MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం

Telangana: లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో కీలక చర్చలు జరిపింది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క ఒప్పందాలు జ‌రిగాయి.

3 Min read
Author : Narender Vaitla
Published : Aug 22 2026, 10:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేంబ్రిడ్జ్‌తో తెలంగాణకు కొత్త భాగస్వామ్యం
Image Credit : Revanth Reddy/X

కేంబ్రిడ్జ్‌తో తెలంగాణకు కొత్త భాగస్వామ్యం

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యావేత్తలు, ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తెలంగాణలో ప్రపంచస్థాయి విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్ర బృందం వివరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో విద్య, పరిశోధనకు అనుకూలమైన మౌలిక వసతులు, ప్రతిభావంతులైన యువత, టెక్నాలజీ రంగంలో రాష్ట్రానికి ఉన్న బలాలను ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యా కార్యక్రమాలు, పరిశోధన ప్రాజెక్టులు, ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాల్లో కేంబ్రిడ్జ్‌తో కలిసి పనిచేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనగా ఉంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలతో అనుసంధానం ద్వారా రాష్ట్ర విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యువ పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేషన్, మెంటరింగ్
Image Credit : Revanth Reddy/X

యువ పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేషన్, మెంటరింగ్

విద్యతో పాటు స్టార్టప్ రంగంపైనా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. తెలంగాణలోని యువ పారిశ్రామికవేత్తలకు కొత్త వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించడం, స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం అందించడం, ఇంక్యుబేషన్ సదుపాయాలను విస్తరించడం వంటి అంశాలను పరిశీలించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు, పరిశోధన, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన మెంటరింగ్ వంటి అంశాల్లో సహకారం అందించే అవకాశాలపై చర్చ సాగింది. ఇరు పక్షాలు భవిష్యత్ సహకారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

Related Articles

Related image1
కుక్క ప‌ని గాడిద చేస్తే ఏమ‌వుతుందో తెలుసా.? మీ కండ్లు తెరిపించే కథ
Related image2
ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం
35
తెలంగాణతో కలిసి పనిచేసేందుకు లివర్‌పూల్ ఆసక్తి
Image Credit : Revanth Reddy/X

తెలంగాణతో కలిసి పనిచేసేందుకు లివర్‌పూల్ ఆసక్తి

లండన్ పర్యటనలో తెలంగాణకు మరో కీలక ప్రతిపాదన వచ్చింది. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగం ఆసక్తి వ్యక్తం చేసింది. లివర్‌పూల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. భవిష్యత్ సహకారానికి సంబంధించిన ఒప్పందం దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలతో పాటు టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, క్రియేటివ్ ఎకానమీ రంగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను ఈ పర్యటన ద్వారా అన్వేషించనున్నారు.

In London, I had a highly productive meeting with an academic team from the University of #Cambridge, along with Minister Sri D. Sridhar Babu garu, Sri K. Ramakrishna Rao and Sri Jayesh Ranjan.

We discussed bringing world-class education, research and innovation to #Hyderabad… pic.twitter.com/rF2ZxbGY1e

— Revanth Reddy (@revanth_anumula) August 22, 2026

45
ఇంపీరియల్ కాలేజీతో విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు
Image Credit : Revanth Reddy/X

ఇంపీరియల్ కాలేజీతో విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలతో పాటు పరిశోధన రంగంలో పరస్పర సహకారం అందించే అంశాన్ని కూడా ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులు పరిశీలించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా డిసెంబరులో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఇంపీరియల్ కాలేజీ ప్రతినిధులను రామకృష్ణారావు ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

It was a pleasure to meet Susan Finnegan and Nuala Gallagher from Liverpool City Development, along with colleagues from #LiverpoolFootballClub in #London today.

I am delighted that Liverpool is keen to build a strategic partnership with #Telangana in life sciences, technology,… pic.twitter.com/haCXxUksp8

— Revanth Reddy (@revanth_anumula) August 22, 2026

55
గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్‌.. అంతర్జాతీయ భాగస్వామ్యాలే లక్ష్యం
Image Credit : Revanth Reddy/X

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్‌.. అంతర్జాతీయ భాగస్వామ్యాలే లక్ష్యం

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజీ వంటి ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలతో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ ఉన్నత విద్య, పరిశోధన రంగాలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు లివర్‌పూల్‌తో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, క్రీడలు, సృజనాత్మక రంగాల్లో భాగస్వామ్యానికి మార్గం ఏర్పడుతోంది. హైదరాబాద్‌ను కేవలం ఐటీ, పరిశ్రమల కేంద్రంగా కాకుండా విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, వ్యాపార సంస్థలతో అనుసంధానం పెంచడం ద్వారా స్థానిక విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రపంచస్థాయి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం
Recommended image2
ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం
Recommended image3
Hyderabad Real Estate : మూడు నెలల్లోనే ఎకరం ధర ఏకంగా రూ.27 కోట్లు పెరిగిందా? అక్కడ అసలు ధర తెలిస్తే షాక్
Related Stories
Recommended image1
కుక్క ప‌ని గాడిద చేస్తే ఏమ‌వుతుందో తెలుసా.? మీ కండ్లు తెరిపించే కథ
Recommended image2
ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved