MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • పాన్ కార్డు షాక్: ఎస్పీ నేత అజం ఖాన్, కుమారుడు అబ్దుల్లాకు ఏడేళ్ల జైలు శిక్ష

పాన్ కార్డు షాక్: ఎస్పీ నేత అజం ఖాన్, కుమారుడు అబ్దుల్లాకు ఏడేళ్ల జైలు శిక్ష

PAN Card Case : డబుల్ పాన్ కార్డు కేసులో ఎస్పీ నేత అజం ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాకు రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మళ్లీ జైలుకెళ్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 17 2025, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాన్ కార్డు కేసు: అజం ఖాన్‌–అబ్దుల్లాకు కఠిన శిక్ష
Image Credit : X@MeghUpdates

పాన్ కార్డు కేసు: అజం ఖాన్‌–అబ్దుల్లాకు కఠిన శిక్ష

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంపై రాంపూర్ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. నకిలీ పాన్ కార్డులు పొందిన కేసులో ఇద్దరినీ దోషులుగా నిర్దారించిన కోర్టు, వారికి ఏడు ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 చొప్పున జరిమానా విధించింది. తీర్పు ప్రకటించగానే పోలీసులు వారిని కోర్టు పరిధిలోనే అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసు 2019లో నమోదు అయినప్పటికీ, 2017 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల సమయంలో పుట్టిన తేదీ మార్పులపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పుట్టిన తేదీలు మార్చి రెండు పాన్ కార్డులు
Image Credit : Incometax.com

పుట్టిన తేదీలు మార్చి రెండు పాన్ కార్డులు

అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ జనవరి 1, 1993. ఈ బర్త్ డే ప్రకారం, ఆయన 2017 ఎన్నికల్లో పోటీ చేయడానికి వయోపరిమితి పూర్తికాలేదు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించే క్రమంలో 1990 సెప్టెంబర్ 30న జన్మించినట్లు చూపే మరో పాన్ కార్డు ఉపయోగించారని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఆరోపణలతో అజం ఖాన్, అబ్దుల్లా కలిసి నామినేషన్ పత్రాల్లో అబ్దుల్లా వయసును దాచేందుకు నకిలీ పత్రాలు ఉపయోగించారని కోర్టులో సాక్ష్యాలు సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన అనంతరం వారికి పలు సెక్షన్ల కింద శిక్షలు విధించారు.

34
104 కేసుల్లో ఏడోసారి దోషిగా అజం ఖాన్
Image Credit : Getty

104 కేసుల్లో ఏడోసారి దోషిగా అజం ఖాన్

అజం ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 104 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికే 12 కేసుల్లో తీర్పులు వచ్చాయి. 7 కేసుల్లో ఆయన దోషిగా తేలగా, 5 కేసుల్లో నిర్దోషిగా తప్పించుకున్నారు. తాజాగా వచ్చిన ఈ తీర్పు, ముఖ్యంగా డబుల్ పాన్ కార్డు కేసులో శిక్షపడటం, ఆయనకు రాజకీయపరంగా తీవ్రమైన దెబ్బ అని చెప్పాలి.

సీతాపూర్ జైలులో దాదాపు 23 నెలల జైలు జీవితం గడిపిన అజం ఖాన్, ఇటీవలే బయటికి వచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ కటకటాల వెనుకకు వెళ్లాల్సి ఉంటుంది.

44
కోర్టు తీర్పుపై ఆకాశ్ సక్సేనా ఏమన్నారంటే?
Image Credit : our own

కోర్టు తీర్పుపై ఆకాశ్ సక్సేనా ఏమన్నారంటే?

ఈ కేసును మొదటగా ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా, తీర్పును స్వాగతించారు. “తీర్పు నిజానికి అక్రమాలపై విజయం. అజంపై ఉన్న ప్రతి కేసూ పత్రాల ఆధారంగానే ఉంది. నేరం చేసిన ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే” అని ఆయన పేర్కొన్నారు. వారి ఫిర్యాదు ఆధారంగానే సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

ఎస్పీ వ్యూహకర్తగా అజం ఖాన్ ప్రస్థానం

అజం ఖాన్ ఎస్పీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మైనారిటీ వర్గాల గళంగా గుర్తింపు పొందిన ఆయన, పలు దశల్లో మంత్రిగా పనిచేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండేది. ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాల్లో ఆయన కీలక నాయకుడిగా వ్యవహరించారు.

అయితే, వరుస కేసులు, లీగల్ సమస్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజా తీర్పుతో ఆయన, ఆయన కుమారుడు అబ్దుల్లా మళ్లీ జైలుకు చేరడం ఎస్పీకే కాదు, యూపీ రాజకీయాలకు కూడా కీలక పరిణామంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Recommended image2
ఐబొమ్మ రవి అరెస్టుతో వెలుగులోకి సంచలన విషయాలు.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved