MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Weather Update: కుండపోత వర్షాలు, ఈదురు గాలులు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: కుండపోత వర్షాలు, ఈదురు గాలులు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 06 2026, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈదురు గాలులు, పిడుగులతో వానలు.. వాతావరణ శాఖ వార్నింగ్
Image Credit : Gemini

ఈదురు గాలులు, పిడుగులతో వానలు.. వాతావరణ శాఖ వార్నింగ్

గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోతకు అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. దక్షిణ తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసర ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీని ప్రభావంతో జూన్ 6 నుంచి జూన్ 10 వరకు ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వానల దెబ్బకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 2 నుండి 5 డిగ్రీల వరకు తగ్గిపోనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Image Credit : X/metcentrehyd

తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ వానలు దంచికొట్టనున్నాయి.

వీటితో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలలో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అంచనా ఉంది. ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ చేసింది.

Related Articles

Related image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Related image2
National Highway: తెలంగాణలో ఆ జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి.. కేంద్రం మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ !
35
ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణం.. ఏపీ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక
Image Credit : Gemini AI

ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణం.. ఏపీ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు మండే ఎండలతో వాతావరణం వైవిధ్యంగా ఉండబోతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఈ భిన్నమైన పరిస్థితులు ఉంటాయని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.

ద్రోణి ప్రభావం వల్ల శనివారం పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

45
గంటకు 60 కిమీ వేగంతో గాలులు.. పిడుగుల జాగ్రత్తలు
Image Credit : Gemini AI

గంటకు 60 కిమీ వేగంతో గాలులు.. పిడుగుల జాగ్రత్తలు

శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలైన కొత్తూరు, హిరమండలంలో గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో భీకరమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వానలు పడనున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

అయితే, మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా గట్టిగానే ఉండనుంది. ఇక్కడ కొన్ని చోట్ల 40 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు, అలాగే అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల లాంటి జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

55
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. మన దగ్గరకు ఎప్పుడంటే?
Image Credit : Getty

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. మన దగ్గరకు ఎప్పుడంటే?

దేశంలో వానాకాలం ఎంట్రీ ఇచ్చేసింది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా, అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా ఇవి జూన్ 1నే రావాల్సి ఉంది. ప్రస్తుతం కేరళ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోకి కూడా ఇవి ఎంట్రీ ఇచ్చాయి.

ఈ రుతుపవనాలు రానున్న వారం రోజుల్లో క్రమంగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయి, జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరిస్తాయని సమాచారం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
National Highway: తెలంగాణలో ఆ జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి.. కేంద్రం మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved