MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Weather Update: ద్రోణి ఎఫెక్ట్ తో రాబోయే వారం రోజులు వానలే వానలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్

Weather Update: ద్రోణి ఎఫెక్ట్ తో రాబోయే వారం రోజులు వానలే వానలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 15 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
Image Credit : Gemini

తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు జోరందుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాబోయే ఏడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.

ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోయినా.. ఆ తర్వాత మూడు రోజుల్లో టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూన్ 18 నుంచి భారీ వర్షాలు.. మూడు రోజులు హై అలర్ట్
Image Credit : Getty

జూన్ 18 నుంచి భారీ వర్షాలు.. మూడు రోజులు హై అలర్ట్

కేరళను టైంకి టచ్ చేసిన నైరుతి రుతుపవనాలు..  తెలంగాణ అంతటా విస్తరించడానికి మరో 4 నుంచి 5 రోజుల టైం పట్టేలా ఉంది. దీనివల్ల వానల అసలు సిసలైన వానల జోరు జూన్ 18 తర్వాతే కనిపించనుందని వాతావరణ శాఖ తెలిపింది.

జూన్ 18 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ టైంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. హైదరాబాద్ సిటీలో కూడా ఈ మూడు రోజులు స్కై మొత్తం క్లౌడీగా ఉండి, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

Related Articles

Related image1
Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్
Related image2
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
35
ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో వానల జోరు
Image Credit : AI

ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో వానల జోరు

ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడొచ్చు.

మంగళవారం పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరితో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడతాయి. ఇక బుధ, గురువారాల్లో నిర్మల్, నిజామాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో వానలు జోరందుకుంటాయి. ఆదివారం కూడా రాష్ట్రంలోని చాలా ఏరియాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.

45
ఏపీకి ద్రోణి ఎఫెక్ట్.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్
Image Credit : Asianet News

ఏపీకి ద్రోణి ఎఫెక్ట్.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం ఏపీలోని మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ లైట్ టు మోడరేట్ వానలు కురుస్తాయి.

55
ఒకవైపు వానలు.. మరోవైపు మండిన ఎండలు
Image Credit : Gemini

ఒకవైపు వానలు.. మరోవైపు మండిన ఎండలు

ఒకవైపు వానలు పడుతున్నా.. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. శనివారం 40 డిగ్రీల లోపు ఉన్న టెంపరేచర్స్.. ఆదివారం నాటికి ఒక్కసారిగా 2 డిగ్రీలు పెరిగి 42 డిగ్రీల మార్కును క్రాస్ చేశాయి. స్టేట్ మొత్తంలో హయ్యెస్ట్‌గా పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Recommended image2
Now Playing
రాజగోపాల్ రెడ్డి పేరు ఎత్తగానే దద్దరిల్లిన సభ | Uttam Kumar Speech at Nakrekal
Recommended image3
Now Playing
నల్గొండ గద్దర్ పాట ఎలివేషన్స్ తో... Revanth Public Meeting at Nakrekal
Related Stories
Recommended image1
Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్
Recommended image2
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved