- Home
- Telangana
- తెలంగాణలో ఎన్నికల హడావిడి.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు కన్ఫర్మ్, ఎవరో తెలుసా?
తెలంగాణలో ఎన్నికల హడావిడి.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు కన్ఫర్మ్, ఎవరో తెలుసా?
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చాలా ముందుగానే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
Telangana MLC Elections 2026 : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది… కానీ అప్పుడే ఎన్నికల హడావిడి మొదలయ్యింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి... వాటికి ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాయి... ఈ క్రమంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసీ ఏకంగా అభ్యర్థులను కూడా ప్రకటించింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే...
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి... అందులో ఒకటి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం. ప్రస్తుతం మాజీ ప్రధాని పివి. నరసింహరావు కూతురు వాణీదేవి (BRS) ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు... ఆమె పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఈ స్థానంలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది.
అధికార కాంగ్రెస్ మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. మాజీ టిపిసిసి మీడియా ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డిని ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో నిలుపుతోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసిసి కన్ఫర్మ్ చేసింది... AICC జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ పేరిట అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానానికి కూడా త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ప్రకటించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అదేశాలతో ప్రకటించినట్లు కెసి వేణుగోపాల్ పేర్కొన్నారు.
The AICC President, Shri Mallikarjun Kharge garu, has approved the following persons as party candidates for the forthcoming biennial elections to the Telangana Legislative Council from the Graduates' Constituencies: pic.twitter.com/sZqReooFtA
— Telangana Congress (@INCTelangana) September 29, 2026

