MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Hyderabad : హైదరాబాద్ కు ఈ పేరు ఎలా వచ్చింది? ఎవరీ హైదర్?

Hyderabad : హైదరాబాద్ కు ఈ పేరు ఎలా వచ్చింది? ఎవరీ హైదర్?

కులీ కుతుబ్ షా, భాగమతి ప్రేమకథ వల్ల ‘హైదరాబాద్’ పేరు వచ్చిందనే ప్రచారం ఉంది. కానీ ఈ నవాబుల నగరం పేరువెనక మరో ఆసక్తికరమైన స్టోరీ కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 10 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ పేరు వెనక ఆసక్తికర స్టోరీ
Image Credit : Gemini AI

హైదరాబాద్ పేరు వెనక ఆసక్తికర స్టోరీ

Hyderabad : ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా.. ఇప్పుడు తెలంగాణ రాజధానిగా నిజాంల నగరం హైదరాబాద్ ఓ వెలుగు వెలుగుతోంది. దక్కన్ పీఠభూమిపై వెలిసిన ఈ నగరానికి నాలుగు శతాబ్దాలకు పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక వైవిధ్యం సమ్మిళితమైన ఈ మహానగరం నేడు ప్రపంచ పటంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ నగరానికి 'హైదరాబాద్' అనే పేరు ఎలా వచ్చింది? అనే అంశంపై చారిత్రకారుల్లో, ప్రాచుర్యంలో ఉన్న కథనాల్లో భిన్నమైన ఆసక్తికరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కుతుబ్ షాహీల నాటి ప్రేమకథల నుంచి మతపరమైన విశ్వాసాల వరకు ఈ నగర నామకరణం వెనుక ఉన్న చారిత్రక విశేషాలు ఎంతో ఆకట్టుకుంటాయి. మరి ఈ నవాబుల నగరానికి 'హైదరాబాద్' పేరు రావడం వెనకన్న ఆసక్తికర స్టోరీలను తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భాగమతి - కుతుబ్ షా ప్రేమగాథ
Image Credit : Asianet News

భాగమతి - కుతుబ్ షా ప్రేమగాథ

హైదరాబాద్ పేరుకు సంబంధించి అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథనం గోల్కొండ ఐదవ సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా, భాగమతిల ప్రేమాయణం. కుతుబ్ షా మూసీ నది ఒడ్డున ఉన్న చించల (నేటి చంచల్ గూడ) గ్రామానికి చెందిన భాగమతి అనే హిందూ యువతిని ప్రాణంగా ప్రేమించాడు. నాటి రాజవంశ నియమాలు, సామాజిక పరిస్థితుల ప్రకారం ఇతర మతానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడం సులభం కాకపోవడంతో, భాగమతి ఇస్లాం మతాన్ని స్వీకరించి కుతుబ్ షాను వివాహమాడిందని కథలుకథలుగా చెప్పుకుంటారు.

అయితే ఇస్లాం స్వీకరించిన అనంతరం భాగమతికి 'హైదర్ మహల్' అనే పేరు పెట్టారు. సుల్తాన్ తన ప్రియరాలిపై ఉన్న అమితమైన అనురాగంతో ఈ ప్రాంతానికి మొదట 'బాగ్ నగర్' అని పెట్టారు.. తదనంతరం ఆమె పేరు 'హైదర్ మహల్' ఆధారంగా 'హైదరాబాద్' (హైదర్ నగరం) అని మార్చినట్లు అనేకమంది చారిత్రకారులు విశ్లేషిస్తారు.

Related Articles

Related image1
Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి
Related image2
Hyderabad: హైద‌రాబాదీల‌కు హ్యాపీ న్యూస్‌.. ఇక రోడ్డు క్రాస్ చేయడానికి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు
35
హైదరాబాద్ లో ఈ హైదర్ ఎవరు?
Image Credit : Asianet News

హైదరాబాద్ లో ఈ హైదర్ ఎవరు?

మరొక చారిత్రక కథనం ప్రకారం.. హైదరాబాద్ పేరు వెనుక ఆధ్యాత్మిక కోణం ఉందనే వాదన కూడా ఉంది. ముహమ్మద్ కులీ కుతుబ్ షా అత్యంత దైవభక్తి కలిగిన పాలకుడు. ఆయన ఇస్లామిక్ చరిత్రలో నాల్గవ ఖలీఫా, ప్రవక్త మహమ్మద్ అల్లుడైన హజరత్ అలీని ఎంతో ఆరాధించేవాడు. హజరత్ అలీకి ఉన్న మరొక పేరు 'హైదర్' (అంటే వీరుడు లేదా సింహం అని అర్థం).

మూసీ నది ఒడ్డున నూతన నగర నిర్మాణం చేపట్టిన సందర్భంలో హజరత్ అలీ పట్ల ఉన్న గౌరవంతో సుల్తాన్ ఈ నగరానికి 'హైదరాబాద్' అని పేరు పెట్టాడని కొన్ని చారిత్రక గ్రంథాలు పేర్కొంటున్నాయి. నాటి నాణేలు, అధికారిక రికార్డుల్లో కూడా హైదరాబాద్ పేరునే పొందుపరచడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.

45
హైదరాబాద్ హిస్టరీకి అద్దం పట్టే పర్యాటక రంగం
Image Credit : Gemini

హైదరాబాద్ హిస్టరీకి అద్దం పట్టే పర్యాటక రంగం

పేరు ఏ విధంగా వచ్చినప్పటికీ కాలక్రమేణా హైదరాబాద్ ఊహించని రీతిలో విస్తరించింది. ఒకవైపు నాలుగు శతాబ్దాల హిస్టరీకి సజీవ సాక్ష్యాలుగా నిలిచే చార్మినార్, గోల్కొండ కోట, వైభవోపేతమైన ఫలక్ నుమా ప్యాలెస్, నగర గుండెకాయ లాంటి హుస్సేన్ సాగర్ వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులను మంత్రముగ్దులను చేస్తాయి. దక్కన్ సంస్కృతికి, నాటి శిల్పకళా వైభవానికి ఈ కట్టడాలు నేటికీ నిలువెత్తు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

55
ఆధునిక ఐటీ విప్లవంతో మారిన హైదరాబాద్ రూపురేఖలు
Image Credit : Gemini AI

ఆధునిక ఐటీ విప్లవంతో మారిన హైదరాబాద్ రూపురేఖలు

చారిత్రక నేపథ్యంతో పాటు ఆధునిక సాంకేతిక రంగానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒకప్పుడు తోటల నగరంగా ఉన్న ప్రాంతం నేడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ వంటి అంతర్జాతీయ స్థాయి ఐటీ కారిడార్లతో గ్లోబల్ టెక్ హబ్ గా రూపాంతరం చెందింది. ప్రపంచంలోనే ప్రముఖ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ అతిపెద్ద కార్యాలయాలను నెలకొల్పాయి. దీనికితోడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి లగ్జరీ నివాస ప్రాంతాలు నగర ఆధునిక రూపురేఖలను, ఆర్థిక ప్రగతిని స్పష్టంగా చూపుతున్నాయి.

ఒకవైపు ముస్లిం మెజారిటీగా గల ఓల్డ్ సిటీ, మరోవైపు హిందువులు మెజారిటీ గల నూతన నగరం... అయినా హైదరాబాద్ శతాబ్దాలుగా ‘గంగా-జమునా తెహజీబ్’ అనే సాంస్కృతిక సామరస్యానికి నిలయంగా ఉంది. పేద, మధ్యతరగతి, సంపన్నులు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ నగరం ఉపాధిని, ఆశ్రయాన్ని అందిస్తుంది. ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చిన వారినైనా తన సొంత బిడ్డల్లా ఆదరించే విశాల హృదయం ఈ నగరానికి ఉంది. చారిత్రక వారసత్వాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా సమ్మేళనం చేసుకుంటూ ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్ సగర్వంగా దూసుకుపోతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి
Recommended image2
Hyderabad: హైద‌రాబాదీల‌కు హ్యాపీ న్యూస్‌.. ఇక రోడ్డు క్రాస్ చేయడానికి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved