MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPFO: ఈపీఎఫ్ కొత్త రూల్స్.. పెరిగిన పరిమితి.. 51 లక్షల మందికి జాక్‌పాట్

EPFO: ఈపీఎఫ్ కొత్త రూల్స్.. పెరిగిన పరిమితి.. 51 లక్షల మందికి జాక్‌పాట్

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. జీతం పరిమితి రూ. 25,000 పెంచిన ఈపీఎఫ్‌ఓ. ఎవరికి ఈపీఎస్ వర్తిస్తుంది? మీ చేతికి వచ్చే జీతంపై పడే ప్రభావం ఏంటి? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 07 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈపీఎఫ్‌ఓ కొత్త రూల్స్
Image Credit : chatgpt

ఈపీఎఫ్‌ఓ కొత్త రూల్స్

కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) చట్టబద్ధమైన వేతన పరిమితిని నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన నిబంధనలు సెప్టెంబర్ 17 నుండి అమల్లోకి వచ్చాయి. దీనిపై నెలకున్న సందేహాలకు ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. రూ. 25,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) నిర్బంధంగా వర్తిస్తుందా లేదా అనే దానిపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సోషల్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరికి ఈపీఎస్ కచ్చితంగా వర్తిస్తుంది?
Image Credit : x

ఎవరికి ఈపీఎస్ కచ్చితంగా వర్తిస్తుంది?

ఈపీఎఫ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం, నెలకు రూ. 25,000 లేదా అంతకంటే తక్కువ బేసిక్ జీతం పొందే ఉద్యోగులు కచ్చితంగా పీఎఫ్, పెన్షన్ స్కీమ్‌లో భాగం కావాల్సిందే. అయితే రూ. 25,000 కంటే ఎక్కువ జీతం పొందే వారి విషయంలో రెండు నియమాలు ఉన్నాయి..

• పాత ఉద్యోగులు: ఒక ఉద్యోగి గతంలో తక్కువ జీతంతో చేరి, ఇప్పటికే ఈపీఎస్ సభ్యుడిగా ఉంటే, ఇప్పుడు వారి జీతం రూ. 25,000 దాటినా పెన్షన్ సభ్యత్వం రద్దు కాదు. అది అలాగే కొనసాగుతుంది.

• కొత్త ఉద్యోగులు: ఇదివరకు పీఎఫ్ అకౌంట్ లేక, ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరి రూ. 25,000 కంటే ఎక్కువ జీతం పొందుతుంటే, వారికి పెన్షన్ స్కీమ్‌లో చేరడం నిర్బంధం కాదు.

35
చేతికి వచ్చే జీతం తగ్గుతుందా?
Image Credit : Asianet News

చేతికి వచ్చే జీతం తగ్గుతుందా?

కొత్త నిబంధన వల్ల ప్రతినెల చేతికి వచ్చే జీతం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు, రూ. 20,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి ఇదివరకు రూ. 15,000 పరిమితి ప్రకారమే పీఎఫ్ కట్ అయ్యేది. ఇప్పుడు రూ. 20,000 మీద కట్ చేయడం వల్ల ప్రతినెల దాదాపు రూ. 600 వరకు చేతికి తక్కువ రావచ్చు.

అయితే ఈ డబ్బు వృథాగా పోదు. ఉద్యోగి ఎంతైతే దాస్తున్నారో, కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. దీనివల్ల ప్రతినెల మీ పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పొదుపు మొత్తంతో పాటు, భవిష్యత్తులో వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది.

45
పెన్షన్ విరాళంలో పెరిగిన పరిమితి
Image Credit : ChatGPT

పెన్షన్ విరాళంలో పెరిగిన పరిమితి

కంపెనీ ఇచ్చే విరాళం నుంచి కొంత భాగం ఈపీఎస్ అంటే పెన్షన్ ఖాతాలోకి వెళ్తుంది. కొత్త వేతన పరిమితి వల్ల కంపెనీ చెల్లించే గరిష్ఠ పెన్షన్ విరాళం నెలకు రూ. 1,250 నుంచి రూ. 2,083 కి పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత లభించే నెలానెలా పింఛన్ అమౌంట్ పెరుగుతుంది.

55
ఉద్యోగులు ఏ విషయాలు చెక్ చేసుకోవాలి?
Image Credit : AI

ఉద్యోగులు ఏ విషయాలు చెక్ చేసుకోవాలి?

1. శాలరీ స్లిప్: పీఎఫ్ లెక్కింపునకు మీ మొత్తం సీటీసీ కాకుండా, బేసిక్ జీతం, డియర్నెస్ అలవెన్స్ లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

2. ఈపీఎఫ్ పాస్‌బుక్: మీ శాలరీ స్లిప్‌లో కట్ అయిన పీఎఫ్, కంపెనీ వేసిన కాంట్రిబ్యూషన్ కరెక్ట్‌గా డిపాజిట్ అవుతున్నాయో లేదో ఈపీఎఫ్‌ఓ పాస్‌బుక్‌లో చెక్ చేసుకోండి.

3. ఉచిత ఇన్సూరెన్స్: పీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఉచితంగా రూ. 7 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.

ఆర్థిక భద్రతకు పెద్ద ఊరట

దాదాపు 12 ఏళ్ల తర్వాత వేతన పరిమితిని పెంచడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల మంది కొత్త వర్కర్లకు సామాజిక భద్రత లభించనుంది. ప్రస్తుతం చేతికి వచ్చే జీతంలో చిన్న కోత అనిపించినా, దీర్ఘకాలంలో ఇది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు బలమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రెపోరేటు పెంచిన ఆర్బీఐ.. రూ. 20 ల‌క్ష‌ల హోమ్‌లోన్‌పై ఎంత EMI పెర‌గ‌నుంది.?
Recommended image2
భార‌తీయ రైల్వేకు రోజుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? ఆదాయం ఎంత వ‌స్తుందో తెలుసా.?
Recommended image3
8th Pay Commission: 8వ వేతన సంఘం కీలక భేటీ.. ఉద్యోగులకు జాక్‌పాట్.. జీతం ఎంత పెరగనుందంటే?
Related Stories
Recommended image1
8th Pay Commission: 8వ వేతన సంఘం కీలక భేటీ.. ఉద్యోగులకు జాక్‌పాట్.. జీతం ఎంత పెరగనుందంటే?
Recommended image2
Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved