MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్

Deepti Sharma: ఇదెక్కడి మాస్ బౌలింగ్ అబ్బా.. దీప్తి శర్మ దెబ్బకు పాకిస్తాన్ ఖేల్ ఖతం.. 5 వికెట్లతో వరల్డ్ రికార్డ్

Deepti Sharma : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ 5 వికెట్లతో చరిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. మెగా టోర్నీని భారత్ విజయంతో ప్రారంభించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 15 2026, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దీప్తి శర్మ వరల్డ్ రికార్డు: పాకిస్థాన్‌పై భారత్ మాస్ విక్టరీ
Image Credit : X/BCCIWomen

దీప్తి శర్మ వరల్డ్ రికార్డు: పాకిస్థాన్‌పై భారత్ మాస్ విక్టరీ

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ గట్టిగా ఉండటంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో స్లో అవుతుందని భావించి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు మీడియం పేసర్లతో బరిలోకి దిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మంధాన హాఫ్ సెంచరీ.. పాక్‌కు భారీ టార్గెట్
Image Credit : Asianet News

మంధాన హాఫ్ సెంచరీ.. పాక్‌కు భారీ టార్గెట్

మొదట బ్యాటింగ్ చేసిన ఉమెన్ ఇన్ బ్లూ నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్థాన్ ముందు 171 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 44 బంతుల్లోనే 68 పరుగులు చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిసింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, వికెట్ కీపర్ రీచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులతో మెరుపులు మెరిపించారు. వీరి ఇన్నింగ్స్ వల్ల భారత్ స్కోరు బోర్డుపై 170 పరుగులు పెట్టగలిగింది.

Related Articles

Related image1
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Related image2
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో వినీషియస్ జూనియర్ మ్యాజిక్ గోల్.. ట్రావిస్ స్కాట్ క్రేజీ సెలబ్రేషన్స్ వైరల్ !
35
దీప్తి శర్మ మాయాజాలం.. చరిత్రలో ఫస్ట్ టైమ్
Image Credit : Getty

దీప్తి శర్మ మాయాజాలం.. చరిత్రలో ఫస్ట్ టైమ్

లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ బరిలోకి దిగగా భారత్ స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో 350 వికెట్ల మార్కును దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా స్పిన్నర్‌గా దీప్తి శర్మ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మరే స్పిన్నర్‌కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

45
టీ20ల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్
Image Credit : Getty

టీ20ల్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్

దీప్తి శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున 275 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 145 టీ20లు, 124 వన్డేలు, 6 టెస్టులు ఉన్నాయి. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 166 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఆమె వన్డేలు, టీ20లు రెండింటిలోనూ విడివిడిగా 160 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం విశేషం. గతేడాది జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో కూడా 22 వికెట్లతో ఆమె టాప్ వికెట్ టేకర్లలో ఒకరిగా నిలిచింది. ఆ టోర్నీ ఫైనల్లో 5 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కూడా గెలుచుకుంది.

55
గోల్డెన్ ఆర్మ్.. తొలి టైటిల్ వేటలో భారత్
Image Credit : X/BCCI

గోల్డెన్ ఆర్మ్.. తొలి టైటిల్ వేటలో భారత్

బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ దీప్తి శర్మ తన 'గోల్డెన్ ఆర్మ్'తో అదరగొట్టింది. పాకిస్థాన్ కీలక బ్యాటర్‌ను రనౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. టీమిండియా వికెట్ల కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో దీప్తి శర్మనే తొలి బ్రేక్‌త్రూ అందించింది. ఐసీసీ టోర్నమెంట్లలో దీప్తి శర్మ ఎప్పుడూ భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా నిలుస్తోంది. ఇది ఆమెకు నాలుగో టీ20 వరల్డ్ కప్. ఈసారి ఎలాగైనా తమ మొదటి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team india: కెప్టెన్ శ్రేయస్‌కు తిక్క రేగింది.. టీమిండియా వరుస ఓటములపై లైవ్‌లోనే సీరియస్
Recommended image2
IND vs ENG: వరుసగా 5 మ్యాచ్ లలో చిత్తు.. భారత్ ఓటమికి టాప్ 5 కారణాలు ఇవే
Recommended image3
IND vs ENG: తిలక్ వర్మ సహా ఇద్దరు స్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు
Related Stories
Recommended image1
Tirumala Tirupati Secret : తిరుమల గుడి తలుపులు తెరిచాక లోపలికి వెళ్లే ఆ మొదటి వ్యక్తి ఎవరు?
Recommended image2
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో వినీషియస్ జూనియర్ మ్యాజిక్ గోల్.. ట్రావిస్ స్కాట్ క్రేజీ సెలబ్రేషన్స్ వైరల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved