Bathukamma : గిన్నిస్ రికార్డుల్లోకి తెలంగాణ బతుకమ్మ.. ఆ రెండు రికార్డులు ఏంటో తెలుసా?
Bathukamma Guinness Record: తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధించింది. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 63 అడుగుల భారీ బతుకమ్మతో, పెద్ద సంఖ్యలో మహిళల బతుకమ్మ ఆడి (జానపద నృత్యంతో)తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డులు సాధించింది.

Bathukamma : 63 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో, సుమారు 7 టన్నుల బరువుతో రూపొందించిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో అలంకరించిన ఈ బతుకమ్మను చూసేందుకు వేలాదిమంది మహిళలు హాజరయ్యారు.
సరూర్ నగర్ బతుకమ్మ వేడుకలకు రెండు గిన్నిస్ రికార్డులను ప్రకటించిన గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు ప్రతినిథులు pic.twitter.com/Ft90h4xQg3
— Tharun Reddy (@Tarunkethireddy) September 29, 2025
Bathukamma : 1354 మహిళల జానపద నృత్యంతో బతుకమ్మ సంబరాలు
ఈ వేడుకలో ఒకేసారి 1354 మంది మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడి, అతి పెద్ద జానపద నృత్యంగా (బతుకమ్మ ఆడటం) గిన్నిస్ రికార్డు సృష్టించారు. బంతి, చేమంతి, తంగేడు, గులాబీ వంటి తెలంగాణకు ప్రత్యేకమైన పూలతో చేసిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో...
గిన్నిస్ రికార్డ్ బతుకమ్మ వేడుకలు...
63 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడుతోన్న 10 వేల మంది మహిళలు#Bathukamma#Telanganapic.twitter.com/ztGnAqu41N— Congress for Telangana (@Congress4TS) September 29, 2025
Bathukamma Guinness Records : తెలంగాణ బతుకమ్మ రెండు గిన్నిస్ రికార్డులు
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ బతుకమ్మ రెండు వర్గాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
1. అతి పెద్ద బతుకమ్మ (63 అడుగుల ఎత్తు)
2. అతి పెద్ద జానపద నృత్యం (1354 మంది మహిళలు ఒకేసారి పాల్గొనడం)
ఈ ఘనతతో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత ప్రపంచ స్థాయిలో మరింత వెలుగొందింది.
Proud moment for Telangana! 🌸
Bathukamma enters Guinness World Records with 2 feats
🌼 Tallest Bathukamma at 63 ft
🌼 Largest folk dance with 1,354 women playing together
Kudos to Revanth Reddy Govt for showcasing Telangana culture globally! 👏🔥
#Bathukamma2025#Telangana… pic.twitter.com/HO3JmzuV40— Marpu Modalaindi (@MarpuModalaindi) September 29, 2025
Bathukamma : బతుకమ్మ మహిళా శక్తికి నిదర్శనం.. మంత్రి సీతక్క
ఈ వేడుకలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. మంత్రి సీతక్క స్వయంగా బతుకమ్మ పాట పాడి మహిళలను అలరించారు. ఆమె మాట్లాడుతూ, “మన బతుకమ్మ నేడు ప్రపంచ వేదికపై నిలిచింది. ఇది మహిళా శక్తికి నిదర్శనం” అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బతుకమ్మ పండుగను పర్యావరణ సంరక్షణ, ఐక్యతకు ప్రతీకగా పేర్కొంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma : బతుకమ్మ తెలంగాణ సంస్కృతి గర్వకారణం
బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఐక్యతను, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రధాన పండుగ. ఈసారి గిన్నిస్ రికార్డులతో బతుకమ్మ ప్రాధాన్యం అంతర్జాతీయంగా పెరిగింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, “బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేయడం మన అదృష్టం. ఈ విజయంతో తెలంగాణ సంస్కృతి మరింత వెలుగొందింది” అని తెలిపారు. గిన్నిస్ రికార్డులతో తెలంగాణ బతుకమ్మ కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికీ, ప్రపంచానికీ గర్వకారణంగా నిలిచింది.