MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం

Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం

Musi Riverfront Project: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మంచిరేవుల గ్రామంలో మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ. 1,108.27 కోట్లను మంజూరుకు జీవో జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 08 2026, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్.. మంచిరేవుల ఓంకారేశ్వరాలయానికి రూ.1,108.27 కోట్లు
Image Credit : Chatgpt

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్.. మంచిరేవుల ఓంకారేశ్వరాలయానికి రూ.1,108.27 కోట్లు

హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో మరొక కీలక ముందడుగు పడింది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలో రూపుదిద్దుకుంటున్న శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయ సముదాయ సమగ్ర అభివృద్ధికి, దానికి కనెక్ట్ అయ్యే రోడ్డు నెట్‌వర్క్‌కు తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.1,108.27 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ జీవో ఆర్‌టీ నం.928ను జారీ చేసింది. మూసీ నది తీర ప్రాంతాన్ని కేవలం పర్యాటక రంగంగానే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్లాన్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆధ్యాత్మిక వైభవం: రూ.948.65 కోట్లతో ఆలయ కాంప్లెక్స్
Image Credit : X/IPRTelangana

ఆధ్యాత్మిక వైభవం: రూ.948.65 కోట్లతో ఆలయ కాంప్లెక్స్

మంచిరేవులలో నిర్మించబోయే ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌లో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి అనుబంధంగా శ్రీ వీరభద్ర–భద్రకాళి, శ్రీ లలితా మహా త్రిపురసుందరి దేవి, శ్రీ బాల గణపతి స్వామి, శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను నిర్మిస్తారు. విశాలమైన మహా మండపం, నంది మండపం, ప్రాకారాలు, ఆకాశాన్ని తాకేలా రాజగోపురాలు, విశాలమైన యాగశాల, పుష్కరిణితో పాటు భారీ శివ విగ్రహాన్ని కూడా ఇక్కడ నెలకొల్పనున్నారు.

ఆర్కిటెక్చరల్ డెవలప్‌మెంట్‌కు రూ.598.98 కోట్లు, సివిల్, అనుబంధ వసతులకు రూ.349.67 కోట్లు కలిపి మొత్తంగా రూ.948.65 కోట్లు కేటాయించారు.

35
సూపర్ కనెక్టివిటీ: రూ.159.62 కోట్లతో 6-లేన్ల రహదారి
Image Credit : AI Photo/Gemini

సూపర్ కనెక్టివిటీ: రూ.159.62 కోట్లతో 6-లేన్ల రహదారి

భక్తులు, పర్యాటకులు సులభంగా ఆలయానికి చేరుకునేలా మాస్టర్ ప్లాన్ రోడ్డును డిజైన్ చేశారు. మంచిరేవులలోని ఇస్తానా విల్లాస్ నుండి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు 2.50 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో ఆరు వరుసల బిటి రహదారిని నిర్మించనున్నారు. రూ.159.62 కోట్ల అంచనాతో చేపట్టే ఈ రహదారి.. ఆలయ కాంప్లెక్స్‌ను గ్రేహౌండ్స్ భూములు, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మీదుగా ప్రధాన మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్‌వర్క్‌కు నేరుగా కలుపుతుంది.

45
పర్యవేక్షణ కోసం హై లెవెల్ టెక్నికల్ కమిటీ
Image Credit : AI Photo/Gemini

పర్యవేక్షణ కోసం హై లెవెల్ టెక్నికల్ కమిటీ

ఈ ప్రాజెక్టులోని ప్రతి నిర్మాణాన్ని క్వాలిటీగా, పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేయడానికి ప్రభుత్వం జీవో నంబర్ 929 ద్వారా ఒక ప్రత్యేక సాంకేతిక కమిటీని నియమించింది.

• చైర్మన్: రోడ్లు & భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్

• కో-చైర్మన్: పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్

• కన్వీనర్: ఎంఆర్‌డీసీఎల్ చీఫ్ ఇంజనీర్

• సభ్యులు: దేవాదాయ శాఖ ఈఎన్సీ, ప్రసిద్ధ ఆలయ వాస్తు నిపుణుడు డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి.

ఈ కమిటీ డిజైన్లు, డ్రాయింగ్‌లు, డీపీఆర్‌ల పరిశీలనతో పాటు రాతి శిల్పాలు, ప్రత్యేక ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తుంది.

55
మూసీ పునరుజ్జీవనం: గ్లోబల్ లెవెల్ టూరిజం హబ్
Image Credit : X/IPRTelangana

మూసీ పునరుజ్జీవనం: గ్లోబల్ లెవెల్ టూరిజం హబ్

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహ్మారెడ్డి పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిధులకు ఆమోదం తెలిపింది. మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేపడుతున్న ప్రణాళికల్లో ఇది భాగం. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్, మ్యూజియం, ధ్యాన కేంద్రాల ఏర్పాటుతో పాటు, వివిధ మత ప్రార్థనా స్థలాల అభివృద్ధి ద్వారా మత సామరస్యానికి ఈ ప్రాంతాన్ని స్టేజీగా మార్చాలని సర్కార్ భావిస్తోంది.

హైదరాబాద్ శివార్లలో ఆధ్యాత్మిక శోభతో పాటు మౌలిక వసతులు మెరుగుపడడం వల్ల ఈ ప్రాంతం వేగంగా రూపాంతరం చెందనుంది. రాబోయే రోజుల్లో మూసీ ఒడ్డున నిర్మించే ఈ భారీ ఓంకారేశ్వర ఆలయ కాంప్లెక్స్ భాగ్యనగరానికే ఒక ప్రధాన ల్యాండ్‌మార్క్‌గా నిలవనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Recommended image2
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత
Related Stories
Recommended image1
EPFO: ఈపీఎఫ్ కొత్త రూల్స్.. పెరిగిన పరిమితి.. 51 లక్షల మందికి జాక్‌పాట్
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved