగా తిరుచ్చి వెళ్తుంది. దీనివల్ల పల్నాడు, ప్రకాశం, రాయలసీమ భక్తులకు అరుణాచలేశ్వరుడి దర్శనం చాలా ఈజీ అయిపోనుంది.

35
వెల్లూరు గోల్డెన్ టెంపుల్, శ్రీరంగం వెళ్ళే వారికి గుడ్ న్యూస్
Image Credit : our own

వెల్లూరు గోల్డెన్ టెంపుల్, శ్రీరంగం వెళ్ళే వారికి గుడ్ న్యూస్

ఈ రైలు పొడిగింపు కేవలం అరుణాచలం భక్తులకే కాదు, వెల్లూరులోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రైలు మార్కాపురం, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లా మీదుగా వెళ్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.

45
హైదరాబాద్ భక్తుల కోసం డైరెక్ట్ ట్రైన్స్ ఇవే..
Image Credit : IRCTC

హైదరాబాద్ భక్తుల కోసం డైరెక్ట్ ట్రైన్స్ ఇవే..

భాగ్యనగర భక్తుల కోసం కూడా రైల్వే శాఖ పలు రైళ్లను నడుపుతోంది..

• కాచిగూడ - ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ (17615): ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:28కి తిరువన్నామలై చేరుకుంటుంది.

• చర్లపల్లి - తిరుచ్చి స్పెషల్ (07615): ప్రతి మంగళవారం సాయంత్రం 5:50కి బయలుదేరి మధ్యాహ్నం 1:20కి మిమ్మల్ని అరుణాచలం చేరుస్తుంది.

• నాంపల్లి - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (17069): ప్రతి బుధవారం సాయంత్రం 4:45కి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు మధ్యాహ్నం 12:43కి అరుణాచలం వెళ్తుంది.

55
వైజాగ్ ప్రజల కోసం సూపర్ ఫాస్ట్ సర్వీసులు
Image Credit : our own

వైజాగ్ ప్రజల కోసం సూపర్ ఫాస్ట్ సర్వీసులు

విశాఖపట్నం నుంచి కూడా అరుణాచలం వరకు కూడా రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

• ఖరగ్‌పూర్ - విల్లుపురం (22603): ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 1:40కి వైజాగ్‌లో ఎక్కితే అదే రోజు సాయంత్రం 5:26కి తిరువన్నామలై దిగొచ్చు.

• హౌరా - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (12867): ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:15కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:29కి మిమ్మల్ని శివుడి సన్నిధికి చేరుస్తుంది.

ఇవే కాకుండా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకు పొడిగించడం, కొత్తగా ప్యాసింజర్ రైళ్లు ప్రారంభించడం వంటి నిర్ణయాలతో రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Schools Bandh : తీవ్ర వాయుగుండం లోడింగ్, ఇక కుండపోత వర్షాలే... ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
Recommended image2
Now Playing
Chaganti Amazed By The Children Wonderful Performance | Nara Lokesh | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఈ ఏజ్ లో బాబుగారు ఎలా కష్టపడుతున్నారో చూడండి | Asianet News Telugu
Related Stories
Recommended image1
Somnath Temple Mystery: మహాశివుని మొదటి జ్యోతిర్లింగం.. సోమనాథ్ ఆలయం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో తెలుసా?
Recommended image2
Indian Bullet Train : జపాన్ అవసరం లేదు.. మన బుల్లెట్ ట్రైన్ రెడీ! గంటకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved