MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Kerala CM: కేరళ కొత్త సీఎం వీడీ సతీశన్ నెట్ వర్త్ ఎంత? బంగారం ఎంత ఉందో తెలుసా?

Kerala CM: కేరళ కొత్త సీఎం వీడీ సతీశన్ నెట్ వర్త్ ఎంత? బంగారం ఎంత ఉందో తెలుసా?

Kerala New CM VD Satheesan Net Worth: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. పదేళ్ల వామపక్ష పాలనకు చెక్ పెట్టి యూడీఎఫ్‌ను విజయతీరాలకు చేర్చిన సతీశన్ ఆస్తుల వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 14 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఆయన భార్య దగ్గర కేజీకి పైగా బంగారం?
Image Credit : Asianet News

కేరళ సీఎంగా వీడీ సతీశన్.. ఆయన భార్య దగ్గర కేజీకి పైగా బంగారం?

కేరళ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎల్‌డీఎఫ్ (LDF) పదేళ్ల సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది యూడీఎఫ్ (UDF). కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ఖరారు చేసింది. కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకు ఎదిగి, పినరయి విజయన్ వంటి ఉద్దండుడిని సతీశన్ ఢీకొట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హైకమాండ్ భారీ కసరత్తు.. సతీశన్‌కే పట్టం
Image Credit : Asianet News

హైకమాండ్ భారీ కసరత్తు.. సతీశన్‌కే పట్టం

ముఖ్యమంత్రి పీఠం కోసం కాంగ్రెస్‌లో గట్టి పోటీనే నెలకొంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే కేసీ వేణుగోపాల్, దశాబ్దాల అనుభవం ఉన్న రమేష్ చెన్నితాల వంటి పేర్లు వినిపించినప్పటికీ, హైకమాండ్ మాత్రం క్షేత్రస్థాయిలో పార్టీని గెలిపించిన నాయకుడికే మొగ్గు చూపింది. ముస్లిం లీగ్ వంటి మిత్రపక్షాల సపోర్టు, యువతలో ఉన్న క్రేజ్ సతీశన్‌కు ప్లస్ అయ్యాయి. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి నీరసించిపోయిన కార్యకర్తల్లో ఉత్సాహం నింపినందుకు గాను ఆయనకే హైకమాండ్ జై కొట్టింది.

34
వీడి సతీశన్ ఆస్తుల లెక్కలు ఇవే
Image Credit : Asianet News

వీడి సతీశన్ ఆస్తుల లెక్కలు ఇవే

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో సతీశన్ ఆర్థిక నేపథ్యంపై చర్చ మొదలైంది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, సతీశన్ కుటుంబానికి సుమారు రూ. 6.69 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

  • సతీశన్ పేరిట రూ. 53.82 లక్షలు, ఆయన భార్య లక్ష్మీప్రియ పేరిట రూ. 68.45 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి.
  • సతీశన్ వద్ద 35 గ్రాముల బంగారం ఉంటే, ఆయన భార్య వద్ద ఏకంగా 1,128 గ్రాముల (సుమారు 1.1 కేజీ) బంగారం ఉన్నట్లు వెల్లడించారు.
  • పారావూర్, నెట్టూర్ ప్రాంతాల్లో వీరికి రూ. 4.27 కోట్ల విలువైన భూములు, ఇళ్లు ఉన్నాయి. అలాగే, వీరికి సుమారు రూ. 41.5 లక్షల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
44
జీరో నుంచి హీరో వరకు.. సతీశన్ రాజకీయ ప్రస్థానం
Image Credit : Asianet News

జీరో నుంచి హీరో వరకు.. సతీశన్ రాజకీయ ప్రస్థానం

వీడీ సతీశన్ ప్రయాణం ఏమీ పూలపాన్పు కాదు. 1964లో కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో జన్మించిన ఆయన, కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU) ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే, పార్టీలో చురుగ్గా పనిచేశారు.

2001లో పారావూర్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అసెంబ్లీలో ఆయన చేసే ప్రసంగాలు, లోతైన అధ్యయనం చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయేవారు. ముఖ్యంగా 2021 పరాజయం తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన చూపిన తెగువ, ఎల్‌డీఎఫ్ సర్కార్‌లోని అవినీతిని ఎండగట్టిన తీరు నేడు ఆయనను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Indian Bullet Train : జపాన్ అవసరం లేదు.. మన బుల్లెట్ ట్రైన్ రెడీ! గంటకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా?
Recommended image2
Arunachalam: అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక డైరెక్ట్ ట్రైన్‌లో గిరిప్రదక్షిణకు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved