MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Housing Scheme: రూ.6 లక్షలకే హైదరాబాద్‌లో సొంత ఇల్లు.. దరఖాస్తు విధానం, అర్హతలు సహా పూర్తి వివరాలు ఇవే

Housing Scheme: రూ.6 లక్షలకే హైదరాబాద్‌లో సొంత ఇల్లు.. దరఖాస్తు విధానం, అర్హతలు సహా పూర్తి వివరాలు ఇవే

Indiramma Housing Scheme: ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తుల గడువు, అర్హతలు, లబ్ధిదారుల వాటా, సబ్సిడీ సహా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2026, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు.. పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు
Image Credit : Gemini

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు.. పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని ఇల్లు లేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం కింద నగరంలో బహుళ అంతస్తుల భవనాల్లో ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు అందించనున్నారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డ్ విడుదల చేసిన బ్రోచర్ ప్రకారం.. ఈ ప్రాజెక్టులోని ప్రతి ఫ్లాట్ బిల్ట్-అప్ ఏరియా 528 చదరపు అడుగులు ఉంటుంది. ఫ్లాట్ కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులు ఉంటుంది. ప్రభుత్వం భూమికి ఎటువంటి రుసుము వసూలు చేయదు. ఒక్కో ఇల్లు నిర్మాణ అంచనా వ్యయం రూ.11 లక్షలు కాగా, అందులో ప్రభుత్వం రూ.5 లక్షలు సబ్సిడీగా ఇస్తుంది.

మిగిలిన రూ.6 లక్షల భాగాన్ని లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి ఇన్‌ఛార్జ్ మంత్రి డి.శ్రీధర్ బాబులతో కలిసి పథకం వివరాలు, దరఖాస్తు విధానం బ్రోచర్‌ను విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి వరకు? ఎలా అప్లై చేయాలి?
Image Credit : Chatgpt

దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి వరకు? ఎలా అప్లై చేయాలి?

ఈ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు గడువు ఇచ్చారు. అర్హులైన వారు మీసేవ కేంద్రాల ద్వారాగానీ, మీసేవ పోర్టల్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా కూడా సేవలు పొంది దరఖాస్తు సబ్మిట్ చేయవచ్చు.

ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి. దీంతోపాటు రూ.10,000 ముందస్తు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లాటరీ లేదా ఎంపికలో ఇల్లు కేటాయించకపోతే, ఈ రూ.10,000 మొత్తాన్ని తిరిగి వాపస్ ఇస్తారు. ఒకవేళ ఇల్లు కేటాయిస్తే, లబ్ధిదారుడు చెల్లించాల్సిన రూ.6 లక్షల వాటాలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. దరఖాస్తు సమయంలో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. లాటరీ సమయంలో సమర్పిస్తే సరిపోతుంది.

Related Articles

Related image1
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
Related image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
36
ఎవరెవరు అర్హులు? నిబంధనలు ఏంటి?
Image Credit : X/revanth_anumula

ఎవరెవరు అర్హులు? నిబంధనలు ఏంటి?

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేయడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది..

• నివాస అర్హత: దరఖాస్తుదారుడు గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ (CURE) ప్రాంతంలో నివాసి అయి ఉండాలి.

• సొంత ఇల్లు ఉండకూడదు: దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఔటర్ రింగ్ రోడ్ (ORR) లేదా CURE ప్రాంతంలో సొంత ఇల్లు, ఫ్లాట్ ఉండకూడదు.

• ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

• ఒక కుటుంబానికి ఒకటే: ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు మాత్రమే అనుమతిస్తారు.

• గత లబ్ధిదారులు అర్హులు కారు: గతంలో ప్రభుత్వ హౌసింగ్ పథకాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొంది ఉండకూడదు.

• నియోజకవర్గ నివాసి: అభ్యర్థి ఏ నియోజకవర్గంలో నివసిస్తున్నారో ఆ ప్రాజెక్టుకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• నిజాయితీ ముఖ్యం: తప్పుడు సమాచారం ఇచ్చినా, విషయాలు దాచిపెట్టినా లేదా డూప్లికేట్ అప్లికేషన్లు వేసినా దరఖాస్తు తిరస్కరిస్తారు.

46
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? చెల్లింపుల విధానం
Image Credit : Getty

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? చెల్లింపుల విధానం

మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. డాక్యుమెంట్లు, పేమెంట్లు చెక్ చేశాక 360 డిగ్రీల వెరిఫికేషన్ చేపడతారు. ఆదాయం, కుటుంబ వివరాలు, డూప్లికేట్ అప్లికేషన్లను గుర్తిస్తారు. లభ్యతలో ఉన్న ఇళ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

తాత్కాలిక కేటాయింపు తర్వాత, ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి దశలవారీగా చెల్లింపులు తీసుకుంటారు. లబ్ధిదారుడు చెల్లించాల్సిన రూ.6 లక్షలను నాలుగు విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది:

1. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సమయం: రూ.1.00 లక్ష

2. ఆర్సీసీ స్ట్రక్చర్ పూర్తయ్యాక: రూ.2.00 లక్షలు

3. ఫినిషింగ్ పనుల సమయం: రూ.2.00 లక్షలు

4. హ్యాండోవర్ / రిజిస్ట్రేషన్ సమయం: మిగిలిన బ్యాలెన్స్ మొత్తం.

పూర్తి మొత్తాలు చెల్లించిన తర్వాత అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఫ్లాట్‌ను లబ్ధిదారునికి అప్పగిస్తారు. ఈ ఇళ్లను 10 సంవత్సరాల వరకు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం నిషేధం. అయితే బ్యాంకు మార్టిగేజ్‌కు అనుమతి ఉంటుంది.

56
16 నియోజకవర్గాల్లో అందుబాటులో ఇళ్లు
Image Credit : Gemini AI

16 నియోజకవర్గాల్లో అందుబాటులో ఇళ్లు

ఈ పథకం కింద నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ప్రకటించింది

1. రాజేంద్రనగర్: మైలార్‌దేవ్‌పల్లి

2. మహేశ్వరం: జల్ పల్లి

3. శేరిలింగంపల్లి: రాయదుర్గం

4. ఇబ్రహీంపట్నం: బాండ్లగూడ (LIG కాలనీ)

5. మల్కాజ్‌గిరి: కౌకూర్

6. నాంపల్లి: రెడ్ హిల్స్ (HMWS&SB ఆఫీస్ పక్కన / నిలోఫర్ హాస్పిటల్ దగ్గర)

7. ఖైరతాబాద్: హకీంపేట్ దర్గా / జూబ్లీహిల్స్ (MLA కాలనీ దగ్గర)

8. కార్వాన్: కుల్సుంపురా

9. బహదూర్ పురా: నంది ముసలైగూడ

10. అంబర్ పేట్: సిటీ పోలీస్ లైన్స్

11. కూకట్ పల్లి: KPHB కాలనీ

12. మేడ్చల్: పోచారం (LIG కాలనీ)

13. కుత్బుల్లాపూర్: గాజులరామారం

14. సనత్ నగర్: పాటిగడ్డ

15. సికింద్రాబాద్ కంటోన్మెంట్: మారేడ్‌పల్లి (మహేంద్ర హిల్స్)

16. మలక్‌పేట్: గడ్డిఅన్నారం (R&B క్వార్టర్స్)

మొత్తంగా ఏటా ఒక లక్ష ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

66
మధ్యతరగతి వర్గాలకు త్వరలో గుడ్ న్యూస్
Image Credit : Asianet News

మధ్యతరగతి వర్గాలకు త్వరలో గుడ్ న్యూస్

స్థలాల లభ్యతను బట్టి ప్రస్తుతం 16 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభించామని, త్వరలోనే మిగిలిన నియోజకవర్గాలకు కూడా విస్తరిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మే నెలలోనే నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. పేదలతో పాటు, మధ్యతరగతి వర్గాలకు కూడా త్వరలోనే ప్రభుత్వం ఒక మంచి తీపి కబురు ప్రకటిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. సందేహాల కోసం కాల్ సెంటర్ నంబర్లు +91 8031335905, 040-24603572 ను సంప్రదించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
హైదరాబాద్
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
Recommended image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Recommended image3
Jobs : తెలంగాణ యువతకు బంపరాఫర్... ఈ కోర్సు చేస్తే చాలు విదేశాల్లో జాబ్ పక్కా
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
Recommended image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved