MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana Politics : తెలంగాణలో ఉపఎన్నికలు ఖాయం.. ఈ ఎమ్మెల్యేను అనర్హుడిగా తేల్చిన సుప్రీంకోర్టు

Telangana Politics : తెలంగాణలో ఉపఎన్నికలు ఖాయం.. ఈ ఎమ్మెల్యేను అనర్హుడిగా తేల్చిన సుప్రీంకోర్టు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో త్వరలోనే ఎన్నికల నగారా మోగే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ ను తెలంగాణ హైకోర్డు అనర్హుడిగా ప్రకటించగా, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యినట్లే..

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 24 2026, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఖైరతాబాద్ లో ఇక ఉపఎన్నిక ఖాయం..
Image Credit : X/Danam Nagender

ఖైరతాబాద్ లో ఇక ఉపఎన్నిక ఖాయం..

Danam Nagender : తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పిరాయింపుల వ్యవహారం హీట్ పెంచుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (BRS) తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు... వీరికి ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడింది... తెలంగాణ హైకోర్టే కాదు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆయనను అనర్హుడిగా తేల్చింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ఖాయం అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులోనూ షాక్
Image Credit : ChatGPT

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులోనూ షాక్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల వ్యవహారంపై తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా దానం నాగేందర్ బిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు... అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు సికింద్రాబాద్ లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. అయినప్పటికీ ఆయనను బిఆర్ఎస్ నాయకుడిగానే స్పీకర్ గుర్తించడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. దానం నాగేందర్ పార్టీ పిరాయించినట్లు నిర్దారించిన హైకోర్టు అనర్హత వేటు వేసింది.

అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను ఇవాళ (గురువారం) చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన న్యాయస్థానం దానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఓ పార్టీ నుండి గెలిచి మరో పార్టీ తరపున పోటీచేయడాన్ని బట్టి క్లియర్ గా పార్టీ మారినట్లు అర్థమవుతోంది.... కాబట్టి హైకోర్టు అనర్హత నిర్ణయం సరైనదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకే తెలంగాణ హైకోర్టు తీర్పులో ఎలాంటి జోక్యం చేసుకోబోమంటూ ఈ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టేశారు.

33
అసలేంటి దానం నాగేందర్ వివాదం?
Image Credit : X/Danam Nagender

అసలేంటి దానం నాగేందర్ వివాదం?

తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయింది... మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారాన్ని కోల్పోవడంతోనే బిఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు… వీరిలో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి గెలిచిన దానం నాగేందర్ ఒకరు.

ఇలా తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బిఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో దానం నాగేందర్ పై ఫిర్యాదుచేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఈ వ్యవహారంపై పలుమార్లు విచారణ జరిపింది... పూర్తి సమాచారాన్ని సేకరించి, ఇరుపక్షాల వాదనలు వింది. సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన దానం పార్టీ పిరాయించినట్లు నిర్దారించింది… ఈ మేరకు సెప్టెంబర్ 18న దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై తుదితీర్పు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది... దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.

అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం సుప్రీంకోర్టుకు వెళ్లారు... అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయ్యింది. మొత్తంగా ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ ఖాళీ అయినట్లే... ఇక్కడ త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు అతిభారీ వర్షాలు
Recommended image2
విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు ఊహించ‌ని సెల‌వు.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Recommended image3
హైద‌రాబాద్‌కు నార్త్‌లో మ‌రో మోకిలా ర‌డీ అవుతోంది.. అభివృద్ధికి పుష్క‌ల‌మైన అవ‌కాశాలు
Related Stories
Recommended image1
Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..
Recommended image2
Now Playing
KCRని చూడటానికే BRS సభకు చాలామంది వస్తారు: దానం నాగేందర్ | Congress | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved