MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • చిన్నారులపై పెరుగుతున్న నేరాలు.. NCRB నివేదికలో షాకింగ్ విషయాలు

చిన్నారులపై పెరుగుతున్న నేరాలు.. NCRB నివేదికలో షాకింగ్ విషయాలు

Child Safety: ఎన్సీఆర్బీ 2023 రిపోర్టు ప్రకారం తెలంగాణలో చిన్నారులపై నేరాలు 8.1% పెరిగాయి. పోక్సో, కిడ్నాప్ కేసులు 84% చేరగా, బాధితుల్లో 92% కౌమార దశ బాలికలేనని రిపోర్టు పేర్కొంది.

3 Min read
Mahesh Rajamoni
Published : Nov 17 2025, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణలో చిన్నారులపై నేరాల్లో లైంగిక దాడులే అత్యధికం
Image Credit : our own

తెలంగాణలో చిన్నారులపై నేరాల్లో లైంగిక దాడులే అత్యధికం

చిన్నారుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తేలా ఎన్సీఆర్బీ 2023 నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. తెలంగాణలో చిన్నారులపై లైంగిక నేరాలు, కిడ్నాప్ కేసులు పెరగడం, ఈ నేరాల్లో కౌమార దశ బాలికలే ప్రధాన బాధితులు కావడం ఆందోళన కలిగిస్తోంది. CRY – Child Rights and You విశ్లేషించిన ఈ గణాంకాలు రాష్ట్రంలో చిన్నారులపై నేరాలు ఎలా నిరంతరం పెరుగుతున్నాయో స్పష్టంగా చూపిస్తున్నాయి. తెలిసినవాళ్లతోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.

తెలంగాణలో 2023 సంవత్సరంలో బాలలపై నేరాలు తీవ్రంగా పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఇటీవలి నివేదిక వెల్లడిస్తోంది. చిన్నారులపై లైంగిక నేరాలు, కిడ్నాపింగ్ నేరాల అధికంగా కొనసాగుతుండగా.. ఈ నేరాల్లో కౌమార దశ బాలికలు ప్రధాన బాధితులుగా ఉన్నారు.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2023’ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో బాలలపై నేరాలకు సంబంధించిన గణాంకాలను CRY - చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ విశ్లేషింది. ఆ నివేదిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 2023లో మొత్తం 6,113 బాలలపై నేరాలు నమోదయ్యాయి. ఇది 2022తో పోలిస్తే 8.1% పెరుగుదల. 2020 తర్వాత కొనసాగుతున్న ఆందోళనకర పెరుగుదల ధోరణి ఇదే వేగంతో కొనసాగింది.

24
బాలలపై నేరాలలో నిరంతర పెరుగుదల
Image Credit : our own

బాలలపై నేరాలలో నిరంతర పెరుగుదల

రాష్ట్రంలో 2023 వరకు ఐదేళ్లలో బాలలపై నేరాలు నిరంతరంగా పెరుగుతూ వచ్చాయి. 2020లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, 2021లో భారీగా పెరుగుదల తర్వాత కేసులు ఎప్పటికప్పుడు అధిక స్థాయిలోనే ఉన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధిక నేరాలు నమోదైన సంవత్సరం 2023 కావడం, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నట్లు సూచిస్తోంది.

అత్యధిక భాగం లైంగిక నేరాలు

చిన్నారులపై నమోదైన నేరాలలో 80% కంటే ఎక్కువ భాగం లైంగిక నేరాలు, కిడ్నాప్ కేసులదే. బాలలపై మొత్తం నేరాలలో POCSO చట్టం కింద నమోదైన నేరాలు 51.6% గా ఉన్నాయి. 2023లో మొత్తం లైంగిక నేరాలు 4,900 కేసులను దాటాయి. లైంగిక దాడి కేసులు మాత్రమే ఆ ముందటి ఏడాది 2022తో పోలిస్తే 38.3% పెరిగాయి.

POCSO కేసులు 15% పైగా పెరగడానికి.. నేర సంఘటనల పెరుగుదలతో పాటు, ఫిర్యాదులు సత్వరమే నమోదు కావడం కూడా కారణం కావచ్చు.

కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ ముప్పు

బాలల అపహరణ (కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్) కేసులు రాష్ట్రంలో నమోదైన బాలలపై నేరాల్లో రెండో స్థానంలో ఉన్నాయి. మొత్తం బాలలపై నేరాల్లో దాదాపు మూడో వంతు ఈ కేసులదే. ఇవి 2022తో పోలిస్తే 8% పైగా పెరిగాయి.

POCSO కేసులు, అపహరణ కేసులు కలిపి చూస్తే.. రాష్ట్రంలోని బాలలపై నేరాలలో 84% ఈ రెండు నేరాలదేనని తేలింది. 

Related Articles

Related image1
పాన్ కార్డు షాక్: ఎస్పీ నేత అజం ఖాన్, కుమారుడు అబ్దుల్లాకు ఏడేళ్ల జైలు శిక్ష
Related image2
ఐబొమ్మ రవి అరెస్టుతో వెలుగులోకి సంచలన విషయాలు.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
34
కౌమార దశ బాలికలకు ఎక్కువ ముప్పు
Image Credit : Perplexity AI

కౌమార దశ బాలికలకు ఎక్కువ ముప్పు

NCRB గణాంకాల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో POCSO బాధితుల్లో 99.9% మంది బాలికలే. అదికూడా.. 12–18 సంవత్సరాల మధ్యనున్న బాలికలు.. మొత్తం బాధితుల్లో 92% మందిగా ఉన్నారు. వీరిలోనూ 16–18 సంవత్సరాల వయసు బాలికలే ఎక్కువగా ఉన్నారు. ఈ సరళి.. కౌమార దశ బాలికలు లైంగిక హింస, మోసం, దోపిడీకి అత్యంత సులభంగా గురయ్యే అవకాశముందని నిర్ధారిస్తోంది.

బాధితులకు తెలిసినవారే నిందితులు

NCRB సమాచారం చెప్తున్న అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. POCSO కేసులలో 99.8% నిందితులు బాధితులకు తెలిసినవారే. ఇందులోనూ కుటుంబ సభ్యులు, పొరుగువారు, యజమానులు, ముఖ్యంగా స్నేహితులు, ఆన్‌లైన్ పరిచయస్తులు మొత్తంగా 73% వీరే ఉన్నారు.

అంటే.. చిన్నారులకు, ప్రత్యేకించి బాలికలకు, అత్యధిక ప్రమాదం బయటివారి నుంచే కాకుండా, వారికి నమ్మకమైన వారి నుంచే వస్తోంది. డిజిటల్ పరిచయాలు కూడా ప్రమాద కారకంగా మారుతున్నాయి.

పెరుగుతున్న ఇతర తీవ్ర నేరాలు

కొన్ని నేరాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. వాటి పెరుగదల ఎక్కువగా కనిపిస్తోంది. సైబర్ నేరాలు 400% కంటే ఎక్కువ పెరిగాయి. మానవ అక్రమ రవాణా కేసులు 325% పెరిగాయి. బాలికల కొనుగోలు/సేకరణ దాదాపు రెండింతలు పెరిగింది.

ఇంకోవైపు, బాల్యవివాహాలు, బాలకార్మిక నేరాలు తగ్గినప్పటికీ, ఈ సమస్యలు ఇంకా బలహీన వర్గాలలో కొనసాగుతూనే ఉన్నాయి.

మిస్సింగ్ చిల్డ్రన్: రికవరీ పెరిగినా.. 506 మంది ఆచూకీ లేదు

2023లో తెలంగాణలో మొత్తం 3,133 మంది చిన్నారులు కనిపించకుండా పోయినట్టు నమోదయింది. ఇందులో 509 పాత మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. వీరిలో 83.8% రికవరీ రేటుతో అత్యధికుల ఆచూకీ కనిపెట్టినప్పటికీ.. ఇంకా 506 మంది చిన్నారుల జాడ తెలియలేదు.

44
చిన్నారుల రక్షణకు అత్యవసరంగా పటిష్ట చర్యలు అవసరం
Image Credit : X/Telangana Police

చిన్నారుల రక్షణకు అత్యవసరంగా పటిష్ట చర్యలు అవసరం

“తెలంగాణకు సంబంధించిన NCRB 2023 డేటా ఆందోళనకరమైన విషయాలను వెల్లడిస్తోంది. ముఖ్యంగా కౌమార దశ బాలికలపై లైంగిక నేరాలను అరికట్టడానికి.. అత్యవసరంగా, భాగస్వాములందరి సమన్వయంతో పటిష్ట చర్యలు అవసరం” అని CRY – Child Rights and You సౌత్ రీజన్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ అన్నారు.

దీని కోసం ఆయన పలు సూచనలు కూడా చేశారు. వాటిలో 

కమ్యూనిటీ విజిలెన్స్ బలోపేతం చేయాలి: గ్రామ బాలల రక్షణ కమిటీలు, వార్డు బాలల రక్షణ కమిటీలను బలోపేతం చేసి, తెలిసిన పరిచయస్తుల ద్వారానూ, ఆన్‌లైన్‌ పరిచయాలతోనూ వచ్చే ప్రమాదాలపై కమ్యూనిటీ అవగాహన పెంచాలి.

డిజిటల్ సేఫ్టీ ఎడ్యుకేషన్: పాఠశాలల్లో సైబర్ భద్రత, ఆన్‌లైన్ గ్రూమింగ్ నివారణ, బాధ్యతాయుత డిజిటల్ ప్రవర్తనపై పాఠ్యాంశాలు చేర్చాలి.

సహాయక వ్యవస్థల బలోపేతం: బాధిత బాలలకు ప్రత్యేకంగా బాలికల కోసం.. కౌన్సెలింగ్, లీగల్ ఎయిడ్, పునరావాస సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి.

సైబర్ నేరాల దర్యాప్తు, పర్యవేక్షణ: సైబర్ నేరాల దర్యాప్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫికింగ్ నెట్వర్క్‌లను నిర్వీర్యం చేయాలి, మిస్సింగ్ కేసులపై ఫాలో-అప్ మెరుగుపరచాలి.

“మన పిల్లల భద్రతకు, ముఖ్యంగా మన కుమార్తెల భద్రతకు – రాష్ట్రం, సమాజం అగ్రస్థాయి ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని జాన్ రాబర్ట్స్ పిలుపునిచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
నేరాలు, మోసాలు
ఏషియానెట్ న్యూస్
పోలీసు భద్రత
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved