MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Telangana: రూ. 7500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. తెలంగాణలో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం

Telangana: రూ. 7500 కోట్లతో భారీ ప్రాజెక్ట్.. తెలంగాణలో ఈ ప్రాంత రూపురేఖలు మారడం ఖాయం

Telangana: తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 03 2026, 10:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్ లేన్ హైవే
Image Credit : Gemini AI

ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్ లేన్ హైవే

ప్రస్తుతం జాతీయ రహదారి-63లో భాగమైన ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల మార్గాన్ని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల గుండా సాగే ఈ మార్గంలో రోజురోజుకు ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట వంటి పట్టణాల గుండా వెళ్లే ఈ రూట్‌లో తరచూ వాహన రద్దీ కనిపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా ఆధునిక ప్రమాణాలతో కొత్త రహదారిని నిర్మించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జగిత్యాల-కరీంనగర్ కారిడార్‌కు ప్రత్యేక ప్రణాళిక
Image Credit : Google

జగిత్యాల-కరీంనగర్ కారిడార్‌కు ప్రత్యేక ప్రణాళిక

జాతీయ రహదారి-563లోని జగిత్యాల-కరీంనగర్ మార్గాన్ని కూడా నాలుగు లేన్ల హైవేగా మార్చనున్నారు. ఈ మార్గం జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ వంటి రద్దీ ప్రాంతాల గుండా వెళ్తుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT-Toll) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల వాహన రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మించి ట్రాఫిక్ సమస్యలను తగ్గించనున్నారు.

35
భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
Image Credit : Google

భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం

కొత్త హైవేలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ప్రస్తుతం తీసుకునే సమయంతో పోలిస్తే దాదాపు గంటన్నర వరకు ఆదా కానుంది. అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్ చేరుకునేందుకు ప్రస్తుతం కంటే సుమారు 45 నిమిషాలు తక్కువ సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ రూపొందిస్తున్నారు. దీంతో ఇంధన వినియోగం తగ్గడంతో పాటు వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

45
ఆర్థిక, ఆధ్యాత్మిక కేంద్రాలకు మెరుగైన అనుసంధానం
Image Credit : Google

ఆర్థిక, ఆధ్యాత్మిక కేంద్రాలకు మెరుగైన అనుసంధానం

ఈ రహదారుల విస్తరణ కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు. తెలంగాణలోని పలు ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక కేంద్రాలకు కొత్త ఊపును ఇవ్వనుంది. సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లోని ప్రత్యేక ఆర్థిక మండలాలు, నిజామాబాద్, సిద్దిపేట మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్ల సీఫుడ్ క్లస్టర్లకు రవాణా మరింత సులభం కానుంది.

అలాగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కాళేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా మారనుంది. నగునూరు కోట, ఖిల్లా కోట, లోయర్ మానేరు డ్యామ్ వంటి పర్యాటక ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ మెరుగుపడుతుంది.

55
వేలాది మందికి ఉపాధి.. ప్రాంతీయ అభివృద్ధికి ఊతం
Image Credit : Gemini

వేలాది మందికి ఉపాధి.. ప్రాంతీయ అభివృద్ధికి ఊతం

ఈ భారీ రహదారి ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రత్యక్షంగా 34.43 లక్షల పనిదినాలు, పరోక్షంగా 42.7 లక్షల పనిదినాలు లభించనున్నాయి.

ఇక నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లు, పారిశ్రామిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడంతో ఉత్తర తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి.

మొత్తంగా చూస్తే, రూ.7,597 కోట్లతో చేపట్టనున్న ఈ జాతీయ రహదారుల విస్తరణ తెలంగాణ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. ప్రయాణ సమయం తగ్గడం నుంచి ఉపాధి అవకాశాల పెరుగుదల వరకు అనేక ప్రయోజనాలు ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి దక్కనున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
బైక్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి ద‌గ్గ‌ర ఈ ప్రొడ‌క్ట్ ఉండాల్సిందే.. టైర్ల‌లో గాలి త‌గ్గిందో లేదో ఇట్టే తెలుస్తుంది
Recommended image2
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved