MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • తెలంగాణలో కేసీఆర్ కులపోళ్లకు ఎంత భూమి ఉందో తెలుసా..?

తెలంగాణలో కేసీఆర్ కులపోళ్లకు ఎంత భూమి ఉందో తెలుసా..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కులపోళ్లు అంటే వెలమలకు ఎంత భూమి ఉందో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 16 2026, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో వెలమల ఆధిపత్యం..
Image Credit : X/Krishank_BRS

తెలంగాణలో వెలమల ఆధిపత్యం..

తెలంగాణలో డామినేటెడ్ కులం ఏదంటే రెడ్డిలు అనే సమాధానం వస్తుంది. నిజాంల కాలంనుండే రెడ్డిలు పెద్దపెద్ద జమిందార్లుగా, భూస్వాములుగా ఉన్నాయి... కాబట్టి ఇప్పటికే అన్నిరంగాల్లో వారి ఆధిపత్యం కనిపిస్తుంటుంది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కులం వెలమల ఆధిపత్యం పెరిగిందనే ప్రచారం ఉంది. కేసీఆర్ అండతో వెలమదొరలు భారీగా ఆస్తిపాస్తులు సంపాదించారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇంతకూ తెలంగాణలో కేసీఆర్ కులపోళ్లవద్ద ఎంత శాతం భూమి ఉందో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణ వెలమలకు ఎంత భూమి ఉంది..?
Image Credit : KCR/X

తెలంగాణ వెలమలకు ఎంత భూమి ఉంది..?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కులాల వారిగా ఆర్థిక, సామాజిక, విద్య వంటి కీలక వివరాలను సేకరించారు. ఈ రిపోర్ట్ ను తాజాగా ప్రభుత్వం విడుదలచేసింది. ఇందులో కులాల వారిగా ఎవరికెంత భూమి ఉంది అనే ఆసక్తికర వివరాలు కూడా ఉన్నాయి.

అయితే రాష్ట్రంలో కొన్ని కులాలవారి వద్ద అత్యధికంగా భూములు ఉన్నాయి. జనాభా శాతం కంటే భూముల శాతం ఎక్కువగా ఉన్న కులాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెలమ కులం కూడా ఉంది. రాష్ట్రంలో వెలమ జనాభా 0.4 శాతం ఉంటే వీరివద్ద 1 శాతం భూమి ఉందని కులగణన రిపోర్ట్ వెల్లడించింది.

Related Articles

Related image1
Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది
Related image2
Now Playing
తెలంగాణ కుల గణనలో ఇన్ని తప్పులా?: MP Dharmapuri Aravind on Telangana Caste Census | Asianet Telugu
35
తెలంగాణలో అత్యధిక భూములున్న కులాలివే...
Image Credit : Getty

తెలంగాణలో అత్యధిక భూములున్న కులాలివే...

తెలంగాణ కులగణన ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భూములున్నది రెడ్డి కులస్తుల వద్దే. వీరి జనాభా కేవలం 4.8 శాతమే... కానీ వీరివద్ద గల భూములు ఏకంగా 13.5 శాతం. అంటే ఇంకా అత్యధికమంది రెడ్డిలు భూస్వాములుగా కొనసాగుతున్నారన్నమాట.

రెడ్డిల తర్వాత తెలంగాణలో ఎక్కువగా భూములు కలిగినది యాదవులే. రాష్ట్రంలో వీరి జనాభా 5.7 శాతం... కానీ 8.7 శాతం భూములు వీరివద్ద ఉన్నాయి. ఇక తెలంగాణలో లంబాడాల జనాభా 6.8 శాతం, వీరివద్ద భూములు 8.6 శాతం...ముదిరాజ్ లు 7.4 శాతం, వీరివద్ద భూములు 7.8... మాదిగలు 10.3 శాతం, భూములు 6.5 శాతంగా ఉన్నాయి.

45
6 కులాల చేతిలో 51.5 శాతం భూములు..
Image Credit : Gemini AI

6 కులాల చేతిలో 51.5 శాతం భూములు..

తెలంగాణలో కులాల మధ్య అసమానతలను కుటుంబ సర్వే బైటపెట్టింది. రాష్ట్రంల్లో వందలాది కులాలుండగా కేవలం నాలుగైదు కులాలవద్దే 50 శాతానికి పైగా భూమి ఉందని ఈ సర్వేలో తేలింది. జనాభా ప్రకారం చూస్తే 38 శాతం ప్రజలు కలిగిన సామాజికవర్గాల వద్ద 50 శాతం... మిగతా 72 శాతం జనాభా కలిగిన కులాలవద్ద మరో 50 శాతం భూమి ఉందని కులగణన రిపోర్ట్ చెబుతోంది.

55
తెలంగాణలో అత్యధిక జనాభా బిసిలే...
Image Credit : X/Telangana Congress

తెలంగాణలో అత్యధిక జనాభా బిసిలే...

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు బిసిలే అని ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. రాష్ట్రంలో బిసిలు 56 శాతానికి పైగా ఉన్నట్లు తేలింది... ఇక ఎస్సీలు 17 శాతం, ఓసిలు 15 శాతం ఉన్నారు.

కులాలవారిగా చూసుకుంటే మాదిగలు 10 శాతం, షేక్ ముస్లింలు 7.9 శాతం, ముదిరాజ్ లు 7.4 శాతం, లంబాడాలు 6.8 శాతం, యాదవులు 5.7 శాతం ఉన్నారు. అత్యధికంగా భూములు, ఆస్తులు కలిగిన రెడ్డిల జనాభా తెలంగాణలో కేవలం 4.8 శాతమే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
అనుముల రేవంత్ రెడ్డి
భారత రాష్ట్ర సమితి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavitha: ఈసారి కేటీఆర్‌కు క‌విత రాఖీ క‌డ‌తారా లేదా.? అన్న‌పై చెల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
50 అంత‌స్తుల్లో అద్భుత నిర్మాణం.. ఒక్కో ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లు, ఎక్క‌డంటే.?
Recommended image3
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Related Stories
Recommended image1
Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది
Recommended image2
Now Playing
తెలంగాణ కుల గణనలో ఇన్ని తప్పులా?: MP Dharmapuri Aravind on Telangana Caste Census | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved